![Kamran Ghulam surround, threaten, and give brutal send-off to Temba Bavuma](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/pakistan.jpg.webp?itok=LhdFegX5)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముగింట పాకిస్తాన్-న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు ముక్కోణపు వన్డే సిరీస్‌లో తలపడుతున్నాయి. పాక్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే కివీస్ ఫైనల్‌కు ఆర్హత సాధించగా.. మరో స్ధానం కోసం పాక్, ప్రోటీస్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కరాచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు ఓవరాక్షన్ చేశారు. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా(Temba Bavuma)పై తమ దూకుడును పాక్ ప్లేయర్లు ప్రదర్శించారు.
అసలేం జరిగిందంటే?
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ప్రోటీస్‌కు ఓపెనర్లు టెంబా బావుమా, డీజోర్జీ తొలి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కేతో కలిసి బావుమా ప్రోటీస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అద్బుతమైన షాట్లతో సెంచరీ దిశగా బావుమా దూసుకెళ్లాడు.
కానీ ప్రోటీస్ ఇన్నింగ్స్ 29వ ఓవర్‌లో బావుమాను దురదృష్టం వెంటాండింది. ఆ ఓవర్ చివరి బంతికి రనౌట్ రూపంలో టెంబా పెవిలియన్‌కు చేరాడు. ఆ ఓవర్‌లో ఆఖరి బంతిని మహ్మద్ హస్నైన్ గుడ్ లెంగ్త్ డెలివరీగా బావుమాకి సంధించాడు. ఆ బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. వెంటనే సింగిల్ కోసం బావుమా ప్రయత్నించగా.. నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మాథ్యూ బ్రీట్జ్కే సైతం పరుగు కోసం ముందుకు వచ్చాడు. కానీ బ్రీట్జ్కే కొంచెం ముందుకు వచ్చి వెంటనే తన మనసును మార్చకుని నో అని కాల్ ఇచ్చాడు.
అప్పటికే సగం దూరం పరిగెత్తిన బావుమా తిరిగి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న సౌద్ షకీల్ స్ట్రయికర్ ఎండ్‌లో వికెట్లను గిరాటేశాడు. ఈ క్రమంలో పాక్ ప్లేయర్ల సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. పాక్ ఆల్‌రౌండర్ కమ్రాన్ గులామ్.. బావుమా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి గెటౌట్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు.
ఆ తర్వాత సల్మాన్ అఘా, సౌద్ షకీల్ అదే రియాక్షన్ ఇచ్చాడు. బావుమా మాత్రం అలా సైలెంట్‌గా ఉండిపోయాడు. అయితే ఇదే విషయంపై అంపైర్‌లు పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌తో చర్చించారు. అలా ప్రవర్తించడం సరికాదని రిజ్వాన్‌ను అంపైర్‌లు హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్‌కు సఫారీలు బ్యాట్‌తో సమాధనమిచ్చారు.
క్లాసెన్ విధ్వంసం.. బావుమా కెప్టెన్ ఇన్నింగ్స్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ బావుమా 96 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 82 రన్స్ సాధించాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 84 బంతుల్లో 83 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 56 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87 పరుగులు చేసి ఔటయ్యాడు.
THE SEND-OFF BY KAMRAN GHULAM AND SAUD SHAKEEL. 🔥pic.twitter.com/zhv7iIgwvm
— 𝙎𝙝𝙚𝙧𝙞 (@CallMeSheri1) February 12, 2025
Comments
Please login to add a commentAdd a comment