ఆసియాకప్ సూపర్ 4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘోర ఓటమి చవిచూసింది. ఈ ఓటమి బాధ నుంచి కోలుకోక ముందే పాకిస్తాన్‌కు మరో బిగ్‌షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ పేసర్లు హ్యారీస్ రవూఫ్, నసీం షా గాయం కారణంగా ఆసియాకప్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు సమాచారం.
భారత్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్‌చేస్తుండగా వీరిద్దరూ గాయపడ్డారు. దీంతో రవూఫ్ పూర్తిగా రిజర్వ్‌డే రోజు మైదానం అడుగుపెట్టకపోగా.. నసీం షా బ్యాటింగ్‌కు రాలేదు. మరోవైపు వీరిద్దరూ బ్యాకప్‌గా యువ పేసర్లు షానవాజ్ దహానీ,జమాన్ ఖాన్‌లకు పాకిస్తాన్ క్రికెట్ పిలుపునిచ్చింది. వీరిద్దరూ మంగళవారం పాక్ జట్టుతో కలవనున్నారు.
"హారీస్ రవూఫ్, నసీం షా ఇద్దరూ మా మెడికల్ ప్యానెల్ పరిశీలనలో ఉంటారు. వారి గాయాలు అంత తీవ్రమైనవి కావు. కానీ వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్తగా వారిద్దరి ఆడించి రిస్క్ చేయకూడదని అనుకుంటున్నాము. ఈ నేపథ్యంలో షానవాజ్ దహానీ,జమాన్ ఖాన్‌లకు సిద్దంగా ఉండమని సమాచారమిచ్చాం.
ఒక వేళ వీరిద్దరిని భర్తీ చేయాలని అనుకుంటే ఏసీసీ టెక్నికల్ కమిటీ అనుమతి తీసుకుంటామని" పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ 14న శ్రీలంకతో తలపడనుంది.
చదవండి: అతడికి 5 నిమిషాల ముందు చెప్పాం.. కానీ! వాళ్లందరికీ చాలా థ్యాంక్స్: రోహిత్
Comments
Please login to add a commentAdd a comment