Australia Defeat England, South Africa Beat Bangladesh In Womens ODI World Cup: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2022లో భాగంగా శనివారం (మార్చి 5) జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా.. ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయాలు నమోదు చేశాయి. ఇంగ్లండ్‌పై ఆసీస్ 12 పరుగుల తేడాతో విజయం సాధించగా, బంగ్లాదేశ్‌ను దక్షిణాఫ్రికా 32 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
ఈ క్రమంలో ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లు మెగా టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేశాయి.
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రేచల్ హేన్స్ (131 బంతుల్లో 130; 14 ఫోర్లు, సిక్స్) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేయగా, ఛేదనలో నథాలీ స్కీవర్ (85 బంతుల్లో 109 నాటౌట్; 13 ఫోర్లు) అజేయమైన శతకంతో మెరిసినప్పటికీ ఇంగ్లండ్‌ను గెలిపించలేకపోయింది. ఆసీస్ బౌలర్లు అలానా కింగ్ 3 వికెట్లు, తహిల మెక్‌గ్రాత్, జెస్ జొనాస్సెన్ తలో 2 వికెట్లు, మెగాన్ ష్కట్ ఓ వికెట్ పడగొట్టడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
మరో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బంగ్లా బౌలర్లు ఫరీహా త్రిస్న (3/35), జహానరా ఆలమ్ (2/28), రితూ మోనీ (2/36) ధాటికి 49.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ కాగా, ఛేదనలో సఫారీ బౌలర్ అయబోంగా ఖాకా (4/32) దెబ్బకు బంగ్లా జట్టు 49.3 ఓవర్లలో 175 పరుగులకే చాపచుట్టేసి 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో వాల్వార్డ్( 52 బంతుల్లో 41: 5 ఫోర్లు), క్యాప్ (45 బంతుల్లో 42; 3 ఫోర్లు), టైరన్ (40 బంతుల్లో 39; ఫోర్, 2 సిక్సర్లు) రాణించగా.. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ షర్మీన్ అక్తర్ (77 బంతుల్లో 34; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. మెగా టోర్నీలో రేపు (మార్చి 6) టీమిండియా దాయాది పాక్‌తో తలపడనుంది.
చదవండి: IND VS SL 1st Test: కోహ్లిని గౌరవించుకున్న టీమిండియా
Comments
Please login to add a commentAdd a comment