
ICC Womens World Cup 2022 Schedule Announced.. ఐసీసీ వుమెన్స్ వరల్డ్‌కప్ 2022కు సంబంధించి షెడ్యూల్ విడుదల అయింది. న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ఈ ప్రపంచకప్ మార్చి 4న మొదలై ఏప్రిల్ 3న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇక మార్చి 4న న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. ఇక టీమిండియా మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌ను మార్చి 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది. ఆ తర్వాత మార్చి 10న న్యూజిలాండ్‌తో, మార్చి 12న వెస్టిండీస్‌తో, మార్చి 16న ఇంగ్లండ్‌తో, మార్చి 19న ఆస్ట్రేలియాతో, మార్చి 22న బంగ్లాదేశ్‌తో , మార్చి 27 సౌతాఫ్రికాతో టీమిండియా మహిళల జట్టు మ్యాచ్‌లు ఆడనుంది.
చదవండి: India Tour Of SA: కోహ్లి నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు
టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొననుండగా.. లీగ్ దశలో ఒక్కో జట్టు మిగిలిన జట్టుతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఆక్లాండ్, క్రైస్ట్‌చర్చి, డ్యునెడిన్, హామిల్టన్, తౌరంగా, వెల్లింగ్టన్ వేదికలుగా టోర్నీలో మొత్తం 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీ ఫైనల్ మార్చి 30న వెల్లింగ్టలన్ వేదికగా.. రెండో సెమీఫైనల్ మార్చి 31న క్రైస్ట్‌చర్చి వేదికగా జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ ఏప్రిల్ 3న క్రైస్ట్‌చర్చి వేదికగానే జరగనుంది. కాగా ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డేను కేటాయించినట్లు ఐసీసీ తెలిపింది.
ఇక ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్ 2017-20 వరకు పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత్‌లు ప్రపంచకప్‌కు క్వాలిఫై అయినట్లు పేర్కొంది. ఇక ఆతిథ్య హోదాలో న్యూజిలాండ్ కూడా నేరుగా క్వాలిఫై జాబితాలో చేరింది. ఇక మిగిలిన మూడు జట్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్‌లు అర్హత కోసం క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. కోవిడ్ నేపథ్యంలో మ్యాచ్‌లను రద్దు చేశారు. ఇక చివరిసారి ఐసీసీ వుమెన్స్ టి20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఫైనల్లో ఓడించిన ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది.
చదవండి: Under-19 World Cup: ఆస్ట్రేలియా అండర్-19లో భారత సంతతి కుర్రాడు.. వింత బౌలర్ల జాబితాలో చోటు