
ఆసియాకప్-2023 సూపర్-4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌కి అస్సలు అదృష్టం కలిసిరాలేదు. తొలుత బౌలింగ్‌లో స్టార్ పేసర్లు హ్యారీస్ రవూఫ్, నసీంషా గాయపడి ఆటకు దూరం కాగా.. బ్యాటింగ్‌లో ఆల్‌రౌండర్ ఆఘా సల్మాన్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 357 పరగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఆఘా సల్మాన్ పాక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే స్పిన్నర్లు ఎటాక్ చేస్తుండడంతో హెల్మట్ తీసి ఆడాలని సల్మాన్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పాక్ ఇన్నింగ్స్ 21 ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సల్మాన్ స్వీప్ షాట్ ఆడాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని అతడి ముఖానికి బలంగా తాకింది.
కంటి కింద గాయం కాగా.. రక్తం కూడా వచ్చింది. దీంతో మైదానంలోనే సల్మాన్ నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అతడు వద్దకు వెళ్లి గాయాన్ని పరిశీలించాడు. ఆ తర్వాత ఫిజియో వచ్చి కంకషన్ టెస్టు చేశాడు.
అయితే అతడి గాయం అంతతీవ్రమైనది కాకపోవడం ఆటను సల్మాన్ కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా భారత్ చేతిలో 228 పరుగుల తేడాతో పాక్ చిత్తైంది.
చదవండి: బట్టలు ఉతికినట్లు.. ఉతికి ఆరేశారు! రాహుల్, బుమ్రా సూపర్! ఓపెనర్లు కూడా: టీమిండియా దిగ్గజం
Agha Salman Bleeding 💔#ViratKohli #indvspak2023#IndiaVsPakistan#INDPAK #indvspak2023 #AbhishekhMalhan#Abhiya #Abhisha#AsiaCup2023#BehindYouSkipper pic.twitter.com/M7iQiJYBpj
— Muhammad Ali (@AliFF312) September 11, 2023