ICC Mens T20 World Cup 2022 - South Africa vs Bangladesh: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ రిలీ రోసో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. తద్వారా టీ20 వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్‌లో తొలి శతకం నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
కాగా రోసోకు అంతర్జాతీయ టీ20లలో ఇది వరుసగా రెండో సెంచరీ. భారత పర్యటనలో భాగంగా అక్టోబరులో టీమిండియాతో జరిగిన ఆఖరి టీ20లో అతడు 48 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు ఐసీసీ టోర్నీలో బరిలోకి దిగి మరోసారి శతకం బాదాడు.
ఇక సిడ్నీ వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 52 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రోసో.. టీ20 ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా శతకం బాదిన మూడో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో క్రిస్‌గేల్(తొలి రెండు స్థానాలు), బ్రెండన్ మెకల్లమ్ తర్వాతి స్థానం ఆక్రమించాడు.
టీ20 ప్రపంచకప్ టోర్నీలో వేగంగా సెంచరీ సాధించిన క్రికెటర్లు
1. క్రిస్‌గేల్- 47 బంతుల్లో- 2016-
2. క్రిస్‌గేల్- 50 బంతుల్లో- 2007
3. బ్రెండన్ మెకల్లమ్- 51 బంతుల్లో- 2012
4. రిలీ రోసో- 52 బంతుల్లో-2022
అరుదైన ఘనత
ఈ రికార్డుతో పాటు మరో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు రోసో. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు.
1. బ్రెండన్ మెకల్లమ్- 123 పరుగులు
2. క్రిస్‌గేల్- 117 పరుగులు
3. అలెక్స్ హేల్స్- 116 నాటౌట్
4. అహ్మద్ షెహజాద్- 111 నాటౌట్
5. రిలీ రోసో- 109 పరుగులు
చదవండి: IND vs NED: నెదర్లాండ్స్ జట్టులో వాళ్లతో జాగ్రత్త.. లేదంటే అంతే సంగతి?
T20 World Cup 2022: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కాదు.. ఫైనల్ ఆ రెండు జట్లే మధ్యే
Comments
Please login to add a commentAdd a comment