Women's World Cup: వన్డే మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా బౌలర్ నికోలా కారీ 'మూన్‌బాల్' తో ప్రత్యర్ధి బ్యాటర్‌ను షాక్‌కు గురి చేసింది. పాక్ ఇన్నింగ్స్ 45వ ఓవర్ వేసిన కారీ బౌలింగ్‌లో.. బంతి చేతి నుంచి జారిపోయి బ్యాటర్ తలపై నుంచి హై ఫుల్ టాస్‌గా వెళ్లింది. ఆ బంతిని ఆపడానికి వికెట్ కీపర్ అలిస్సా హీలీ ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించారు. అయితే ఫ్రీ హిట్ బాల్‌కు కారీ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చింది. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ అలీసా హీలీ(72), మెగ్ లానింగ్(35) పరుగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ మహరూఫ్(78), ఆలియా రియాజ్(53) పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అలీనా కింగ్ రెండు వికెట్లు పడగొట్టగా, స్కాట్,పేరీ, కారీ చెరో వికెట్ సాధించారు.
మూన్ బాల్
బౌలర్ వేసే బంతి ఎక్కువ ఎత్తుకు వెళ్లి కీపర్‌కు కూడా అందకపోతే దాన్ని మూన్ బాల్‌గా పరిగణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment