ICC Womens World Cup
-
పాక్‌తో పోరుకు భారత్ ‘సై’
కేప్‌టౌన్: టి20 ప్రపంచకప్‌ను సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగనున్న భారత మహిళల జట్టు నేడు గ్రూప్ ‘బి’ తొలిపోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుంది. కీలకమైన పోరుకు ముందు డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫిట్నెస్ సమస్యలు జట్టును సతమతం చేస్తున్నాయి. తొలి మ్యాచ్‌కు స్మృతి గాయంతో జట్టుకు దూరమవడం బ్యాటింగ్‌పై ప్రభావం చూపగలదు. అయితే ఇటీవల షఫాలీ వర్మ, రిచా అండర్–19 ఈవెంట్లో రాణించారు. ఇప్పుడు కూడా బాధ్యతను పంచుకుంటే ఆ సమస్యను అధిగమించవచ్చు. జెమీమా, హర్లీన్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మిడిలార్డర్లో రాణిస్తే జట్టుకు ఢోకా ఉండదు. బౌలింగ్ లో రేణుక, శిఖా పాండే, దీప్తి శర్మ రాణిస్తే పాకిస్తాన్‌పై భారత్‌కు విజయం సులువవుతుంది. -
దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. టాప్5లో టీమిండియా
ఐసీసీ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టీమిండియా ఐదో స్థానానికి చేరుకుంది. రాంఛీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా.. న్యూజిలాండ్‌ను అధిగమించి ఐదో స్థానాన్ని సొంతం చేసుకుంది. 2020-23 ఏడాది సూపర్ లీగ్‌లో భాగంగా ఇప్పటి వరకు 17 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా .. 12 మ్యాచ్‌ల్లో విజయం, 5 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 119 పాయింట్లు ఉన్నాయి. కాగా వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి.. పాయింట్ల పట్టికతో సంబంధం లేకుండా నేరుగా టీమిండియా అర్హత సాధిస్తుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా.. వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇక ఐసీసీ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో 125 పాయింట్లతో ఇంగ్లండ్ ఆగ్ర స్థానంలో కొనసాగుతుండగా.. 120 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. ఇక ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు 2023 వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. చదవండి: IND vs SA: ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు.. రెండో భారత ఆటగాడిగా..! -
NZ W Vs Ban W: బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ అద్భుత విజయం.. ఏకంగా..
ICC Women World Cup 2022 Nz Vs Ban: ఐసీసీ మహిళా వరల్డ్‌కప్-2022 టోర్నీలో న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. బంగ్లాదేశ్ మహిళా జట్టుపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 27 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్లు షమీమా సుల్తానా(33 పరుగులు) ఫర్జానా హక్(52 పరుగులు) మినహా మిగతా వాళ్లంతా అత్యల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ మహిళా జట్టు ఒక వికెట్ కోల్పోయి 20 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది. సుజీ బేట్స్ అద్భుత హాఫ్ సెంచరీ(79 పరుగులు- 8 ఫోర్లు)తో అజేయంగా నిలిచి వైట్ ఫెర్న్స్' విజయంలో కీలక పాత్ర పోషించింది. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ఇక ఓపెనర్, కెప్టెన్ సోఫీ డివైన్ 14 పరుగులు చేయగా.. మరో బ్యాటర్ అమీలియా కెర్ 47 పరుగులు(నాటౌట్) సాధించింది. ఐసీసీ మహిళా వరల్డ్‌కప్-2022 న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు: బంగ్లాదేశ్- 140/8 (27) న్యూజిలాండ్- 144/1 (20) 9 వికెట్ల తేడాతో వైట్ ఫెర్న్స్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సుజీ బేట్స్ చదవండి: Ind W Vs Pak W: పాక్ కెప్టెన్ కూతురిని ముద్దు చేసిన భారత మహిళా క్రికెటర్లు.. ఈ ఫొటో ఎంత అందంగా ఉందో! వైరల్ -
ప్రపంచకప్‌లో భారత్ బోణి.. పాకిస్తాన్‌కు చుక్కలు..
Ind W Vs Pak W 2022 World Cup: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022లో భారత్ బోణి కొట్టింది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. కాగా పాక్‌పై భారత్‌కు ఇది వరుసగా 11వ విజయం. ఇక 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. భారత బౌలర్ల ధాటికి 137 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సిద్రా అమీన్(30) తప్ప మిగితా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ మూడు వికెట్లు పడగొట్టగా, గోస్వామి, స్నేహ్ రానా చెరో రెండు వికెట్లు సాధించారు.ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులు సాదించింది. భారత బ్యాటర్లలో పూజా వస్త్రాకర్ అద్భుతంగా రాణించింది. ఇక 114 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్‌ను పూజా వస్త్రాకర్(67),స్నేహ్ రానా(53) అదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ మిథాలీ, హర్మన్ ప్రీత్, షఫాలీ వర్మ నిరాశపరిచాడు. పాక్ బౌలర్లలో నిదా ధార్,సంధు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. బేగ్, ఆమీన్ ఒక్కో వికెట్ సాధించారు. ఇక ఈమ్యాచ్‌లో 67 పరుగులతో అద్భుతంగా రాణించిన పూజా వస్త్రాకర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో మార్చి10న తలపడనుంది. చదవండి: Shane Warne: శవపరీక్షకు వార్న్ మృతదేహం.. బోరుమన్న దిగ్గజం కుమారుడు -
గూగుల్.. ఆడవాళ్లు మీకు జోహార్లు
వివక్ష.. ఇది కనిపించని రంగమంటూ లేదు. అయితే ఈ పరిస్థితిని మార్చే ప్రయత్నాలు మాత్రం జరుగు... తూనే ఉన్నాయి. ఈ తరుణంలో మహిళల క్రికెట్‌కు ఆదరణ గతకొంతకాలంగా పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ పోటీలు మొదలుకాగా.. ఈ టోర్నీకి మద్ధతుగా గూగుల్ డూడుల్‌తో ప్లేయర్లకు జోహార్లు చెప్పింది. 12వ ఎడిషన్ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు మార్చి 4న ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 3వ తేదీ దాకా జరగబోయే ఈ టోర్నీ కోసం గూగుల్ డూడుల్‌ను రిలీజ్ చేసింది. ఆరుగురు ప్లేయర్లు ప్రేక్షకుల మధ్య గేమ్‌లో మునిగిపోయినట్లు ఉండే డూడుల్ ఇది. గూగుల్ హోం పేజీలో ఈ డూడుల్‌ను మీరూ గమనించొచ్చు. క్లిక్ చేయగానే స్కోర్ బోర్డుకు వెళ్లడంతో పాటు బాల్స్ ఎడమ నుంచి కుడికి దూసుకెళ్లడం చూడొచ్చు. New Google Doodle has been released: "Women's Cricket World Cup 2022 Begins!" :)#google #doodle #designhttps://t.co/oM7i79OJ1E pic.twitter.com/UeRDYk14qt — Google Doodles EN (@Doodle123_EN) March 3, 2022 ప్రపంచంలో తొలి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ 1844లో కెనడా, అమెరికా మధ్య జరిగింది. అయితే మహిళల ప్రపంచ కప్ మాత్రం 1973 నుంచి మొదలైంది. కొవిడ్ కారణంగా కిందటి ఏడాది జరగాల్సిన టోర్నీ.. ఈ ఏడాదికి వాయిదా పడింది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు తలపడుతున్నాయి. తొలి మ్యాచ్ శుక్రవారం ఆతిథ్య న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య మొదలైంది. విండీస్ 259 పరుగులు సాధించగా.. 260 పరుగుల లక్క్ష్యంతో న్యూజిలాండ్ బరిలోకి దిగింది. మహిళల ప్రపంచ కప్‌లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ దాయాది పాక్‌తో మార్చ్ 6వ తేదీన(ఆదివారం) తలపడనుంది. ఉదయం 6.30ని. మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఆసీస్, ఇంగ్లండ్‌లు ఫేవరెట్‌గా ఉన్నాయి ఈసారి టోర్నీలో. -
పాకిస్తాన్‌తో భారత్ తొలి మ్యాచ్.. మీరు సిద్దంగా ఉండండి: విరాట్ కోహ్లి
మహిళల ప్రపంచకప్-2022 సమరానికి భారత జట్టు సిద్దమైంది. మార్చి 6న భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మిథాలీ సేనకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మద్దతుగా నిలిచాడు. అంతే కాకుండా సోషల్ మీడియా వేదికగా భారత జట్టుకు మద్దతు తెలియజేయాలని అభిమానులను విరాట్ కోహ్లి కోరాడు. మిథాలీ రాజ్ నేతృత్వంలోని జట్టు దక్షిణాఫ్రికా,వెస్టిండీస్‌తో జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోను విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది. 2017 వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్.. ఈ సారి ఎలాగైనా గెలిచి తొలిసారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవాలని భావిస్తోంది. ఇక కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనుంది. "భారత జట్టుకు సపోర్ట్ చేయడానికి సిద్దంగా ఉండండి. మన మద్దతు తెలియజేయడానికి ఇంతకంటే మంచి సమయం మరి ఉండదు. ఎందుకంటే ఇది ఐసీసీ మహిళల ప్రపంచకప్-2022 సమరం. కాబట్టి మార్చి 6 ఉదయం 6.30 గంటలకు అలారమ్ సెట్ చేయండి" అని కోహ్లి ట్వీట్ చేశాడు. కాగా అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో వుమెన్ క్రికెట్‌కు విరాట్ మద్దతుగా నిలిచాడు. అదే విధంగా అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ చేరిన యువ భారత జట్టుకు విరాట్ కోహ్లి విలువైన సలహాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అండర్ 19 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. చదవండి: Womens ODI World Cup 2022: ప్రపంచ కప్ సమరానికి సై.. భారత్ తొలి మ్యాచ్‌లోనే.. -
'ప్రపంచకప్ టైటిల్‌తో నా కెరీర్‌ను ముగించాలి అనుకుంటున్నా'
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 సమరానికి రంగం సిద్దమైంది. న్యూజిలాండ్ వేదికగా మెగా టోర్నమెంట్ మార్చి 4నుంచి ప్రారంభం కానుంది. మౌంట్ మౌంగానుయ్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో అతిథ్య న్యూజిలాండ్.. వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. కాగా మెగా టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత కెప్టెన్ మిథాలీ రాజ్ తన మనసులోని మాటను బయట పెట్టింది. "2000లో కూడా న్యూజిలాండ్‌లోనే జరిగిన ప్రపంచకప్‌లో ఆడాను. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడకు వచ్చాను. "నా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రపంచకప్ టైటిల్‌తో ముగించాలని కోరుకుంటున్నా. మా జట్టు సభ్యులంతా బాగా ఆడి మా ప్రణాళికలన్నీ సఫలం చేయాలని ఆశిస్తున్నా. కొన్ని సిరీస్‌ల ముందు మా జట్టు బాగా ఆడలేదనేది వాస్తవం. అయితే ప్రపంచకప్ సమయానికి అన్నీ చక్కదిద్దుకున్నాం. ప్రపంచకప్ గెలిస్తే మా ఆటగాళ్లందరికీ స్వదేశంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మమ్మల్ని చూసి అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నాం" అని మిథాలీ విలేకరుల సమావేశంలో పేర్కొంది. ఇక మిథాలీ రాజ్‌కు ఇది 6వ వన్డే వరల్డ్ కప్. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా ఆమె నిలవనుంది. చదవండి: Womens ODI World Cup 2022: ప్రపంచ కప్ సమరానికి సై.. భారత్ తొలి మ్యాచ్‌లోనే.. -
ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ సమరం
-
ఐసీసీ వరల్డ్‌కప్ 2022: పాక్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్
ICC Womens World Cup 2022 Schedule Announced.. ఐసీసీ వుమెన్స్ వరల్డ్‌కప్ 2022కు సంబంధించి షెడ్యూల్ విడుదల అయింది. న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ఈ ప్రపంచకప్ మార్చి 4న మొదలై ఏప్రిల్ 3న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇక మార్చి 4న న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. ఇక టీమిండియా మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌ను మార్చి 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది. ఆ తర్వాత మార్చి 10న న్యూజిలాండ్‌తో, మార్చి 12న వెస్టిండీస్‌తో, మార్చి 16న ఇంగ్లండ్‌తో, మార్చి 19న ఆస్ట్రేలియాతో, మార్చి 22న బంగ్లాదేశ్‌తో , మార్చి 27 సౌతాఫ్రికాతో టీమిండియా మహిళల జట్టు మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: India Tour Of SA: కోహ్లి నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొననుండగా.. లీగ్ దశలో ఒక్కో జట్టు మిగిలిన జట్టుతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఆక్లాండ్, క్రైస్ట్‌చర్చి, డ్యునెడిన్, హామిల్టన్, తౌరంగా, వెల్లింగ్టన్ వేదికలుగా టోర్నీలో మొత్తం 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీ ఫైనల్ మార్చి 30న వెల్లింగ్టలన్ వేదికగా.. రెండో సెమీఫైనల్ మార్చి 31న క్రైస్ట్‌చర్చి వేదికగా జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ ఏప్రిల్ 3న క్రైస్ట్‌చర్చి వేదికగానే జరగనుంది. కాగా ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డేను కేటాయించినట్లు ఐసీసీ తెలిపింది. ఇక ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్ 2017-20 వరకు పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత్‌లు ప్రపంచకప్‌కు క్వాలిఫై అయినట్లు పేర్కొంది. ఇక ఆతిథ్య హోదాలో న్యూజిలాండ్ కూడా నేరుగా క్వాలిఫై జాబితాలో చేరింది. ఇక మిగిలిన మూడు జట్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్‌లు అర్హత కోసం క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. కోవిడ్ నేపథ్యంలో మ్యాచ్‌లను రద్దు చేశారు. ఇక చివరిసారి ఐసీసీ వుమెన్స్ టి20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఫైనల్లో ఓడించిన ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. చదవండి: Under-19 World Cup: ఆస్ట్రేలియా అండర్-19లో భారత సంతతి కుర్రాడు.. వింత బౌలర్ల జాబితాలో చోటు -
హైదరాబాద్‌లో క్రికెట్ వరల్డ్ కప్
-
18 కోట్ల మంది వీక్షించారు..!
లండన్: ఇటీవల ఇంగ్లండ్ లో ముగిసిన మహిళల ప్రపంచకప్‌కు రికార్డు స్థాయిలో ఆదరణ లభించింది. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది ఈ టోర్నీని తిలకించినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వెల్లడించింది. 2013 వన్డే ప్రపంచకప్‌తో పోలిస్తే ఈ మెగా టోర్నీని వీక్షించిన సమయంలో 300 శాతం పెరిగినట్లు ఐసీసీ పేర్కొంది. అదే సమయంలో భారత్ , దక్షిణాఫ్రికాల్లో అత్యధిక మంది ప్రేక్షకులు మ్యాచ్ లను వీక్షించినట్లు స్పష్టం చేసింది. భారత్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా 15.6 కోట్ల మంది మహిళల ప్రసారాలను వీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది కోట్ల మంది చూడగా, ఒక్క ఫైనల్ పోరును 12.6 కోట్ల మంది వీక్షించారు. భారత జట్టు ఫైనల్ కు చేరడంతో భారత్ లో వీక్షణ సమయం 500 శాతం పెరిగింది. దీనిపై ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్ సన్ హర్షం వ్యక్తం చేశారు. 'మహిళల క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానిక ఇదే తగిన సమయం. ఈ మెగా టోర్నీతో మహిళల క్రికెట్ ఆదరణ పెరిగింది. దానికి నిదర్శనం ఈ లెక్కలే'అని ఆయన పేర్కొన్నారు. -
వరల్డ్ కప్ మిస్.. విజేత ఇంగ్లండ్
- ఫైనల్స్‌లో 9 పరుగుల తేడాతో ఇండియా ఓటమి - నాలుగోసారి ప్రపంచ విజేతగా ఇంగ్లండ్ - భారత మహిళకు అభినందనల వెల్లువ లండన్: బ్రిటిష్ గడ్డపై జయకేతనం ఎగరేయాలనుకున్న భారత్ తృటిలో అవకాశాన్ని చేజార్చుకుంది. మహిళల వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు చేజిక్కించుకుంది. ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో టీమిండియాపై ఇంగ్లండ్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్రిటీష్ జట్టు విసిరిన 229 పరుగులను ఛేధించేక్రమంలో ఇండియా 48.4 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ ప్రపంచ విజేత కావడం ఇది నాలుగోసారి కావడం విశేషం. కప్ గెలవలేకపోయినా సిరీస్ ఆద్యంతం అద్భుతంగా ఆడిన భారత మహిళలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఊరించి.. ఉసూరుమనిపించారు 229 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా పూర్తిచేయగలదనిపించిన ఇండియా ఆఖరి ఓవర్లలో ఉసూరుమనిపించింది. 86 పరుగులతో వీరవిహారం చేసిన ఓపెనర్ రౌత్ 4వ వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత టీమిండియా పేకమేడలా కూలిపోయింది. మరో ఓపెనర్ మంధనా డకౌట్ కాగా, కెప్టెన్ మిథాలీ 17 పరుగులు మాత్రమే చేసింది. సెమీస్‌లో రికార్డు స్కోరు సాధించిన హర్మీత్ కౌర్ (51), ఐదో స్థానంలో వచ్చిన కృష్ణమూర్తి (35)లు తమ వంతు పరుగులు చేశారు. అయితే లోయర్ మిడిలార్డర్ దారుణంగా విఫలం చెందడం, టెయిలెండర్లు నిమిషాల్లోనే పెవిలియన్‌కు దారిపట్టడంతో ఇండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్ పేస్ బౌలర్ ష్రబ్‌షోల్ ఏకంగా 6 వికెట్లు పగడొట్టి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మరో బౌలర్ హార్ట్లే 2 వికెట్లు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ను భారత్ కట్టడి చేసి సాధారణ స్కోరుకే పరిమితం చేసింది. ఇంగ్లండ్ క్రికెటర్లలో ఓపెనర్లు విన్ ఫీల్డ్డ్(24), బీమాంట్(23)లు ఫర్వాలేదనిపించగా, సారా టేలర్(45), స్కీవర్(51)లు రాణించారు. చివర్లో బ్రంట్(34), జెన్నీ గన్(25 నాటౌట్)లు బాధ్యతాయుతంగా ఆడటంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 228 పరుగులు చేసింది. భారత బౌలర్లలో గోస్వామి మూడు వికెట్లు సాధించగా, పూనమ్ యాదవ్ రెండు వికెట్లు లభించాయి. ఇక గైక్వాడ్ ఒక వికెట్ తీశారు. -
క్రికెట్ వరల్డ్ కప్: భారత్ దూకుడు..
