మైదానంలో కుప్పకూలిన మరో క్రికెటర్ | Another cricketer hospitalised in Kolkata with head injury | Sakshi
Sakshi News home page

మైదానంలో కుప్పకూలిన మరో క్రికెటర్

Published Tue, Apr 21 2015 6:35 PM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM

మైదానంలో కుప్పకూలిన మరో క్రికెటర్

మైదానంలో కుప్పకూలిన మరో క్రికెటర్

కోల్‌కతా: మొన్న ఆస్ట్రేలియా క్రికెట్ ఫిలిప్ హ్యూస్.. నిన్న పశ్చిమ బెంగాల్ ఆటగాడు అంకిత్ కేసరి.. మైదానంలో తీవ్రంగా గాయపడి అకాలమరణం చెందారు. ఎంతో ప్రతిభ, మంచి భవిష్యత్ ఉన్న ఈ యువ ఆటగాళ్ల మరణం క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలో ముంచింది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే మరో యువ ఆటగాడు మైదానంలో గాయపడి ఆస్పత్రిపాలయ్యాడు. అతను కూడా బెంగాల్ క్రికెటరే. 

రాహుల్ ఘోష్ అనే యువ క్రికెటర్ కోల్కతా పోలీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మంగళవారం బిజోయ్ స్పోర్ట్స్ క్లబ్తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో 19 ఏళ్ల రాహుల్ గాయపడ్డాడు. రాహుల్ తల ఎడమ వైపున గాయం కావడంతో రక్తస్రావమైంది. మైదానంలో కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి సీటీ స్కాన్ తీయించారు. గాయమైన చోట రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు చెప్పారు. రాహుల్ పరిస్థితి నిలకడగా ఉన్నా వారం రోజుల పాటు పరిశీలనలో ఉంచనున్నట్టు వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement