ఇదేమి బంతిరా బాబు.. దెబ్బకు బాబర్‌ ఆజం ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌ | Asia Cup 2023: Babar Bamboozled By Hardik During India vs Pakistan Clash - Sakshi
Sakshi News home page

Asia Cup 2023: ఇదేమి బంతిరా బాబు.. దెబ్బకు బాబర్‌ ఆజం ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

Published Tue, Sep 12 2023 9:48 AM | Last Updated on Tue, Sep 12 2023 10:37 AM

Azam Bamboozled By Hardik Pandya During India vs Pakistan Clash - Sakshi

ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో సూపర్‌-4 పాయింట్ల పట్టికలో తొలి స్ధానానికి భారత్‌ చేరుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. విరాట్‌ కోహ్లి(122), కేఎల్‌ రాహుల్‌(111) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.

అనంతరం 128 పరుగులకే పాకిస్తాన్‌ ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 5 వికెట్లతో చెలరేగాడు. ఇక భారత తమ తదుపరి మ్యాచ్‌లో మంగళవారం శ్రీలంకతో తలపడనుంది.

హార్దిక్‌ సూపర్‌ డెలివరీ..
ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అద్బుతమైన బంతితో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను బోల్తా కొట్టించాడు. స్వింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై హార్దిక్‌ బంతితో మ్యాజిక్‌ చేశాడు. పాక్‌ ఇన్నింగ్స్‌ 10 ఓవర్‌లో హార్దిక్‌ వేసిన ఇన్‌స్వింగర్‌కు బాబర్‌ దగ్గర సమాధానమే లేకుండా పోయింది.

ఆఫ్‌సైడ్‌ పడిన బంతిని ఆజం ఢిపెన్స్‌ ఆడడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అనూహ్యంగా టర్న్‌ అయ్యి ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన బాబర్‌ ఆజం బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: అతడికి 5 నిమిషాల ముందు చెప్పాం.. కానీ! వాళ్లందరికీ చాలా థ్యాంక్స్‌: రోహిత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement