లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. బంగ్లా ఆటగాళ్లు నిలకడగా ఆడుతూ దక్షిణాఫ్రికా బౌలర్లకు పరీక్షగా నిలిచారు. బంగ్లా ఆటగాళ్లలో షకీబుల్ హసన్, ముష్పఫికర్ రహీమ్‌లు హాఫ్ సెంచరీలు సాధించారు. వీరిద్దరూ వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో బంగ్లాదేశ్ 32 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి రెండొందల మార్కును చేరింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(16) తొందరగా పెవిలియన్ చేరినప్పటికీ, సౌమ్య సర్కార్, షకీబుల్, రహీమ్‌లు మెరిశారు. సౌమ్య సర్కార్ 30 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేసిన తర్వాత రెండో వికెట్‌గా ఔట్ అయ్యాడు. ఆ తరుణంలో షకీబుల్‌కు జత కలిసిన రహీమ్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలోనే వీరు తలో హాఫ్ సెంచరీ నమోదు చేశారు.
తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేపట్టింది. బంగ్లా ఇన్నింగ్స్‌ను తమీమ్ ఇక్బాల్- సౌమ్య సర్కార్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 60 పరుగులు సాధించిన తర్వాత ఇక్బాల్(16) ఔటయ్యాడు. ఆపై మరో 15 పరుగుల వ్యవధిలో సౌమ్య సర్కార్ పెవిలియన్ చేరాడు. దాంతో 75 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై షకీబుల్-రహీలు అత్యంత నిలకడగా ఆడటంతో సఫారీ బౌలర్లకు సవాల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment