PC: IPL.com
వాంఖడే వేదికగా ఏప్రిల్ 25న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ధావన్ 88 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ధావన్‌పై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. రోజురోజుకు తన ఆటను ధావన్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాడని రవిశాస్త్రి కొనియాడాడు.
"పిచ్ పరిస్థితులకు అనుగుణంగా అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు. జట్టులో అతడి రోల్‌కు తగ్గట్టు ఆడుతున్నాడు. అతడి షాట్ షాట్-సెలక్షన్, ఫీల్డ్‌కు తగ్గట్టు ఆడడం, సరైన బౌలర్‌ను ఎంచుకుని హిట్టింగ్ చేయడం వంటివి మనం ధావన్ ఆటలో చూస్తున్నాం. ధావన్ అద్భుతమైన ఆటగాడు. ఐపీఎల్‌లో 6000 పరుగులు, 200వ ఐపీఎల్ మ్యాచ్‌లు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, తనదైన శైలిలో మ్యాచ్‌ను ఫినిష్ చేయడం వంటివి ధావన్ నుంచి మనం చూశాం" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: "గత మ్యాచ్‌లు గురించి ఆలోచించం.. ప్లేఆఫ్స్‌కు మేము వచ్చామంటే.. కప్ మదే
Comments
Please login to add a commentAdd a comment