సౌతాఫ్రికా కెప్టెన్‌కు గాయం.. తొలి టెస్ట్‌కు దూరం | Bavuma Ruled Out Of First Test Against Bangladesh, Brevis Earns Maiden Call Up | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా కెప్టెన్‌కు గాయం.. తొలి టెస్ట్‌కు దూరం

Published Fri, Oct 11 2024 4:42 PM | Last Updated on Fri, Oct 11 2024 4:50 PM

Bavuma Ruled Out Of First Test Against Bangladesh, Brevis Earns Maiden Call Up

అక్టోబర్‌ 21 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా జట్టుకు బ్యాడ్‌ న్యూస్‌ అందింది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్‌ టెంబా బవుమా తొలి టెస్ట్‌కు దూరమయ్యాడు. బవుమా స్థానంలో యువ ఆటగాడు డెవాల్డ్‌ బ్రెవిస్‌ తొలి టెస్ట్‌కు ఎంపికయ్యాడు. 

బ్రెవిస్‌కు టెస్ట్‌ జట్టు నుంచి పిలుపు రావడం ఇదే మొదటిసారి. తొలి టెస్ట్‌కు దూరమైనప్పటికీ బవుమా జట్టుతో పాటే ప్రయాణిస్తాడు. రెండో టెస్ట్‌ సమయానికి బవుమా కోలుకుంటాడని క్రికెట్‌ సౌతాఫ్రికా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. బవుమా గైర్హాజరీలో ఎయిడెన్‌ మార్క్రమ్‌ తొలి టెస్ట్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

మరోవైపు ఇదే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు ఎంపికైన నండ్రే బర్గర్‌ సైతం గాయపడ్డాడు. అతని​ స్థానంలో లుంగి ఎంగిడి జట్టులోకి వచ్చాడు. అప్‌డేట్‌ చేసిన జట్టు వివరాలను క్రికెట్‌ సౌతాఫ్రికా ఇవాళ (అక్టోబర్‌ 11) వెల్లడించింది.

బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా (మొదటి టెస్టుకు అందుబాటులో ఉండడు), డేవిడ్ బెడింగ్‌హామ్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, డేన్ ప్యాటర్సన్, డేన్ పీడ్, ట్రిస్టన్ స్టబ్స్‌, కగిసో రబాడ, ర్యాన్‌ రికెల్టన్, కైల్ వెర్రేన్నే

బంగ్లాదేశ్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా షెడ్యూల్‌..
తొలి టెస్ట్‌ (అక్టోబర్‌ 21-25, ఢాకా)
రెండో టెస్ట్‌ (అక్టోబర్‌ 29-నవంబర్‌ 2, చట్టోగ్రామ్‌)

చదవండి: పొదల్లోకి వెళ్లిన బంతి.. నవ్వులు పూయించిన ఆసీస్‌ స్టార్‌ ప్లేయర్‌( వీడియో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement