టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ తన రంజీ ట్రోఫీ అరంగేట్రంలో అదరగొట్టాడు. రంజీ ట్రోఫీ-2024 సీజన్‌లో భాగంగా ఆంధ్రాతో మ్యాచ్‌తో బెంగాల్ తరుపున మహ్మద్ కైఫ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కైఫ్ 3 వికెట్లు పడగొట్టి అందరని అకట్టుకున్నాడు.
కైఫ్‌కు కేవలం ఒకే ఇన్నింగ్స్‌లో మాత్రం బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. ఓవరాల్‌గా మొదటి ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లు బౌలింగ్ చేసిన కైఫ్.. కవలం 62 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. ఇక ఆంధ్ర, బెంగాల్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 409 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బెంగాల్ బ్యాటర్లలో ముజుందార్(125) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అనంతరం ఆంధ్ర జట్టు సైతం తమ తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. ఆంధ్ర కూడా 445 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. 36 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బెంగాల్ ఆఖరి రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
చదవండి: IND vs SA: రోహిత్ వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్.. చర్యలకు సిద్దం!?
Comments
Please login to add a commentAdd a comment