కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ 132 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 563 పరుగులు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 178/2తో ఆట కొనసాగించిన పాకిస్తాన్ మూడు వికెట్లు చేజార్చుకొని 385 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (201; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్ సెంచరీ చేయగా... ఆఘా సల్మాన్ (132 బ్యాటింగ్; 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో షఫీక్,సల్మాన్‌తో పాటు షాన్ మసూద్ (51), సౌద్ షకీల్ (57) కూడా రాణించారు. ప్రస్తుతం పాక్ 397 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.
రికార్డు డబుల్ సెంచరీ బాదిన అబ్దుల్లా షఫీక్..
లంకతో రెండో టెస్ట్‌లో డబుల్ సెంచరీతో మెరిసిన పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్.. ఈ ఘనత సాధించిన మూడో పాక్ యంగెస్ట్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంతకుముందు జావెద్ మియాందాద్, హనీఫ్ మొహమ్మద్‌లు అతి పిన్న వయసులో డబుల్ సాధించారు. అలాగే షఫీక్.. లంక గడ్డపై డబుల్ సెంచరీ బాదిన తొలి పాక్ ఓపెనర్‌గానూ రికార్డు నెలకొల్పాడు.
Comments
Please login to add a commentAdd a comment