భారత్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. కెప్టెన్‌కు షాక్‌ | South Africa Has Announced Squads For All-Format Series Against India - Sakshi
Sakshi News home page

భారత్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. కెప్టెన్‌కు షాక్‌

Published Mon, Dec 4 2023 1:26 PM | Last Updated on Mon, Dec 4 2023 2:55 PM

Cricket South Africa Has Announced All Format Squad For Series Against India - Sakshi

డిసెంబర్‌ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు భారత్‌తో జరిగే మూడు ఫార్మాట్ల సిరీస్‌ల కోసం క్రికెట్‌ సౌతాఫ్రికా ఇవాళ (డిసెంబర్‌ 4) జట్లను ప్రకటించింది. సౌతాఫ్రికా సెలెక్టర్లు పరిమిత ఓవర్ల జట్ల నుంచి రెగ్యులర్‌ కెప్టెన్‌ టెంబా బవుమా, స్టార్‌ పేసర్‌ కగిసో రబాడను తప్పించారు. వన్డే, టీ20 జట్లకు ఎయిడెన్‌ మార్క్రమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

ఫ్రీడం సిరీస్‌గా నామకరణం చేయబడిన ఈ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌లో మూడు టీ20లు (కేఎఫ్‌సీ సిరీస్‌), మూడు వన్డేలు (బెట్‌వే సిరీస్‌), రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు (బెట్‌వే సిరీస్‌) జరుగుతాయి. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌, ఆతర్వాత వన్డే, టెస్ట్‌ సిరీస్‌లు జరుగుతాయి. 

భారత్‌తో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్‌ మార్క్రమ్‌ (కెప్టెన్‌), ఒట్నీల్‌ బార్ట్‌మ్యాన్‌, మాథ్యూ బ్రీట్జ్కీ, నండ్రే బర్గర్‌, గెరాల్డ్‌ కొయెట్జీ, డొనొవన్‌ ఫెరియెరా, రీజా హెండ్రిక్స్‌, మార్కో జన్సెన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహారాజ్‌, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎంగిడి, అండీల్‌ ఫెహ్లుక్వాయో, తబ్రేజ్‌ షంషి, ట్రిస్టన్‌ స్టబ్స్‌, లిజాడ్‌ విలియమ్స్‌

భారత్‌తో వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్‌ మార్క్రమ్‌ (కెప్టెన్‌), ఒట్నీల్‌ బార్ట్‌మ్యాన్‌, నం​డ్రే బర్గర్‌, టోనీ డి జోర్జీ, రీజా హెండ్రిక్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహారాజ్‌, డేవిడ్‌ మిల్లర్‌, మిహ్లాలి పోంగ్వానా, వియాన్‌ ముల్దర్‌, అండీల్‌ ఫెహ్లుక్వాయో, తబ్రేజ్‌ షంషి, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌, కైల్‌ వెర్రిన్‌, లిజాడ్‌ విలియమ్స్‌

భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్‌), డేవిడ్‌ బెడింగ్హమ్‌, నండ్రే బర్గర్‌, గెరాల్డ్‌ కొయెట్జీ, టోనీ డి జోర్జీ, డీన్‌ ఎల్గర్‌, మార్కో జన్సెన్‌, కేశవ్‌ మహారాజ్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, వియాన్‌ ముల్దర్‌, లుంగి ఎంగిడి, కీగన్‌ పీటర్సన్‌, కగిసో రబాడ, ట్రిస్టన్‌ స్టబ్స్‌, కైల్‌ వెర్రిన్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement