ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy 2025) ముందు పాకిస్తాన్‌లో జరిగే ట్రయాంగులర్ సిరీస్ (Tri Series) (తొలి మ్యాచ్‌కు మాత్రమే) కోసం 12 మంది సభ్యుల సౌతాఫ్రికా (South Africa) జట్టును ఇవాళ (ఫిబ్రవరి 5) ప్రకటించారు. ఈ జట్టుకు ఆరుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఎంపికయ్యారు. జట్టుకు సారధిగా టెంబా బవుమా (Temba Bavuma) వ్యవహరిస్తాడు.
SA20-2025 నేపథ్యంలో ట్రై సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు చాలామంది సౌతాఫ్రికా ఆటగాళ్లు అందుబాటులో లేరు. ఈ లీగ్ ఫిబ్రవరి 8తో ముగుస్తుంది. ఆ లోపు చాలామంది సీనియర్ ఆటగాళ్లు జట్టుతో జాయిన్ అవుతారు. ట్రై సిరీస్‌లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 10న ఆడుతుంది. లాహోర్ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది.
న్యూజిలాండ్‌తో వన్డే కోసం ఎంపికైన అన్‌క్యాప్డ్ ప్లేయర్లలో మాథ్యూ బ్రీట్జ్కే, మీకా-ఈల్ ప్రిన్స్, గిడియన్ పీటర్స్, ఈతన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మిహ్లాలి ఎంపోంగ్వానా ఉన్నారు. గాయం కారణంగా సౌతాఫ్రికా టీ20 లీగ్ మొత్తానికి దూరమైన స్టార్ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కొయెట్జీ ట్రై సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు.
SA20-2025 నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయిన డర్బన్ సూపర్ జెయింట్స్ సభ్యులు కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్ కూడా న్యూజిలాండ్‌తో వన్డేకు అందుబాటులో లేరు. ఈ ఇద్దరు ఫిబ్రవరి 12న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు, ఆతర్వాత జరిగే ఫైనల్ (ఒకవేళ క్వాలిఫై అయితే) కోసం సౌతాఫ్రికా జట్టును ఫిబ్రవరి 9న ప్రకటిస్తారు.
ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపికైన మార్కో జన్సెన్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డర్ డస్సెన్ ఫిబ్రవరి 14న పాకిస్తాన్‌కు పయనిస్తారు. వీరు ట్రై సిరీస్‌లో పాల్గొనరని తెలుస్తుంది. ట్రై సిరీస్‌లో ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 14న జరుగుతుంది.
ట్రై సిరీస్‌లోని తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) కోసం సౌతాఫ్రికా జట్టు..
టెంబా బవుమా (కెప్టెన్), ఈథన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, గెరాల్డ్ కొయెట్జీ, జూనియర్ డాలా, వియాన్ ముల్డర్, మిహ్లాలి మ్పోంగ్వానా, సెనురన్ ముత్తుసామి, గిడియన్ పీటర్స్, మీకా-ఈల్ ప్రిన్స్, జాసన్ స్మిత్, కైల్ వెర్రెయిన్
ట్రై సిరీస్ షెడ్యూల్..
ఫిబ్రవరి 8-పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (లాహోర్)
ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లాహోర్)
ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (కరాచీ)
ఫిబ్రవరి 14- ఫైనల్ (కరాచీ)
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సౌతాఫ్రికా జట్టు..
టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్, ర్యాన్ రికెల్టన్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి
Comments
Please login to add a commentAdd a comment