విజయ్ హజారే ట్రోఫీ-2024లో బెంగాల్ యువ సంచలనం అభిషేక్ పోరెల్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా హైదరాబాద్ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 273 పరుగుల లక్ష్య చేధనలో పోరెల్ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు.
ఇషాంత్ శర్మ, నవ్‌దీప్ సైనీ వంటి స్టార్ బౌలర్లను సైతం అతడు ఊతికారేశాడు. ఓవరాల్‌గా 130 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో 170 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా బెంగాల్ జట్టు లక్ష్యాన్ని కేవలం 41.3 ఓవర్లలోనే చేధించింది.
లిస్ట్-ఎ క్రికెట్‌లో అభిషేక్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. కాగా వైట్‌బాల్ క్రికెట్‌లో అభిషేక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు హాఫ్ సెంచరీలతో దుమ్ములేపిన అబిషేక్.. ఇప్పుడు అదే దూకుడును విజయ్ హజారే ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు.
మరోవైపు 22 ఏళ్ల అభిషేక్ పోరెల్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ అతడిని రిటైన్ చేసుకుంది. రిషబ్ పంత్‌ను ఢిల్లీ వదిలేయడంతో అభిషేక్ పూర్తి స్దాయి వికెట్ కీపర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. గత సీజన్‌లో పోరెల్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 152.00 స్ట్రైక్ రేటుతో 360 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని ఢిల్లీ రిటైన్ చేసుకుంది.
చదవండి: IND vs AUS 4th Test: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం!?
Comments
Please login to add a commentAdd a comment