ICC Womens ODI World Cup
-
Mithali Raj: అందని ద్రాక్ష.. అవమానం భరించి.. ఫేర్వెల్ మ్యాచ్?!
సాక్షి క్రీడా విభాగం : భారత క్రికెట్ అంటేనే పురుషుల క్రికెట్... స్టార్లు అంటేనే సన్నీ, కపిల్, వెంగీ, సచిన్, ధోని, కోహ్లి.... భారత్‌లో మతమైన క్రికెట్‌కు మెజార్టీ ప్రజల అభిమతమిదే! ఇలాంటి దేశంలో అమ్మాయిలకూ ఓ అధ్యాయం ఉందని మిథాలీ రాజ్ వచ్చాకే తెలిసింది. దీన్ని సువర్ణాధ్యాయంగా మలిచిన ఘనత కూడా ముమ్మాటికి ఆమె ఆటదే. 23 ఏళ్ల క్రితం ప్రభలేని మహిళా క్రికెట్‌కు కొత్త శోభ తెచ్చింది. ఆమె పరుగులు పెడుతున్నప్పుడు అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డులో మన మహిళా క్రికెట్ లేదు. (ఆలస్యంగా బీసీసీఐ గొడుగు కిందకు వచ్చింది). ఆమె సెంచరీలు కొడుతుంటే... రూ. లక్షల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రైజ్‌మనీ రాలేదు. సిరీస్‌లను గెలిపిస్తే ఖరీదైన కారు (ప్లేయర్ ఆఫ్ ది సిరీస్) ఇవ్వలేని అమ్మాయిల క్రికెట్ గతి అది. ఇవేవీ తనకు దక్కకపోయినా... తను నమ్ముకున్న క్రికెట్‌కు 23 ఏళ్ల పాటు సేవలందించిన ధీరవనిత మిథాలీ. గత కొన్నేళ్లుగా భారత మహిళల క్రికెట్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్పు వెనుక మిథాలీ పాత్ర కూడా ఎంతో ఉంది. 23 ఏళ్ల క్రితం ఆడిన తొలి మ్యాచ్‌లోనే అజేయ శతకంతో తారలా దూసుకొచ్చింది మిథాలీ రాజ్. ఈ 23 ఏళ్లలో మహిళల క్రికెట్లో తరాలు మారాయి. ఫార్మాట్లు మారాయి. ప్లేయర్లు మారారు. కానీ మిథాలీ ఆటలో మాత్రం మెరుపు తగ్గలేదు. అద్భుతమైన బ్యాటింగ్‌తో, తనకే సాధ్యమైన రీతిలో కళాత్మకత, దూకుడు కలగలిపి భారత్ తరఫునే కాకుండా మహిళల క్రికెట్లో ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్‌గా పేరు సంపాదించింది. రోజువారీ ఖర్చులకు సరిపడా డబ్బులు లభించని సమయంలో తనకిష్టమైన భరత నాట్యాన్ని వదులుకొని క్రికెట్ పట్ల ప్రేమతో దానిని కెరీర్‌గా ఎంచుకున్న మిథాలీ టీవీల్లో వాణిజ్య ప్రకటనల్లో కనిపించే స్థాయికి ఎదిగింది. ఆమె ఆటకు సంబంధించి అంకెలు, గణాంకాలను పరిశీలిస్తే మిథాలీని అభిమానులు ఆప్యాయంగా ‘లేడీ సచిన్’ అని పిలుస్తారు. Mithali Raj reflects on her glorious cricketing journey and the struggles behind it 📽️ pic.twitter.com/NwW3q5bukE — ICC (@ICC) June 8, 2022 అంచెలంచెలుగా... హైదరాబాద్ నగరంలోని సెయింట్ జాన్స్ అకాడమీలో క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న మిథాలీ ఆ తర్వాత వేర్వేరు వయో విభాగాల్లో రాణిస్తూ తన ప్రత్యేకత చాటుకుంది. మహిళల క్రికెట్‌కు ఏమాత్రం గుర్తింపులేని సమయంలో దానిని కెరీర్‌గా ఎంచుకోవడం పెద్ద సాహసమే. అయితే మిథాలీ తల్లిదండ్రులు దొరైరాజ్, లీలా రాజ్ తమ కూతురిని ఎల్లవేళలా ప్రోత్స హించారు. 1999లో వన్డే కెరీర్‌ను శతకంతో మొదలుపెట్టిన మిథాలీ... 2002లో టెస్టుల్లో అరంగేట్రం చేసింది. తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచినా... మూడో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మిథాలీకి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. కెప్టెన్‌గా అదుర్స్... 2003 వచ్చేసరికి భారత జట్టులో మిథాలీ స్థానం సుస్థిరమైపోయింది. 2005లో ఆమెకు తొలిసారి నాయకత్వ బాధ్యతలు లభించాయి. మిథాలీ కెప్టెన్సీలో భారత జట్టు 2005 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత కూడా మిథాలీ నేతృత్వంలో భారత జట్టు ఎన్నో మధుర విజయాలు సాధించింది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆసియా కప్‌లు, ముక్కోణపు టోర్నీలు, నాలుగు దేశాల టోర్నీలు ఉన్నాయి. అందని ద్రాక్ష... వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును (పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి) రెండుసార్లు ఫైనల్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పిన మిథాలీ రాజ్ ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. ఆమె కెరీర్లో ఇది లోటుగా ఉండిపోనుంది. 2005 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్... 2017 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది. అవమానం భరించి... విండీస్ ఆతిథ్యమిచ్చిన 2018 టి20 ప్రపంచకప్‌లో భారత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో మిథాలీ రాజ్‌ను తుది జట్టులో నుంచి తప్పించడం వివాదాస్పదమైంది. టోర్నీ సమయంలో అప్పటి చీఫ్ కోచ్ రమేశ్ పొవార్‌తోపాటు జట్టులోని ఇతర సీనియర్ సభ్యులు తను జట్టులో సభ్యురాలే కాదన్నట్లు ప్రవర్తించారని అప్పటి బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ సాబా కరీమ్‌లకు మిథాలీ లేఖ రాయడం పెను దుమారం రేపింది. ఈ వివాదం తర్వాత 2019లో టి20 నుంచి మిథాలీ వీడ్కోలు తీసుకుంది. వన్డే, టెస్టు ఫార్మాట్లపై మరింతగా దృష్టి సారించింది. కరోనా కారణంగా గత రెండేళ్లు పెద్దగా సిరీస్‌లు లేకపోయినా మిథాలీ ఆటలో నిలకడ కనబరుస్తూ వచ్చింది. ఈ ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్ సారథ్యంలో భారత జట్టు టైటిల్ ఫేవరెట్‌గా కనిపించినా... సమష్టి ప్రదర్శన లేకపోవడంతో భారత్ రౌండ్ రాబిన్ లీగ్‌లో ఐదో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇదే చివరి ప్రపంచకప్ ఈ టోర్నీకి ముందే తనకు ఇదే చివరి ప్రపంచకప్ అని మిథాలీ ప్రకటించింది. దాంతో టోర్నీ ముగిశాక మిథాలీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతుందని అందరూ భావించారు. కానీ మిథాలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ నెలలో శ్రీలంకలో పర్యటనకు భారత వన్డే, టి20 జట్లను బుధవారం ప్రకటించడానికి కొన్ని గంటల ముందు మిథాలీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది. భారత మహిళల క్రికెట్‌కు మిథాలీ రాజ్ సేవలకు గుర్తింపుగా ఆమె కోసం ప్రత్యేకంగా ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావించింది. అయితే దీనిపై మిథాలీ ఆసక్తి చూపలేదని సమాచారం. చదవండి: Ind Vs SA: కుర్రాళ్లకు భలే చాన్సులే.. ఇక్కడ మెరిస్తే డైరెక్ట్‌గా ఆస్ట్రేలియాకు! Mithali Raj: మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం? View this post on Instagram A post shared by ICC (@icc) -
ఇంగ్లండ్‌కు మరో పరాభవం.. వరుసగా మూడో మ్యాచ్‌లో..!
మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు మరో పరాభవం ఎదురైంది. మెగా టోర్నీలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమిపాలై, క్వార్టర్స్ చేరుకునే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, వెస్టిండీస్ చేతిలో ఓడిన ఇంగ్లండ్, ఇవాళ (మార్చి 14) దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో పరాజయంపాలై మరోసారి భంగపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి దక్షిణాఫ్రికా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్ బ్యూమోంట్ (62), వికెట్ కీపర్ జోన్స్ (53) అర్ధ శతకాలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. సఫారీ బౌలర్ కాప్ (5/45) ఇంగ్లండ్ పతనాన్ని శాసించింది. #TeamSouthAfrica win a thriller ✨ Their unbeaten run in the tournament continues, as #TeamEngland remain winless. #CWC22 pic.twitter.com/4M2zQgumTO — ICC Cricket World Cup (@cricketworldcup) March 14, 2022 అనంతరం 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ లిజెల్లె లీ (9) వికెట్ కోల్పోయినప్పటికీ.. లారా వొల్వార్డ్ (77), తజ్మిన్ బ్రిట్స్ (23), కెప్టెన్ సూన్ లుస్ (36), మరిజన్నె కాప్ (32)ల బాధ్యాతయుతమైన ఇన్నింగ్స్‌ల కారణంగా మరో నాలుగు బంతులు ఉండగానే విజయతీరాలకు చేరింది. ఆఖర్లో త్రిష చెట్టి (11), షబ్రిమ్ ఇస్మాయిల్ (5)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును గెలిపించారు. ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టిన కాప్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. ఇంగ్లండ్‌పై ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. తొలి స్థానంలో ఆసీస్ ఉండగా టీమిండియా మూడో స్థానంలో, ఆతరువాత న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. మెగా టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన పాక్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. చదవండి: Virat Kohli: ‘కోహ్లిని మళ్లీ టెస్టు కెప్టెన్ చేయండి...’! -
NZ Vs IND: సరిపోని హర్మన్‌ప్రీత్ మెరుపులు.. టీమిండియా పరాజయం
-
ICC Womens World Cup: కివీస్‌తో తేల్చుకోవాల్సిందే
హామిల్టన్: ప్రపంచకప్ సన్నాహాల కోసమే న్యూజిలాండ్‌కు వచ్చిన భారత మహిళల క్రికెట్ జట్టు ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో ఓడిపోయింది. అయితే అసలైన వరల్డ్‌కప్‌లో మాత్రం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి మిథాలీ రాజ్ బృందం శుభారంభం చేసింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో జైత్రయాత్ర సాగించాలని టీమిండియా ఆశిస్తోంది. గురువారం భారత్ తమ రెండో లీగ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. పాక్‌తో తొలి మ్యాచ్‌లో నెగ్గినప్పటికీ బ్యాటింగ్ గొప్పగా అయితే లేదు. టాపార్డర్‌లో ఓపెనర్ షఫాలీ వర్మ సహా మిడిలార్డర్ బ్యాటర్స్ కెప్టెన్ మిథాలీ, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ ఇలా ఏ ఒక్కరూ పట్టుమని పది పరుగులైనా చేయలేకపోయారు. వీరంతా కలిసి చేసింది 15 పరుగులే! లోయర్ ఆర్డర్లో స్నేహ్ రాణా, పూజ వస్త్రకర్ రాణించకపోతే టీమిండియా కష్టాల్లో పడేది. ఇప్పుడు పటిష్టమైన న్యూజిలాండ్‌తో ఏ ఒకరో ఇద్దరో ఆడితే ఏ మాత్రం సరిపోదు. పాక్‌తో ఆడినట్లు ఆడితే అసలు కుదరనే కుదరదు. ముఖ్యంగా మిడిలార్డర్ బాధ్యత తీసుకోవాలి. ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్‌లో ఉండటం సానుకూలాంశమైనప్పటికీ మిగతావారు కూడా జట్టు స్కోరులో భాగం కావాలి. అప్పుడే ఆతిథ్య జట్టుకు సవాల్ విసరొచ్చు. లేదంటే ద్వైపాక్షిక సిరీస్‌లో ఎదురైన ఫలితమే ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పటిష్టంగా కివీస్ మరోవైపు కివీస్ తమ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో చివరి ఓవర్లో ఓడింది. కానీ వెంటనే తేరుకున్న న్యూజిలాండ్... బంగ్లాదేశ్‌ను సులువుగా ఓడించింది. ఓపెనర్లు సోఫీ డివైన్, సుజీ బేట్స్, అమెలియా కెర్ సూపర్ ఫామ్‌లో ఉండటం జట్టుకు బలం. బౌలింగ్‌లోనూ లియా తహుహు, జెస్ కెర్, అమీ సాటర్త్‌వైట్ ప్రత్యర్థి బ్యాటర్స్‌పై నిప్పులు చెరుగుతున్నారు. సొంతగడ్డ అనుకూలతలు ఎలాగూ ఉన్నాయి. ఇలా ఏ రకంగా చూసిన కూడా భారత్, న్యూజిలాండ్‌ల మధ్య గురువారం ఆసక్తికర పోరు జరగడం ఖాయం. ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఓవరాల్‌గా ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరిగాయి. 2 మ్యాచ్‌ల్లో భారత్, 9 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. -
World Cup 2022: న్యూజిలాండ్‌తో భారత్ పోరు.. వాళ్లదే పైచేయి.. అయినా గానీ..
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022 ఎనిమిదో మ్యాచ్‌లో భాగంగా భారత జట్టు ఆతిథ్య న్యూజిలాండ్‌తో గురువారం తలపడనుంది. సెడాన్ పార్కు వేదికగా జరిగే మ్యాచ్‌లో వైట్ ఫెర్న్స్తో మిథాలీ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇరు జట్లు వన్డేల్లో ఎన్నిసార్లు పోటీపడ్డాయి? ప్రపంచకప్ చరిత్రలో ఎవరిది పైచేయి అన్న వివరాలు పరిశీలిద్దాం. వాళ్లే ముందున్నారు! అంతర్జాతీయ స్థాయిలో భారత మహిళా జట్టు న్యూజిలాండ్‌తో ఇప్పటి వరకు 53 వన్డేలు ఆడింది. ఇందులో వైట్ ఫెర్న్స్ 32 విజయాలు సాధించగా... భారత్ ఇరవైంట మాత్రమే గెలుపొందింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. వరల్డ్‌కప్‌లో ముఖాముఖి రికార్డు ప్రపంచకప్ చరిత్రలోనూ భారత్‌పై న్యూజిలాండ్ జట్టుదే పైచేయి. ఇప్పటి వరకు ఈ ఐసీసీ మెగా ఈవెంట్లో ఇరు జట్లు తొమ్మిదిసార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో తొమ్మిదింట వైట్ ఫెర్న్స్ జయకేతనం ఎగురవేయగా.. భారత్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. మిథాలీ సూపర్ రికార్డు భారత మహిళా జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్‌కు న్యూజిలాండ్‌పై మంచి రికార్డు ఉంది. ఇరు జట్ల బ్యాటర్లతో పోలిస్తే ఆమే అందరి కంటే ఒక అడుగు ముందు ఉన్నారు. ఇప్పటివరకు ఈ వెటరన్ బ్యాటర్ 273 పరుగులు సాధించారు. ఇక ప్రపంచకప్ చరిత్రలోనూ ఇరు జట్లు పోటీ పడినపుడు మిథాలీ మాత్రమే సెంచరీ సాధించారు. 2017 వరల్డ్‌కప్‌లో మిథాలీ 109 పరుగులు చేశారు. అంకెల్లో వెనుకబడ్డా.. ఆత్మవిశ్వాసంతో మిథాలీ సేన ప్రపంచకప్-2017లో న్యూజిలాండ్- భారత్ 2017లో చివరిసారిగా మెగా ఈవెంట్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మిథాలీ సేన 186 పరుగుల తేడాతో వైట్ ఫెర్న్స్‌పై ఘన విజయం సాధించింది. తద్వారా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక 109 పరుగులు సాధించిన కెప్టెన్ మిథాలీరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. కాగా ప్రస్తుత టోర్నీలో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారీ విజయంతో బోణీ కొట్టింది. 107 పరుగుల తేడాతో గెలుపొంది ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. మరోవైపు.. న్యూజిలాండ్ సైతం బంగ్లాదేశ్ మహిళా జట్టుపై 9 వికెట్ల తేడాతో గెలుపొంది జోష్ మీద ఉంది. ఈ క్రమంలో మార్చి 10 నాటి పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: ICC Test Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన జడేజా.. నంబర్ 1 -
'మూన్బాల్'తో భయపెట్టిన బౌలర్.. షాక్‌లో బ్యాటర్!
Women's World Cup: వన్డే మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా బౌలర్ నికోలా కారీ 'మూన్బాల్' తో ప్రత్యర్ధి బ్యాటర్‌ను షాక్‌కు గురి చేసింది. పాక్ ఇన్నింగ్స్ 45వ ఓవర్ వేసిన కారీ బౌలింగ్‌లో.. బంతి చేతి నుంచి జారిపోయి బ్యాటర్ తలపై నుంచి హై ఫుల్ టాస్‌గా వెళ్లింది. ఆ బంతిని ఆపడానికి వికెట్ కీపర్ అలిస్సా హీలీ ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించారు. అయితే ఫ్రీ హిట్ బాల్‌కు కారీ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చింది. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ అలీసా హీలీ(72), మెగ్ లానింగ్(35) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ మహరూఫ్(78), ఆలియా రియాజ్(53) పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అలీనా కింగ్ రెండు వికెట్లు పడగొట్టగా, స్కాట్,పేరీ, కారీ చెరో వికెట్ సాధించారు. మూన్ బాల్ బౌలర్ వేసే బంతి ఎక్కువ ఎత్తుకు వెళ్లి కీపర్‌కు కూడా అందకపోతే దాన్ని మూన్ బాల్‌గా పరిగణిస్తారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టిన ఆసీస్... బంగ్లాను ఆటాడుకున్న సౌతాఫ్రికా
Australia Defeat England, South Africa Beat Bangladesh In Womens ODI World Cup: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2022లో భాగంగా శనివారం (మార్చి 5) జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా.. ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయాలు నమోదు చేశాయి. ఇంగ్లండ్‌పై ఆసీస్ 12 పరుగుల తేడాతో విజయం సాధించగా, బంగ్లాదేశ్‌ను దక్షిణాఫ్రికా 32 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లు మెగా టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేశాయి. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రేచల్ హేన్స్ (131 బంతుల్లో 130; 14 ఫోర్లు, సిక్స్) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేయగా, ఛేదనలో నథాలీ స్కీవర్ (85 బంతుల్లో 109 నాటౌట్; 13 ఫోర్లు) అజేయమైన శతకంతో మెరిసినప్పటికీ ఇంగ్లండ్‌ను గెలిపించలేకపోయింది. ఆసీస్ బౌలర్లు అలానా కింగ్ 3 వికెట్లు, తహిల మెక్‌గ్రాత్, జెస్ జొనాస్సెన్ తలో 2 వికెట్లు, మెగాన్ ష్కట్ ఓ వికెట్ పడగొట్టడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మరో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బంగ్లా బౌలర్లు ఫరీహా త్రిస్న (3/35), జహానరా ఆలమ్ (2/28), రితూ మోనీ (2/36) ధాటికి 49.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ కాగా, ఛేదనలో సఫారీ బౌలర్ అయబోంగా ఖాకా (4/32) దెబ్బకు బంగ్లా జట్టు 49.3 ఓవర్లలో 175 పరుగులకే చాపచుట్టేసి 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో వాల్వార్డ్( 52 బంతుల్లో 41: 5 ఫోర్లు), క్యాప్ (45 బంతుల్లో 42; 3 ఫోర్లు), టైరన్ (40 బంతుల్లో 39; ఫోర్, 2 సిక్సర్లు) రాణించగా.. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ షర్మీన్ అక్తర్ (77 బంతుల్లో 34; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. మెగా టోర్నీలో రేపు (మార్చి 6) టీమిండియా దాయాది పాక్‌తో తలపడనుంది. చదవండి: IND VS SL 1st Test: కోహ్లిని గౌరవించుకున్న టీమిండియా -
వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. అదరగొట్టిన మంధాన
రంగియోరా (న్యూజిలాండ్): వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా మంగళవారం జరిగిన రెండో ప్రాక్టీస్ పోరులో భారత జట్టు 81 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై నెగ్గింది. ఓపెనర్ స్మృతి మంధాన (67 బంతుల్లో 66; 7 ఫోర్లు), దీప్తి శర్మ (64 బంతుల్లో 51; 1 ఫోర్) అర్ధ సెంచరీలు చేశారు. యస్తిక భాటియా (42; 5 ఫోర్లు), కెప్టెన్ మిథాలీ రాజ్ (30; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. దీంతో మొదట భారత్ 50 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. తర్వాత విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులే చేయగలిగింది. -
జైత్రయాత్రకు బ్రేక్
♦ దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌కు పరాభవం ♦ 115 పరుగుల తేడాతో ఓడిన మిథాలీ బృందం ♦ లిజెల్లీ లీ మెరుపు ఇన్నింగ్స్ ♦ డేన్ నికెర్క్ మాయాజాలం మిథాలీ సేన విజయ పరంపరకు బ్రేక్ పడింది. వరుస విజయాలతో దూసుకెళుతోన్న భారత మహిళల జట్టు అనూహ్యంగా దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. మొదట బ్యాట్‌తో లిజెల్లీ లీ చెలరేగగా... కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ బంతితో మాయాజాలం చేసింది. దాంతో అన్ని విభాగాల్లో విఫలమైన భారత్ చేతులెత్తేసి భారీ ఓటమిని మూటగట్టుకుంది. భారత్ సెమీస్ చేరుకోవాలంటే ఈనెల 12న ఆసీస్‌తో, 15న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో విజయం సాధించాల్సి ఉంటుంది. లీసెస్టర్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండ్ నైపుణ్యంతో మిథాలీ సేనను కంగుతినిపించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 115 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 273 పరుగులు చేసింది. లిజెల్లీ లీ (65 బంతుల్లో 92; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగింది. కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ (66 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. శిఖా పాండే 3 వికెట్లు తీసింది. తర్వాత భారత్ 46 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ (111 బంతుల్లో 60; 5 ఫోర్లు) పోరాడగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వాన్ నికెర్క్ 4 వికెట్లు పడగొట్టి భారత్‌ను దెబ్బ తీసింది. లిజెల్లీ లీ మెరుపులు... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే శిఖా పాండే షాక్ ఇచ్చింది. తన తొలి ఓవర్లోనే ఓపెనర్ లౌరా వొల్వార్డ్ (1)ను బౌల్డ్ చేసింది. దీంతో క్రీజ్‌లో ఉన్న ఓపెనర్ లిజెల్లీకి త్రిశా చెట్టీ (24) జతకాగా, పరుగుల వేగం మందగించింది. తొలి ఐదు ఓవర్లు ముగిసేసరికి జట్టు 16/1 స్కోరు చేసింది. శిఖా వేసిన ఆరో ఓవర్లో లిజెల్లీ ఒక్కసారిగా 2 ఫోర్లు, సిక్సర్‌తో జోరు పెంచింది. ఇక్కడితో మొదలైన ఆమె ‘షో’ ఇక ఏ దశలోనూ ఆగలేదు. లిజెల్లీ 49 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మరింత వేగంగా ఆడటంతో మిగతా 42 పరుగుల్ని కేవలం 16 బంతుల్లోనే చేసింది. జట్టు స్కోరు 134 పరుగుల వద్ద ఆమె మూడో వికెట్‌గా నిష్క్రమించింది. ఇందులో లిజెల్లీవే 92 పరుగులుండటం విశేషం. ఆ తర్వాత వాన్ నికెర్క్... డు ప్రీజ్ (22), ట్రియాన్ (24)లతో కలిసి జట్టు స్కోరును 250 పరుగుల్ని దాటించింది. మూకుమ్మడిగా... గెలిస్తే సెమీస్ బెర్తును ఖాయం చేసుకునే మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా చేతులెత్తేశారు. ఓపెనర్ స్మృతి మంధన (4) వరుసగా మూడో మ్యాచ్‌లో విఫలం కాగా... జట్టు స్కోరు 47 పరుగుల వరకు బాగానే సాగింది. అదే స్కోరుపై ఓపెనర్ పూనమ్ రౌత్ (22)ను అయబొంగ ఖాకా బౌల్డ్ చేసింది. అక్కడితో భారత్ పతనం వేగమైంది. నిలకడగా ఆడుతూ అర్ధసెంచరీల రికార్డును సాధించి న కెప్టెన్ మిథాలీ రాజ్ (0) తొలి బంతికే డకౌటైంది. విండీస్‌తో మ్యాచ్‌లో పరుగులే ఇవ్వకుండా 4 వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్ వాన్ నికెర్క్ ఇన్నింగ్స్ 12వ ఓవర్లో మిథాలీని, హర్మన్‌ప్రీత్ కౌర్ (0)ను డకౌట్ చేసింది. తర్వాత వేద కృష్ణమూర్తి (3)ని అయబొంగ ఖాకా, శిఖా పాండే (0)ను నికెర్క్ పెవిలియన్‌కు పంపారు. సుష్మా వర్మ (1) రనౌట్ కావడంతో 65 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ దీప్తి శర్మ, జులన్ (79 బంతుల్లో 43 నాటౌట్; 6 ఫోర్లు) కాసేపు పోరాడినా భారత్‌ను ఓటమి నుంచి తప్పించలేకపోయారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: వోల్వార్ట్ (బి) శిఖా పాండే 1; లిజెల్లీ లీ ఎల్బీడబ్ల్యూ (బి) హర్మన్‌ప్రీత్ 92, త్రిశా చెట్టి (సి) జులన్ (బి) ఏక్తా బిష్త్ 24; డు ప్రీజ్ (స్టంప్డ్) సుష్మ (బి) పూనమ్ యాదవ్ 22; మరిజన్ కాప్ (బి) హర్మన్‌ప్రీత్ 19; వాన్ నికెర్క్ (సి) స్మృతి (బి) శిఖా పాండే 57; సునే లూస్ (సి) వేద (బి) జులన్ 16; క్లో ట్రియాన్ (సి) జులన్ (బి) శిఖా పాండే 24; షబ్నిమ్ (స్టంప్డ్) సుష్మ (బి) ఏక్తా బిష్త్ 5; అయబొంగ ఖాకా నాటౌట్ 7; మొసెలిన్ డానియెల్స్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 273. వికెట్ల పతనం: 1–1, 2–92, 3–134, 4–160, 5–162, 6–203, 7–252, 8–265, 9–265. బౌలింగ్: జులన్ గోస్వామి 10–0–53–1, శిఖా పాండే 9–0–40–3, ఏక్తా బిష్త్ 9–1–68–2, పూనమ్ యాదవ్ 10–1–31–1, దీప్తి శర్మ 8–0–61–0, హర్మన్‌ప్రీత్ కౌర్ 4–0–18–2. భారత్ ఇన్నింగ్స్: పూనమ్ రౌత్ (బి) అయబొంగ ఖాకా 22; స్మృతి (సి) షబ్నిమ్ (బి) మరిజన్ కాప్ 4; దీప్తి శర్మ (సి) మొసెలిన్ (బి) వాన్ నికెర్క్ 60; మిథాలీ రాజ్ (బి) వాన్ నికెర్క్ 0; హర్మన్‌ప్రీత్ కౌర్ ఎల్బీడబ్ల్యూ (బి) వాన్ నికెర్క్ 0; వేద (బి) అయబొంగ ఖాకా 3; శిఖా పాండే (స్టంప్డ్) త్రిశా చెట్టి (బి) వాన్ నికెర్క్ 0; సుష్మ రనౌట్ 1, జులన్ నాటౌట్ 43; ఏక్తా బిష్త్ (సి) వాన్ నికెర్క్ (బి) లూస్ 13; పూనమ్ యాదవ్ (సి) త్రిశా చెట్టి (బి) షబ్నిమ్ 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (46 ఓవర్లలో ఆలౌట్) 158. వికెట్ల పతనం: 1–4, 2–47, 3–48, 4–48, 5–53, 6–56, 7–65, 8–118, 9–155, 10–158. బౌలింగ్: షబ్నిమ్ 9–1–18–1, మరిజన్ కాప్ 8–1–31–1, అయబొంగ ఖాకా 10–1–33–2, డానియెల్స్ 3–0–21–0, వాన్ నికెర్క్ 10–0–22–4, లూస్ 6–1–27–1.