Agha Salman
-
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్.. అఘా సల్మాన్ అజేయ శతకం.. పాక్ భారీ స్కోర్
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ భారీ స్కోర్ చేసింది. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. సైమ్ అయూబ్ 4, బాబర్ ఆజమ్ 30, నసీం షా 33, మొమహ్మద్ రిజ్వాన్ 0, ఆమెర్ జమాల్ 7, షాహీన్ అఫ్రిది 26, అబ్రార్ అహ్మద్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. రెండో రోజు మూడో సెషన్లో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే కెప్టెన్ ఓలీ పోప్ వికెట్‌ను కోల్పోయింది. పోప్ ఖాతా తెరవకుండానే నసీం షా బౌలింగ్‌లో ఆమెర్ జమాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 1.3 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 7/1గా ఉంది. జాక్ క్రాలే (4), జో రూట్ (3) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: Ind vs Aus: టీమిండియాతో టెస్టులు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్ -
జడ్డూ దెబ్బకి పాక్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. రక్తమొచ్చేసింది! వీడియో వైరల్
ఆసియాకప్-2023 సూపర్-4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌కి అస్సలు అదృష్టం కలిసిరాలేదు. తొలుత బౌలింగ్‌లో స్టార్ పేసర్లు హ్యారీస్ రవూఫ్, నసీంషా గాయపడి ఆటకు దూరం కాగా.. బ్యాటింగ్‌లో ఆల్‌రౌండర్ ఆఘా సల్మాన్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 357 పరగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఆఘా సల్మాన్ పాక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే స్పిన్నర్లు ఎటాక్ చేస్తుండడంతో హెల్మట్ తీసి ఆడాలని సల్మాన్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పాక్ ఇన్నింగ్స్ 21 ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సల్మాన్ స్వీప్ షాట్ ఆడాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని అతడి ముఖానికి బలంగా తాకింది. కంటి కింద గాయం కాగా.. రక్తం కూడా వచ్చింది. దీంతో మైదానంలోనే సల్మాన్ నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అతడు వద్దకు వెళ్లి గాయాన్ని పరిశీలించాడు. ఆ తర్వాత ఫిజియో వచ్చి కంకషన్ టెస్టు చేశాడు. అయితే అతడి గాయం అంతతీవ్రమైనది కాకపోవడం ఆటను సల్మాన్ కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా భారత్ చేతిలో 228 పరుగుల తేడాతో పాక్ చిత్తైంది. చదవండి: బట్టలు ఉతికినట్లు.. ఉతికి ఆరేశారు! రాహుల్, బుమ్రా సూపర్! ఓపెనర్లు కూడా: టీమిండియా దిగ్గజం Agha Salman Bleeding 💔#ViratKohli #indvspak2023#IndiaVsPakistan#INDPAK #indvspak2023 #AbhishekhMalhan#Abhiya #Abhisha#AsiaCup2023#BehindYouSkipper pic.twitter.com/M7iQiJYBpj — Muhammad Ali (@AliFF312) September 11, 2023 -
చెలరేగిన పాక్ బ్యాటర్లు.. డబుల్ సెంచరీ, సెంచరీతో పాటు రెండు ఫిఫ్టీలు
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ 132 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 563 పరుగులు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 178/2తో ఆట కొనసాగించిన పాకిస్తాన్ మూడు వికెట్లు చేజార్చుకొని 385 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (201; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్ సెంచరీ చేయగా... ఆఘా సల్మాన్ (132 బ్యాటింగ్; 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో షఫీక్,సల్మాన్‌తో పాటు షాన్ మసూద్ (51), సౌద్ షకీల్ (57) కూడా రాణించారు. ప్రస్తుతం పాక్ 397 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. రికార్డు డబుల్ సెంచరీ బాదిన అబ్దుల్లా షఫీక్.. లంకతో రెండో టెస్ట్‌లో డబుల్ సెంచరీతో మెరిసిన పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్.. ఈ ఘనత సాధించిన మూడో పాక్ యంగెస్ట్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంతకుముందు జావెద్ మియాందాద్, హనీఫ్ మొహమ్మద్‌లు అతి పిన్న వయసులో డబుల్ సాధించారు. అలాగే షఫీక్.. లంక గడ్డపై డబుల్ సెంచరీ బాదిన తొలి పాక్ ఓపెనర్‌గానూ రికార్డు నెలకొల్పాడు. -
Pak Vs NZ: పాకిస్తాన్‌కు దీటైన జవాబు.. చెలరేగిన కివీస్ ఓపెనర్లు
Pakistan vs New Zealand, 1st Test Day 2 Highlights- కరాచీ: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ దీటైన జవాబిచ్చింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (82 బ్యాటింగ్; 12 ఫోర్లు), టామ్ లాథమ్ (78 బ్యాటింగ్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో రెండో రోజు ఆట నిలిచే సమ యానికి కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 165 పరుగులు చేసింది. దాదాపు రెండు సెషన్ల పాటు క్రీజు వీడకుండా న్యూజిలాండ్ ఓపెనర్లు పాకిస్తాన్ బౌలర్లను ఎదుర్కొన్నారు. అంతకుముందు ఉదయం 317/5 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 438 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్స్‌లో కెప్టెన్ బాబర్ ఆజమ్ (161) అదే స్కోరుపై అవుటవగా, ఆగా సల్మాన్ (103; 17 ఫోర్లు) సెంచరీ సాధించాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ 3 వికెట్లు పడగొట్టగా, ఎజాజ్, బ్రేస్‌వెల్, ఇష్ సోధి తలా 2 వికెట్లు తీశారు. రెండు రోజు ఆట ముగిసే సరికి కివీస్ 273 పరుగులు వెనుకబడి ఉన్నప్పటికీ చేతిలో పది వికెట్లున్నాయి. చదవండి: Shikhar Dhawan: ధావన్‌పై వేటు.. వాళ్ల నుంచి తీవ్రమైన పోటీ! వరల్డ్‌కప్ ఆశలు ఆవిరి! మిస్ యూ గబ్బర్ అంటూ.. David Warner: 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవంతో అరంగేట్రం.. అత్యుత్తమ ప్రదర్శనలు ఇవే Ind_W Vs SA_W: అదరగొట్టిన షబ్నమ్.. దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం Babar Azam: పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం! సెహ్వాగ్‌లా అలా!