
బెంగాల్ ప్రో టీ20-2024 సీజన్‌లో సంచలన క్యాచ్ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం మేదినీపూర్ విజార్డ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హౌరా వారియర్స్ ఆటగాడు అభిషేక్ దాస్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు.
ఊహకందని రీతిలో క్యాచ్ పట్టి ఔరా అనిపించుకున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మేదినీపూర్ విజార్డ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మేదినీపూర్ ఇన్నింగ్స్ 19వ వేసిన ఫాస్ట్ బౌలర్ కనిష్క్ సేథ్.. దీపక్ కుమార్ మహతోకు లెంగ్త్ డెలివరీగా సంధించాడు.
దీంతో దీపక్ కుమార్ ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అందరూ సిక్స్ అని భావించారు. కానీ లాంగాన్‌లో ఉన్న అభిషేక్ దాస్ అద్బుతం చేశాడు. అభిషేక్ వెనక్కి వెళ్తూ జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో ఫ్లయింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు.
దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అభిషేక్ కూడా క్యాచ్ పట్టిన వెంటనే టీమిండియా స్టార్ శిఖర్ ధావన్ స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపునకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
🏏🔥 What a catch! Abhishek Das's incredible reflexes are absolutely breathtaking! 🤯👏
.
.#BengalProT20 #FanCode @bengalprot20 pic.twitter.com/WuAUcMZren— FanCode (@FanCode) June 15, 2024