టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. 361 రోజుల తర్వాత తిరిగి మైదానంలో అడుగు పెట్టిన షమీ తన మాస్టర్ క్లాస్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. రంజీ ట్రోపీ 2024-25 సీజన్‌లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. తన రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షమీ 4 వికెట్లతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ బెంగాల్ స్టార్ పేసర్ కేవలం పరుగులిచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
అతడితో పాటు సురజ్ జైశ్వాల్, మహ్మద్ కైఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ కూడా కేవలం 228 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం బెంగాల్ 61 పరుగుల ఆధిక్యంలో ఉంది.
టీమిండియాలోకి రీ ఎంట్రీ!?
షమీ టీమిండియా తరపున చివరగా గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో ఆడాడు. ఆ తర్వాత తన కాలి మడమ గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. అతడి తిరిగి మళ్లీ బోర్డర్ - గావస్కర్ ట్రోఫీట్రోఫీతో జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు.
కానీ ఫిట్‌నెస్ సమస్యల వల్ల షమీని భారత సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. రంజీల్లో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలని షమీని సెలక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే రంజీల్లో ఆడేందుకు షమీ బరిలోకి దిగాడు.
ఇదే ఫిట్‌నెస్‌తో అతడు ఒకట్రెండు మ్యాచ్‌లు బెంగాల్ తరపున ఆడితే జాతీయ జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఆస్ట్రేలియాతో ఆఖరి మూడు టెస్టులకు భారత జట్టులో షమీ చేరే అవకాశమున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
చదవండి: IPL 2025: చహల్ కోసం పోటా పోటీ.. రూ.12 కోట్లకు కొనుక్కున్న ఆర్సీబీ!? అట్లుంటది మరి ఫ్యాన్స్‌తో..
Comments
Please login to add a commentAdd a comment