
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా కరాచీ వేదికగా మూడో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్‌కు ఆర్హత సాధించగా.. మరో స్ధానం కోసం ప్రోటీస్, పాక్ జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాడు అఘా సల్మాన్ తన ఫీల్డింగ్ విన్యాసంతో దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్‌ను గుర్తు చేశాడు. సల్మాన్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు.
అద్బుతమైన క్యాచ్‌తో దక్షిణాఫ్రికా యువ సంచలనం మాథ్యూ బ్రీట్జ్‌కేను సల్మాన్ పెవిలియన్‌కు పంపాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన పాక్ స్పిన్నర్ కుష్దిల్ షా.. తొలి బంతిని బ్రీట్జ్‌కేకి షా టాస్‌డ్‌అప్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని బ్రీట్జ్‌కే కాస్త ముందుకు వచ్చి కవర్స్‌పై నుంచి ఆడేందుకు ప్రయత్నించాడు.
షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి కవర్స్‌లో ఉన్న ఆఘా సల్మాన్ అద్బుతం చేశాడు. సల్మాన్ తన కుడివైపునకు గాల్లోకి దూకుతూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అతడి క్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో ఎన్నాళ్లకు పాక్ ఫీల్డర్ల నుంచి గుడ్ క్యాచ్ చూశాము నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
బ్రీట్జ్‌కే సూపర్ ఇన్నింగ్స్..
కాగా ఈ మ్యాచ్‌లో కూడా బ్రీట్జ్‌కే దుమ్ములేపాడు. 84 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కెప్టెన్ టెంబా బావుమా(82), క్లాసెన్(87) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు సాధించగా.. నసీం షా, కుష్దిల్ షా తలా వికెట్ సాధించారు.
చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు
Salman " Superman" Ali Agha 👏🏻🥵
Salman Ali Agha with a jaw-dropping one-handed grab! 🤯#3Nations1Trophy | #PAKvSA pic.twitter.com/AKe4TmgaEY— Abdullah Zafar (@Arain_417) February 12, 2025