ఆంధ్రా కెప్టెన్ గా మహ్మద్ కైఫ్!
కాన్పూర్: గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీంఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. ఇక ఆ రాష్ట్రానికి గుడ్ బై చెప్పనున్నాడు. రాబోయే రంజీ సీజన్ లో ఆంధ్రప్రదేశ్ తరుపున బరిలో దిగేందుకు నిర్ణయించుకున్నాడు. 16 సంవత్సరాలుగా యూపీ తరుపున ఆడిన ఈ క్రికెటర్.. త్వరలో ఆంధ్రా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. యువకులను వెలుగులోకి తెచ్చేందుకు యూపీ క్రికెట్ అసోసియేషన్ నడుంబిగించడంతో కైఫ్ కు ముగింపు పలికింది. దీనిలో భాగంగానే కైఫ్.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ తో రెండు సంవత్సరాల పాటు ఒప్పందం చేసుకున్నాడు.
ఫస్ట్ క్రికెట్ లో మంచి రికార్డు ఉన్న కైఫ్ సేవలను ఆంధ్రా రంజీ క్రికెట్ అసోసియేషన్ వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇప్పటివరకూ కైఫ్ ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 9,277 పరుగులు, 143 క్యాచ్ లు, 20 వికెట్లు తీసుకున్నాడు.