
వన్డే మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మౌంట్ మౌంగానుయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ అలీసా హీలీ(72), మెగ్ లానింగ్(35) పరుగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
పాక్ బ్యాటర్లలో కెప్టెన్ మహరూఫ్(78), ఆలియా రియాజ్(53) పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అలీనా కింగ్ రెండు వికెట్లు పడగొట్టగా, స్కాట్,పేరీ, కారీ చెరో వికెట్ సాధించారు. ఇక వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో ఆస్ట్రేలియా తొలి స్ధానంలో ఉంది. కాగా పాక్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. అంతకు ముందు తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఘోరమి ఓటమి చెందిన సంగతి తెలిసిందే.
చదవండి: Shane Warne: ‘నేను వార్న్‌ను అంతమాట అనకుండా ఉండాల్సింది’
Comments
Please login to add a commentAdd a comment