స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్లను నిన్న (ఆగస్ట్ 26) ప్రకటించారు. ఈ జట్లకు జోస్ బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా హండ్రెడ్ లీగ్‌కు దూరంగా ఉండిన బట్లర్ ఆసీస్‌తో సిరీస్‌లతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఈ సిరీస్‌లలో తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆతర్వాత ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనున్నాయి. టీ20 సిరీస్ సెప్టెంబర్ 11, 13, 15 తేదీల్లో.. వన్డే సిరీస్ సెప్టెంబర్ 19, 21, 24, 27, 29 తేదీల్లో జరుగనుంది. లంకతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఆసీస్‌తో టీ20 సిరీస్ మొదలుకానుంది.
ఆసీస్‌తో సిరీస్‌ల కోసం సీనియర్లు జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, క్రిస్ జోర్డన్‌లను పక్కకు పెట్టారు ఇంగ్లండ్ సెలెక్టర్లు. ఈ ముగ్గురు ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ జట్టులో సభ్యులుగా ఉన్నారు. వీరి స్థానంలో ఇంగ్లండ్ సెలెక్టర్లు ఐదుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు (జోర్డన్ కాక్స్, జేకబ్ బేతెల్, డాన్ మౌస్లీ, జోష్ హల్, జాన్ టర్నర్) టీ20 జట్టులో అవకాశం కల్పించారు.
ఈ ఐదుగురు వివిధ దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. వీరిలో జోర్డన్ కాక్స్ వికెట్‌కీపర్ బ్యాటర్ కాగా.. జోష్ హల్, జాన్ టర్నర్ పేస్ బౌలర్లు. జేకబ్ బేతెల్, డాన్ మౌస్లీ బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు. ప్రస్తుత శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో సభ్యులుగా ఉన్న హ్యారీ బ్రూక్, మాథ్యూ పాట్స్, గస్ అట్కిన్సన్‌లకు టీ20 జట్టులో చోటు దక్కలేదు. ఈ ముగ్గురు కేవలం వన్డే సిరీస్‌కు మాత్రమే పరిమితమయ్యారు.
లంకతో తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన మార్క్ వుడ్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోకపోగా.. జో రూట్‌కు వన్డే జట్టు నుంచి రెస్ట్ ఇచ్చారు సెలెక్టర్లు. ఏడాదికి పైగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న జోఫ్రా ఆర్చర్ ఈ సిరీస్‌లతో రీఎంట్రీ ఇస్తున్నాడు.
ఇంగ్లండ్ టీ20 జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్స్, జోర్డన్ కాక్స్, సామ్ కర్రన్, జోష్ హల్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లే, జాన్ టర్నర్
ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్(కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జోష్ హల్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, రీస్ టాప్లే, జాన్ టర్నర్
షెడ్యూల్..
సెప్టెంబర్ 11- తొలి టీ20 (సౌతాంప్టన్)
సెప్టెంబర్ 13- రెండో టీ20 (కార్డిఫ్)
సెప్టెంబర్ 15- మూడో టీ20 (మాంచెస్టర్)
సెప్టెంబర్ 19- తొలి వన్డే (నాటింగ్హమ్)
సెప్టెంబర్ 21- రెండో వన్డే (లీడ్స్)
సెప్టెంబర్ 24- మూడో వన్డే (చెస్టర్ లీ స్ట్రీట్)
సెస్టెంబర్ 27- నాలుగో వన్డే (లండన్)
సెప్టెంబర్ 29- ఐదో వన్డే (బ్రిస్టల్)
Comments
Please login to add a commentAdd a comment