ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బట్లర్ స్థానంలో యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 15) ప్రకటించారు. గాయం కారణంగా 6 అడుగుల 7 అంగుళాల ఫాస్ట్ బౌలర్ జోష్ హల్ కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు ఆసీస్‌తో రెండో టీ20లో చెలరేగిన లియామ్ లివింగ్‌స్టోన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్
25 ఏళ్ల హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టనున్నాడు. 18 నెలల కింద వన్డే అరంగేట్రం చేసిన బ్రూక్.. టెస్ట్, టీ20ల్లో తనను తాను నిరూపించుకున్నప్పటికీ.. వన్డేల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయాడు. బ్రూక్ ఇప్పటివరకు 15 వన్డేలు ఆడి 29.1 సగటున 407 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ద సెంచరీలు ఉన్నాయి. బ్రూక్ ఇటీవల ముగిసిన ద హండ్రెడ్ లీగ్‌లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జామీ స్మిత్, ఒల్లీ స్టోన్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్
ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతున్నాయి. ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచాయి. మూడో టీ20 ఇవాళ (రాత్రి 7 గంటలకు) జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఇప్పటివరకు టాస్ కూడా పడలేదు. టీ20 సిరీస్ ముగిసిన అనంతరం సెప్టెంబర్ 19, 21, 24, 27, 29 తేదీల్లో ఐదు వన్డేలు జరుగనున్నాయి.
చదవండి: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment