Ex-India Women Captain Mithali Raj Predicts Her Finalists For T20 World Cup 2022 - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా ఇంటికే.. ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్‌!

Published Wed, Nov 2 2022 8:06 AM | Last Updated on Wed, Nov 2 2022 10:56 AM

Mithali Raj predicts her finalists for T20 World Cup 2022 - Sakshi

టీ20 ప్రపంచకప్‌ 2022 (సూపర్‌-12) సమరం రసవత్తరంగా సాగుతోంది. సూపర్‌-12 మ్యాచ్‌లు అఖరి దశకు చేరుకున్నప్పటికీ ఇంకా సెమీస్‌ బెర్త్‌లు ఖారారు కాలేదు. గ్రూపు-1 నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక సెమీస్‌ రేసులో ఉండగా.. గ్రూపు-2 నుంచి భారత్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ సెమీఫైనల్‌ స్థానాలు కోసం పోటీ పడుతున్నాయి.

ఇక ఆడిలైడ్‌ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తే తమ సెమీస్‌ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ప్రపంచకప్‌-2022 ఫైనల్‌కు చేరే జట్లను భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అంచనా వేసింది. ఈ మెగా ఈవెంట్‌ ఫైనల్లో భారత్‌- న్యూజిలాండ్‌ జట్లు తలపడే అవకాశం ఉంది అని మిథాలీ తెలిపింది. 

స్టార్‌ స్పోర్ట్స్‌తో మిథాలీ మాట్లాడుతూ.. నా అంచనా ప్రకారం సెమీఫైనల్‌కు గ్రూపు-2 నుంచి భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు చేరుకుంటాయి. అదే విధంగా గ్రూపు-1 నుంచి న్యూజిలాండ్‌ కచ్చితం‍గా సెమీఫైనల్లో అడుగు పెడుతోంది. అయితే మరో స్థానం కోసం ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఫైనల్‌కు  భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు చేరుతాయని భావిస్తున్నా" అని ఆమె పేర్కొంది.
చదవండి: బంగ్లాదేశ్‌తో భారత్ కీలక పోరు.. గెలిస్తే సెమీస్ బెర్త్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement