ఆసియాకప్-2023లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు మరోసారి వరుణుడు అడ్డుపడ్డాడు. ఈ టోర్నీ సూపర్-4లో భాగంగా కొలంబో వేదికగా ఆదివారం జరగాల్సిన దయాదుల పోరు వర్షం కారణంగా వాయిదా పడింది. భారత్ ఇన్నింగ్స్ 24.1 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్‌ను అంపైర్‌లు నిలిపివేశారు.
ఆ తర్వాత వర్షం తగ్గముఖం పట్టుముఖం పట్టినప్పటికీ ఔట్ ఫీల్డ్ బాగా తడిగా ఉండడంతో మ్యాచ్‌ను అంపైర్‌లు తిరిగి ప్రారంభించలేదు. అయితే వర్షం అంతరాయం కలిగిస్తుందని ముందుగానే ఊహించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కేటాయించింది. దీంతో రిజర్వ్‌డే(సోమవారం) మ్యాచ్ తిరిగి ప్రారంభం కానుంది.
వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 24.1 ఓవరల్లో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు సాధించింది. అయితే రిజర్వ్ డే సోమవారం కూడా కొలంబోలో భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ సమాచారమిచ్చింది. ఈ క్రమంలో రిజర్వ్ డే రోజు కూడా ఆటసాధ్యపడక మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి అని అభిమానులు అందోళన చెందుతున్నారు.
సోమవారం 3 గంటల నుంచి భారత ఇన్నింగ్స్ 24.1 ఓవర్ల నుంచి మొదలవుతుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించకపోతే ఎటువంటి సమస్య లేదు. మ్యాచ్ మొత్తం యాథవిథిగా జరగుతోంది. కానీ మ్యాచ్ జరిగే సమయంలో 80 శాతం వర్ష సూచన ఉండడంతో మరోసారి వరుణుడిదే పై చేయి అయ్యే చాన్స్ ఉంది.
కాబట్టి మ్యాచ్ ఫలితం తేలాంటే కనీసం ఇరు జట్లు కనీసం 20 ఓవర్లు ఆడాలి. అయితే భారత్ ఇప్పటికే 20 ఓవర్ల ఆటను పూర్తి చేసింది. ఈ క్రమంలో వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 20 ఓవర్లకు పాక్ టార్గెట్‌ను నిర్ణయించి మ్యాచ్ ప్రారంభమయ్యేలా అంపైర్‌లు ప్లాన్ చేస్తారు. అప్పటికీ వర్షం పూర్తిగా తగ్గకపోతే ఆఖరికి అంపైర్‌లు మ్యాచ్‌ను రద్దు చేస్తారు. ఈ క్రమంలో ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తోంది.
టీమిండియాకు కష్టమే..
ఒక వేళ ఇదే జరిగితే టీమిండియాకు కష్టాలు తప్పవు. ఎందుకంటే సూపర్-4 పాయింట్ల పట్టికలో పాకిస్తాన్,శ్రీలంక చెరో విజయంతో తొలి రెండు స్ధానాల్లో ఉన్నాయి. సూపర్-4లో భారత్‌కు మాత్రం ఇదే తొలి మ్యాచ్. కాబట్టి భారత్ ఖాతాలో ఎటువంటి పాయింట్లు లేవు. ఇక బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.
అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్ రద్దు అయితే భారత్ ఖాతాలో ఒక్క పాయింట్ చేరుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఫైనల్‌కు చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాలి. అంటే శ్రీలంక, బంగ్లాదేశ్‌తో కచ్చితంగా గెలుపొందాలి. అప్పుడు 5 పాయింట్లతో భారత్ తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.
చదవండి: Asia Cup 2023: షాహీన్ అఫ్రిది మంచి మనసు.. బుమ్రాకు సర్‌ప్రైజ్ గిప్ట్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment