Bengal cricketer
-
వారెవ్వా అభిషేక్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో
బెంగాల్ ప్రో టీ20-2024 సీజన్లో సంచలన క్యాచ్ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం మేదినీపూర్ విజార్డ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హౌరా వారియర్స్ ఆటగాడు అభిషేక్ దాస్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఊహకందని రీతిలో క్యాచ్ పట్టి ఔరా అనిపించుకున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మేదినీపూర్ విజార్డ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మేదినీపూర్ ఇన్నింగ్స్ 19వ వేసిన ఫాస్ట్ బౌలర్ కనిష్క్ సేథ్.. దీపక్ కుమార్ మహతోకు లెంగ్త్ డెలివరీగా సంధించాడు. దీంతో దీపక్ కుమార్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అందరూ సిక్స్ అని భావించారు. కానీ లాంగాన్‌లో ఉన్న అభిషేక్ దాస్ అద్బుతం చేశాడు. అభిషేక్ వెనక్కి వెళ్తూ జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో ఫ్లయింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అభిషేక్ కూడా క్యాచ్ పట్టిన వెంటనే టీమిండియా స్టార్ శిఖర్ ధావన్ స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపునకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 🏏🔥 What a catch! Abhishek Das's incredible reflexes are absolutely breathtaking! 🤯👏 ..#BengalProT20 #FanCode @bengalprot20 pic.twitter.com/WuAUcMZren— FanCode (@FanCode) June 15, 2024 -
అరంగేట్రంలో సత్తాచాటిన మహ్మద్ షమీ తమ్ముడు.. ఆంధ్రా జట్టుపై!
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ తన రంజీ ట్రోఫీ అరంగేట్రంలో అదరగొట్టాడు. రంజీ ట్రోఫీ-2024 సీజన్లో భాగంగా ఆంధ్రాతో మ్యాచ్‌తో బెంగాల్ తరుపున మహ్మద్ కైఫ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కైఫ్ 3 వికెట్లు పడగొట్టి అందరని అకట్టుకున్నాడు. కైఫ్‌కు కేవలం ఒకే ఇన్నింగ్స్‌లో మాత్రం బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. ఓవరాల్‌గా మొదటి ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లు బౌలింగ్ చేసిన కైఫ్.. కవలం 62 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. ఇక ఆంధ్ర, బెంగాల్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 409 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బెంగాల్ బ్యాటర్లలో ముజుందార్(125) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అనంతరం ఆంధ్ర జట్టు సైతం తమ తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. ఆంధ్ర కూడా 445 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. 36 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బెంగాల్ ఆఖరి రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: IND vs SA: రోహిత్ వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్.. చర్యలకు సిద్దం!? -
ఏదైనా సాధిస్తేనే ఇంటికిరా ... షాబాజ్ అహ్మద్ కు " తండ్రి వార్నింగ్ "
-
రంజీలో సెంచరీ బాదిన క్రీడా మంత్రి.. సెమీఫైనల్‌కు బెంగాల్
రంజీట్రోపీ 2022లో భాగంగా బెంగాల్, జార్ఖండ్‌ల మధ్య జరిగిన క్వారర్ ఫైనల్ మ్యాచ్ శుక్రవారం డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన బెంగాల్ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. జూన్ 14-18 మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్లో బెంగాల్, మధ్యప్రదేశ్‌లు అమితుమీ తేల్చుకోనున్నాయి. మరో సెమీఫైనల్లో ముంబై, ఉత్తర్ ప్రదేశ్ తలపడనున్నాయి. కాగా ఆటకు శుక్రవారం ఆఖరి రోజు కాగా.. ఫలితం వచ్చేలా కనబడకపోవడంతో గంట ముందుగానే మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇక ఆట ముగిసే సమయానికి బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. టీమిండియా క్రికెటర్.. బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి సూపర్ సెంచరీతో మెరిశాడు.129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బెంగాల్‌ను మనోజ్ తివారి తన ఇన్నింగ్స్‌తో నిలబెట్టాడు. 152 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో సెంచరీ మార్క్ అందుకున్నాడు. అభిషేక్ పోరెల్(34) పరుగులతో కలిసి ఐదో వికెట్‌కు అమూల్యమైన 92 పరుగులు జోడించాడు. ఆ తర్వాత షాబాజ్ అహ్మద్(46 పరుగులు)తో కలిసి ఆరో వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. ఓవరాల్‌గా మనోజ్ తివారి 185 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 136 పరుగులు చేశాడు. అంతకముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌ను 773 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 298 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగాల్‌కు 475 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. చదవండి: రంజీ చరిత్రలో ముంబై అతిపెద్ద విజయం.. ప్రపంచ రికార్డు బద్దలు -
సాహా...వహ్వా!
కోల్‌కతా: భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా స్థానిక లీగ్ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు జేసీ ముఖర్జీ ట్రోఫీలో భాగంగా టి20 ఇంటర్ క్లబ్ మ్యాచ్‌లో సాహా 20 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మోహన్ బగాన్ జట్టు తరఫున బరిలోకి దిగిన సాహా... బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేస్ (బీఎన్ఆర్) జట్టుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతని 20 బంతుల ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు, 4 ఫోర్లు, 2 సింగిల్స్ ఉన్నాయి. తాను ఆడిన చివరి ఓవర్లో 6 బంతుల్లో సాహా ఆరు సిక్సర్లు బాదడం విశేషం. ఈ మ్యాచ్‌కు అధికారికంగా గుర్తింపు లేకపోయినా... బెంగాల్ క్రికెట్లో బీఎన్ఆర్ పటిష్టమైన జట్టు కావడం, వేదికైన కాళీఘాట్ మైదానం కూడా పెద్దది కావడాన్ని బట్టి చూస్తే సాహా ఇన్నింగ్స్‌ను ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ముందుగా బ్యాటింగ్ చేసిన బీఎన్ఆర్ 151 పరుగులు చేయగా మోహన్ బగాన్ 7 ఓవర్లలోనే 152 పరుగులు చేసింది. మరో ఓపెనర్ శుభోమయ్ దాస్ 22 బంతుల్లో 43 పరుగులు చేయడంతో 10 వికెట్లతో విజయం సాధించింది. టెస్టు స్పెషలిస్ట్‌గా గుర్తింపు ఉన్న సాహాకు 2014 ఐపీఎల్ ఫైనల్లో మెరుపు సెంచరీ సాధించిన రికార్డు ఉంది. ఈసారి అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. -
రాహుల్ కోలుకుంటున్నాడు: వైద్యులు
స్థానిక లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన క్రికెటర్ రాహుల్ ఘోష్ (20) పరిస్థితి క్రమంగా మెరుగవుతోందని, అతడు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. అతడి మెదడులో గడ్డకట్టిన రక్తం కూడా క్రమంగా తగ్గుతోందని డాక్టర్ బుద్ధదేవ్ సాహా చెప్పారు. ప్రస్తుతం అతడికి ద్రవాహారం మాత్రమే ఇస్తున్నారు. త్వరలోనే ఘనపదార్థాలు కూడా ఇస్తామని సాహా తెలిపారు. బుధవారం రాత్రి, గురువారం ఉదయం కూడా రాహుల్‌కు సూప్ ఇచ్చారు. మరికొన్ని రోజులు అతడిని పరిశీలనలోనే ఉంచుతామని, మూడోసారి కూడా ఎంఆర్ఐ తీయాల్సి ఉందని వైద్యులు చెప్పారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ క్లబ్ మ్యాచ్ జరుగుతుండగా రాహుల్ ఘోష్్కు తలమీద ఎడమవైపు బంతి తగిలింది. సరిగ్గా బెంగాల్ అండర్-19 జట్టు కెప్టెన్ అంకిత్ కేసరి మరణించిన తర్వాతిరోజే రాహుల్ గాయపడటం గమనార్హం. ఘోష్ చికిత్సకు అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ చెప్పింది. -
మైదానంలో కుప్పకూలిన మరో క్రికెటర్
కోల్‌కతా: మొన్న ఆస్ట్రేలియా క్రికెట్ ఫిలిప్ హ్యూస్.. నిన్న పశ్చిమ బెంగాల్ ఆటగాడు అంకిత్ కేసరి.. మైదానంలో తీవ్రంగా గాయపడి అకాలమరణం చెందారు. ఎంతో ప్రతిభ, మంచి భవిష్యత్ ఉన్న ఈ యువ ఆటగాళ్ల మరణం క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలో ముంచింది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే మరో యువ ఆటగాడు మైదానంలో గాయపడి ఆస్పత్రిపాలయ్యాడు. అతను కూడా బెంగాల్ క్రికెటరే. రాహుల్ ఘోష్ అనే యువ క్రికెటర్ కోల్‌కతా పోలీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మంగళవారం బిజోయ్ స్పోర్ట్స్ క్లబ్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో 19 ఏళ్ల రాహుల్ గాయపడ్డాడు. రాహుల్ తల ఎడమ వైపున గాయం కావడంతో రక్తస్రావమైంది. మైదానంలో కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి సీటీ స్కాన్ తీయించారు. గాయమైన చోట రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు చెప్పారు. రాహుల్ పరిస్థితి నిలకడగా ఉన్నా వారం రోజుల పాటు పరిశీలనలో ఉంచనున్నట్టు వైద్యులు తెలిపారు. -
జాఫర్ సెంచరీల ‘హాఫ్ సెంచరీ’
ముంబై: భారత మాజీ ఓపెనర్, ముంబై ఆటగాడు వసీం జాఫర్ మరో మైలురాయిని అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 50 సెంచరీలు సాధించిన ఎనిమిదో భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. విదర్భతో గురువారం ఇక్కడ ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో శతకం (133 బ్యాటింగ్)తో జాఫర్ ఈ ఘనత సాధించాడు. జాఫర్‌కు ముందు గవాస్కర్, సచిన్ (81), ద్రవిడ్ (68), విజయ్ హజారే (60), వెంగ్‌సర్కార్, లక్ష్మణ్ (55), అజహర్ (54) ఈ జాబితాలో ఉన్నారు. శుక్లా ‘సెంచరీ’: సర్వీసెస్‌తో ఢిల్లీలో ప్రారంభమైన మరో మ్యాచ్‌లో బెంగాల్ క్రికెటర్ లక్ష్మీరతన్ శుక్లా వ్యక్తిగత మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌తో శుక్లా రంజీ ట్రోఫీలో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. శుక్లా ఈ ఘనత సాధించిన తొలి బెంగాల్ క్రికెటర్ కాగా, ఓవరాల్‌గా 18వ భారత ఆటగాడు. తొలి ‘కవలలు’: తమిళనాడుకు చెందిన బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్ భారత దేశవాళీ క్రికెట్లో కొత్త ఘనతను అందుకున్నారు. భారత్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన తొలి కవల సోదరులుగా వారు రికార్డు సృష్టించారు. చెన్నైలో గురువారం సౌరాష్ట్రతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌తో బాబా ఇంద్రజిత్ ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అపరాజిత్ ఇప్పటికే 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.