స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు 16 మంది సభ్యలతో కూడిన తమ జట్టును మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బావుమా నాయకత్వం వహించనున్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు స్టార్ పేసర్ ఆన్రిచ్ నోర్జే దూరమయ్యాడు. ఇక సెంచూరియాన్ వేదికగా దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య తొలి వన్డే మార్చి 18న ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా బంగ్లా జట్టు మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.
ఇక ఏడాది జనవరిలో టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 ప్రోటీస్ జట్టు క్లీన్ స్వీప్‌చేసింది. ఈ సిరీస్‌లో క్వింటన్ డి కాక్ అద్భుతంగా రాణించాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన డికాక్ 229 పరుగులు సాదించాడు. ఇప్పడు బంగ్లాదేశ్‌పై కూడా ఆదే జోరు కొనసాగించాలని దక్షిణాఫ్రికా జట్టు భావిస్తోంది. కాగా దాదాపు భారత్‌తో తలపడిన జట్టునే బంగ్లాదేశ్ సిరీస్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఎంపిక చేయడం గమనార్హం. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే.. ఇటీవల ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), కేశవ్ మహరాజ్ (వైస్ కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), జుబేర్ హంజా, మార్కో జాన్సెన్, జానెమన్ మలన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ న్గిడి, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లుక్వాయో, ద్వాహ్లుక్వాయో, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ, రాస్సీ వాన్ డెర్ డుసెన్, కైల్ వెర్రెయిన్
చదవండి: IPL 2022: పాపం రైనా.. మరోసారి బిగ్ షాక్... కనీసం ఆ అవకాశం కూడా లేదుగా!
Comments
Please login to add a commentAdd a comment