ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టీ20, వన్డే సిరీస్‌ల కోసం క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) వేర్వేరు జట్లను ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించింది. ఈ పర్యటనలోని టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికన్ సెలెక్టర్లు విధ్వంసకర ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌కు తొలిసారి పిలుపునిచ్చారు. ఇతనితో పాటు వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ డోనోవన్ ఫెర్రీరా, యువ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కీలను కూడా తొలిసారి ఎంపిక చేశారు. ఆసీస్ పర్యటనలోని 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికా సెలెక్టర్లు 15 మంది సభ్యులతో కూడిన యువ జట్టును ప్రకటించారు.
సీనియర్లు క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జేల గైర్హాజరీలో సెలెక్టర్లు యువకులకు అవకాశం ఇచ్చారు. పైపేర్కొన్న సీనియర్లంతా ఇదే పర్యటనలో జరిగే 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వస్తారు. టీ20 సిరీస్‌కు ఎయిడెన్ మార్క్రమ్, వన్డే సిరీస్‌కు టెంబా బవుమా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. గాయం కారణంగా గతకొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాడు కేశవ్ మహారాజ్ సైతం రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు.
ఆసీస్ పర్యటనలో టీ20 సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), టెంబా బవుమా, మాథ్యూ బ్రీట్జ్కీ, డెవాల్డ్ బ్రెవిస్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెర్రీరా, జోర్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, సిసంద మగాల, కేశవ్ మహరాజ్, లుంగీ ఎంగిడి, తబ్రేజ్ షంషి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్
ఆసీస్ పర్యటనలో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగాలా, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షంషి, వేన్ పార్నెల్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్
షెడ్యూల్..
- ఆగస్ట్ 30: తొలి టీ20 (డర్బన్)
- సెప్టెంబర్ 1: రెండో టీ20 (డర్బన్)
- సెప్టెంబర్ 2: మూడో టీ20 (డర్బన్)
- సెప్టెంబర్ 7: తొలి వన్డే (బ్లోంఫొన్‌టెయిన్)
- సెప్టెంబర్ 9: రెండో వన్డే (బ్లోంఫొన్‌టెయిన్)
- సెప్టెంబర్ 12: మూడో వన్డే (పోచెఫ్‌స్ట్రూమ్)
- సెప్టెంబర్ 15: నాలుగో వన్డే (సెంచూరియన్)
- సెప్టెంబర్ 17: ఐదో వన్డే (జోహనెస్‌బర్గ్)
Comments
Please login to add a commentAdd a comment