Bangladesh tour of South Africa 2022- కెబెర్హా (దక్షిణాఫ్రికా): బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో సఫారీ జట్టు 332 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఆతిథ్య స్పిన్నర్లు కేశవ్ మహరాజ్ (7/40), సైమన్ హార్మర్ (3/34) రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ పది వికెట్లను పంచుకున్నారు.
వీళ్లిద్దరు తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ కేశవ్ 7, హార్మెర్ 3 వికెట్లను పడగొట్టారు. 413 పరుగుల లక్ష్యఛేదన కోసం ఆఖరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 27/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 23.3 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది. లిటన్ దాస్ (27), మెహదీ (20) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయనేలేదు. కేశవ్ మహరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
కోవిడ్ ఎఫెక్ట్‌తో...
అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి ‘కోవిడ్–19’ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ల నిబంధన అమలు చేశారు. సఫారీ ఆటగాళ్లు సారెల్ ఎర్వి, వియాన్ మల్డర్‌లకు సోమవారం టెస్టులో పాజిటివ్ రావడంతో ఖయా జొండో, గ్లెంటన్ స్టుర్మన్‌లను సబ్‌స్టిట్యూట్‌గా తీసుకున్నారు.
🏏 RESULT | #Proteas WIN BY 332 RUNS
— Cricket South Africa (@OfficialCSA) April 11, 2022
Keshav Maharaj claimed 7/40 in the second innings as the #Proteas romped to victory in the first hour of Day 4 to secure the #BetwayTestSeries over Bangladesh#SAvBAN #BePartOfIt | @Betway_za pic.twitter.com/47W7F5iNpe
Comments
Please login to add a commentAdd a comment