
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ప్రయాణం ముగిసింది. చేతి వేలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మధ్యలోనే మాక్స్‌వెల్ వైదొలిగాడు. ప్రాక్టీస్ సెషన్‌లో మాక్స్‌వెల్ చేతి వేలికి ఫ్రాక్చర్ అయింది.
ఈ విషయాన్ని సీఎస్‌కేతో మ్యాచ్ సందర్బంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ధ్రువీకరించాడు. టాస్ సమయంలో అయ్యర్ మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తూ మాక్స్‌వెల్ చేతి వేలికి ఫ్రాక్చర్ అయింది. నిజంగా మాకు ఇది గట్టి ఎదురుదెబ్బ. అతడి స్ధానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదు అని పేర్కొన్నాడు.
మాక్స్‌వెల్ ప్రస్తుతం జట్టుతో పాటు ఉన్నప్పటికి త్వరలోనే తన స్వదేశానికి పయనం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది సీజన్‌లో మాక్స్‌వెల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్‌లో ఒకట్రెండు వికెట్లు పడగొట్టినప్పటికి, బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. మాక్స్‌వెల్ 6 ఇన్నింగ్స్‌లలో 8.00 సగటు కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి: ZIM vs BAN: మమ్మల్నే ఓడిస్తారా? ప్రతీకారం తీర్చుకున్న బంగ్లాదేశ్