
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతోంది. ఈ మెగా టోర్నీ గ్రూపు-బిలో భాగంగా ఫిబ్రవరి 23న లహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడనుంది. ఇప్పటికే లహోర్‌కు చేరుకున్న ఇంగ్లీష్ జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని బట్లర్ సేన భావిస్తోంది.
ఈ క్రమంలో ఆసీస్‌తో మ్యాచ్‌కు ఇంగ్లండ్ క్రికెట్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. భారత్‌తో వన్డే సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కెప్టెన్ జోస్ బట్లర్ స్ధానంలో వికెట్ కీపర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది.
ఆసీస్‌తో మ్యాచ్‌కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే
ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
చదవండి: Champions Trophy: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు