Breadcrumb
NZ Vs IND: సరిపోని హర్మన్‌ప్రీత్ మెరుపులు.. టీమిండియా పరాజయం
Published Thu, Mar 10 2022 6:22 AM | Last Updated on Thu, Mar 10 2022 1:52 PM
Live Updates
NZ Vs IND: న్యూజిల్యాండ్‌తో భారత్ పోరు
సరిపోని హర్మన్‌ప్రీత్ మెరుపులు.. టీమిండియా పరాజయం
న్యూజిలాండ్ వుమెన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మహిళల జట్టు 62 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 46.4 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్స్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ 71 పరుగులతో రాణించినప్పటికి మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో లియా తహుహు, అమిలియా కెర్ చెరో మూడు వికెట్లు.. హెలి జాన్సెన్ 2 వికెట్లు తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వుమెన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీ సాథర్వెయిట్ 75, అమిలియా కెర్ 50, కేటీ మార్టిన్ 41 పరుగులు చేశారు. టీమిండియా మహిళల బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4, రాజేశ్వరీ గైక్వాడ్ 2, దీప్తి శర్మ, ఝలన్ గోస్వామి చెరో ఒక వికెట్ తీశారు.
ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా..
261 పరుగుల లక్ష్య చేదనలో టీమిండియా మహిళల జట్టు తడబడుతుంది. 138 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 40, పూజా వస్తా్రకర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
వెనువెంటనే రెండు వికెట్లు.. కష్టాల్లో టీమిండియా
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా మహిళల జట్టు 100 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. మిథాలీ రాజ్(33), రిచా ఘోష్(0) వెనువెంటనే ఒకే ఓవర్లో ఔటయ్యారు. ఈ రెండు వికెట్లు అమిలియా కెర్ ఖాతాలోకి వెళ్లాయి. ప్రస్తుతం 31 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా..
న్యూజిలాండ్ ఉమెన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. తాజాగా 28 పరుగులు చేసిన యస్తికా బాటియా తాహుహు బౌలింగ్‌లో మెకేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 22 ఓవర్ల ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. మిథాలీ రాజ్ 16, హర్మన్‌ప్రీత్ కౌర్ 1 పరుగుతో ఆడుతున్నారు.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
దీప్తి శర్మ(5) రూపంలో టీమిండియా ఉమెన్స్ రెండో వికెట్ కోల్పోయింది. తహుహు బౌలింగ్‌లో దీప్తి శర్మ ఎల్బీగా వెనుదిరిగింది. ప్రస్తుతం భారత్ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. యష్టికా బాటియా(13), మిథాలీ రాజ్(0) పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్‌కోల్పోయిన టీమిండియా
న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డేలో టీమిండియా మహిళల జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఆరు పరుగులు చేసిన మంధాన కెర్ బౌలింగ్‌లో బేట్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం భారత్ 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. యక్షిత బాటియా 11, దీప్తి శర్మ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
టీమిండియా మహిళల టార్గెట్ 261
వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా టీమిండియా వుమెన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ వుమెన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీ సాథర్వెయిట్ 75, అమిలియా కెర్ 50, కేటీ మార్టిన్ 41 పరుగులు చేశారు. టీమిండియా మహిళల బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4, రాజేశ్వరీ గైక్వాడ్ 2, దీప్తి శర్మ, ఝలన్ గోస్వామి చెరో ఒక వికెట్ తీశారు.
40 ఓవర్లలో న్యూజిలాండ్ స్కోరు 211/4
న్యూజిలాండ్ వుమెన్స్ దాటిగా ఆడుతోంది. టీమిండియా వుమెన్స్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న న్యూజిలాండ్ బ్యాటర్స్ పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అమి సాథర్వెయిట్ 71, కేటీ మార్టిన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్..
టీమిండియా మహిళలతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ 29 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అమి సాథర్వెయిట్ 40, మాడీ గ్రీన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 50 పరుగులు చేసిన అమిలియా కెర్ రాజేశ్వరీ గైక్వాడ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది
20 ఓవర్లలో న్యూజిలాండ్ వుమెన్స్ 117/2
20 ఓవర్ల ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ వుమెన్స్ 2 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. అమిలియా కేర్ 49, అమి సాథర్వెయిట్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
టీమిండియా వుమెన్స్‌తో జరుగుతున్న వన్డేలో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో 35 పరుగులు చేసిన డివైన్ వస్త్రాకర్ బౌలింగ్‌లో రిచా ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం న్యూజిలాండ్ వుమెన్స్ 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్, స్కోర్ 33-1(6.2 ఓవర్లు)
టాస్ గెలిచి ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు పిలిచిన టీంఇండియా బౌలర్లు న్యూజిలాండ్‌కు ధీటైన జవాబునిస్తున్నారు. 2.1 ఓవర్ల వద్ద న్యూజిలాండ్ ఒపెనర్ సుజీ బెట్స్ భారత ఫీల్డర్ పూజా వస్త్రాకర్‌కు చిక్కింది. సుజీ బెట్స్ కేవలం 5 పరుగులకే రనౌట్‌గా వెనుదిరిగింది. మరో వికెట్ నష్టపోకుండా న్యూజిలాండ్ బ్యాటర్స్ ఆచితూచి ఆడుతున్నారు. న్యూజిలాండ్ స్కోర్ 33-1(6.2 ఓవర్లు)గా ఉంది.
మహిళల వన్డే ప్రపంచకప్: జట్ల వివరాలు ఇవే..
భారత మహిళల జట్టు : స్మృతి మంధాన, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, మిథాలీ రాజ్(సి), హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్(w), స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గయక్వాడ్
న్యూజిలాండ్ మహిళల జట్టు: సోఫీ డివైన్(సి), సుజీ బేట్స్, అమేలియా కెర్, అమీ సాటర్త్‌వైట్, మాడీ గ్రీన్, ఫ్రాన్సిస్ మాకే, కేటీ మార్టిన్(w), హేలీ జెన్సన్, లీ తహుహు, జెస్ కెర్, హన్నా రోవ్
మహిళల వన్డే ప్రపంచకప్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత్.. సోఫీ డివైన్ నాయకత్వంలోని న్యూజిల్యాండ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. టాస్ గెలిచి భారత మహిళల జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓవరాల్‌గా ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరిగాయి. 2 మ్యాచ్‌ల్లో భారత్, 9 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది.
Related News By Category
Related News By Tags
-
ICC Womens World Cup: కివీస్‌తో తేల్చుకోవాల్సిందే
హామిల్టన్: ప్రపంచకప్ సన్నాహాల కోసమే న్యూజిలాండ్‌కు వచ్చిన భారత మహిళల క్రికెట్ జట్టు ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో ఓడిపోయింది. అయితే అసలైన వరల్డ్‌కప్‌లో మాత్రం చిరకాల ప్రత్యర్థి పాకిస...
-
World Cup 2022: భారత్‌కు తప్పని ఓటమి.. న్యూజిలాండ్ ఘన విజయం
ICC Women ODI World Cup 2022 Ind W Vs Nz W: న్యూజిలాండ్ చేతిలో భారత మహిళా జట్టుకు మరోసారి పరాభవం తప్పలేదు. గత రికార్డులను కొనసాగిస్తూ న్యూజిలాండ్ మహిళా జట్టు భారత్ మీద అద్భుత విజయం సాధించింది. ఐసీస...
-
World Cup 2022: న్యూజిలాండ్‌తో భారత్ పోరు.. వాళ్లదే పైచేయి.. అయినా గానీ..
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022 ఎనిమిదో మ్యాచ్‌లో భాగంగా భారత జట్టు ఆతిథ్య న్యూజిలాండ్‌తో గురువారం తలపడనుంది. సెడాన్ పార్కు వేదికగా జరిగే మ్యాచ్‌లో వైట్ ఫెర్న్స్తో మిథాలీ సేన అమీతుమీ తేల్చుకోనుంద...
-
టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా.. కివీస్‌తో పోరుకు సై
ICC Under 19 Womens T20 World Cup 2023: అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీలో షఫాలీ వర్మ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాలో బుధవారం ‘సూపర్ సిక్స్’ దశ మ్యాచ్‌లు మ...
-
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఇంటికే.. ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్!
టీ20 ప్రపంచకప్ 2022 (సూపర్-12) సమరం రసవత్తరంగా సాగుతోంది. సూపర్-12 మ్యాచ్‌లు అఖరి దశకు చేరుకున్నప్పటికీ ఇంకా సెమీస్ బెర్త్‌లు ఖారారు కాలేదు. గ్రూపు-1 నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్...
Comments
Please login to add a commentAdd a comment