- మహిళల ప్రపంచకప్‌లో శ్రీలంకను ఓడించిన టీమిండియా - వరుసగా నాలుగు విజయాలతో మిథాలి సేన దూడుకు డెర్బీ: ఐసీసీ మహిళల ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా వరుసగా నాలుగో విజయం సాధించింది. బుధవారం డెర్బీలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 16 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ విసిరిన 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడిన లంక.. 47.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 216 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక బ్యాటింగ్ విమన్స్‌లో సురాంగిక 61(75 బంతుల్లో), సిరివర్ధనే37(63 బంతుల్లో) తప్ప మిగతావారంతా అవసరమైన మేరకు రాణించలేదు. ఓపెనర్ హన్సిక 29, జయాంగని 25, వీరక్కోడి 21 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా, బిస్త్, శర్మలు చెరో వికెట్ నేలకూల్చారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 232 పరుగులు సాధించింది. భారత్ బ్యాటింగ్ ఉమెన్ లో దీప్తీ శర్మ(78), కెప్టెన్ మిథాలీ రాజ్ (53)లు రాణించారు. ఇక చివర్లో వేద కృష్ణమూర్తి(29), హర్మన్ ప్రీత్ కౌర్(20) లు దాటిగా ఆడటంతో భారత్ 200 పై చిలుకు పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో శ్రీపాలి విరొక్కడే 3 వికెట్లు తీయగా రణవీర(2), కాంచన, గుణరత్నే చెరో వికెట్ పడగొట్టారు. తర్వాతి మ్యాచ్ సౌతాఫ్రికాతో.. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లో దిగ్గజ సౌతాఫ్రికా జట్టుతో తలపడనుంది. జులై 8న (శనివారం) లీసెస్టర్ వేదికగా భారత్-సఫారీలు పోటీపడనున్నాయి. పాకిస్తాన్ మళ్లీ ఢమాల్ గత మ్యాచ్‌లో టీమిండియా చేతిలో చిత్తైన పాకిస్తాన్ బుధవారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారీ తేడాతో ఓటమిపాలైంది. పాక్‌పై ఆసీస్ 159 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
విండీస్ పరీక్షకు సిద్ధం
♦ ఆత్మవిశ్వాసంతో మిథాలీ రాజ్ బృందం ♦ విజయమే లక్ష్యంగా బరిలోకి ♦ మహిళల వన్డే ప్రపంచకప్ ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల జట్టు... వెస్టిండీస్‌తో పోరుకు సై అంటోంది. ‘ట్రిపుల్’ ప్రపంచకప్ చాంపియన్‌ను జయించిన ధీమాతో ఉన్న మిథాలీ సేన... దీన్ని తలకెక్కించుకోకుండా బరిలోకి దిగాలి. ఎందుకంటే వెస్టిండీస్ ఆషామాషీ జట్టు కాదు. గత వన్డే ప్రపంచకప్ రన్నరప్, టి20 చాంపియన్. పైగా ఆస్ట్రేలియా చేతిలో పరాజయంతో దెబ్బతిన్న పులిలా కాచుకుంది. ఈ నేపథ్యంలో భారత అమ్మాయిలు ఏమాత్రం ఆదమరిచినా అంతే సంగతులు! కాబట్టి... మిథాలీ సేన బహు పరాక్! టాంటన్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు మరో విజయంపై దృష్టి పెట్టింది. ఆతిథ్య ఇంగ్లండ్‌పై గెలిచి టోర్నీలో శుభారంభం చేసిన మిథాలీ సేన గురువారం వెస్టిండీస్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ‘ట్రిపుల్’ ప్రపంచకప్ చాంపియన్ ఇంగ్లండ్‌ను కంగుతినిపించిన భారత్ ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత క్రికెటర్లు నిలకడగా రాణిస్తున్నారు. ఓపెనర్లు స్మృతి మంధన, పూనమ్ రౌత్‌లతో పాటు టాపార్డర్‌లో మిథాలీరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో పేసర్ శిఖాపాండేతో పాటు స్పిన్నర్లు దీప్తి శర్మ, పూనమ్ యాదవ్‌లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను సమర్థంగా కట్టడి చేస్తున్నారు. సెమీఫైనల్ లక్ష్యంగా పెట్టుకున్న మిథాలీ అండ్ కో ఇంగ్లండ్‌పై కనబరిచిన జోరును టోర్నీ ఆసాంతం కొనసాగించాలని భావిస్తోంది. అయితే గత మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లతో అదరగొట్టినప్పటికీ ఫీల్డింగ్ మాత్రం పేలవంగా ఉంది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఉన్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఇచ్చిన సునాయాస క్యాచుల్ని భారత ఫీల్డర్లు నేలపాలు చేశారు. జట్టు మేనేజ్మెంట్, కోచింగ్ స్టాఫ్ ఈ విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలి. మేటి ఈవెంట్లో ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే అవకాశాలు గల్లంతవుతాయన్న సంగతి మరవొద్దు. సమష్టిగా రాణించాలి... మరోవైపు వెస్టిండీస్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. అయితే ఒక్క మ్యాచ్ ఫలితంతో స్టెఫానీ టేలర్ సేనని తక్కువ అంచనా వేయలేం. గత మ్యాచ్‌లో టాపార్డర్ బ్యాట్స్‌మెన్ హేలీ మాథ్యూస్, చెడియన్ నషన్, కెప్టెన్ టేలర్ చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. అయితే ఏ ఒక్కరూ వాటిని భారీ స్కోర్లుగా మలచుకోలేకపోయారు. ఇదే విండీస్ ఇన్నింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. దీనికి తోడు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడం కూడా విండీస్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. అయితే భారత్‌తో జరిగే కీలకమైన మ్యాచ్‌లో ఇలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సమష్టిగా రాణించాలనే పట్టుదలతో విండీస్ ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. జట్లు: భారత్: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధన, పూనమ్ రౌత్, హర్మన్‌ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, మోనా మేశ్రమ్, దీప్తి శర్మ, జులన్ గోస్వామి, శిఖా పాండే, ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్. వెస్టిండీస్: స్టెఫానీ టేలర్ (కెప్టెన్), మెరిస్సా, రినిస్ బాయిస్, షమీలియా కానెల్, షానెల్ డెలీ, డియాం డ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్, క్వియానా జోసెఫ్, అనిసా మొహమ్మద్, ఫెలిసియా వాల్టర్స్, చెడియన్ నషన్. మధ్యాహ్నం గం. 3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
క్రికెట్ వరల్డ్ కప్: టీమిండియా శుభారంభం
- తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను చిత్తుచేసిన మిథాలీ సేన డెర్బీ: మహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా శుభారంభం చేసింది. శుక్రవారం డెర్బీలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌పై 35 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. టీమిండియా విసిరిన 281 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించాల్సిఉండగా బ్రిటిష్ జట్టు 47.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు బీమౌంట్(14), టేలర్(22) ఆశించినమేర రాణించలేదు. అయితే వన్‌డౌన్ బ్యాట్స్ఉమన్ నైట్(46), ఐదో స్థానంలో బ్యటింగ్కు దిగిన విల్సన్(81)లు భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. 32వ ఓవర్లో నైట్ అనూహ్యంగా రనౌట్ అయింది. ఆ తర్వాత నుంచి క్రమం తప్పకుండా వికెట్లు పడిపోయాయి. 44వ ఏడో వికెట్‌గా విల్సన్ రనౌట్ కావడంతో భారత్ విజయం దాదాపు ఖరారైంది. మిగిలిన మూడు వికెట్లు కూడా టపటపా రాలిపోవడంతో లాంఛనం పూర్తయింది. భారత బౌలర్లలో శర్మకు 3 వికెట్లు దక్కగా, పాండే 2, పూనమ్ యాదవ్ ఒక వికెట్ నేలకూల్చారు. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత ఓవర్లలో 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 281 పరుగులు సాధించింది. ఓపెనర్లు రౌత్(86), మంధన(90) చెలరేగి ఆడారు. కెప్టెన్ మిథాలీ రాజ్(71) మెరుపు వేగంతోనూ, కౌర్ 24 పరుగులతోనూ రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో నైట్‌కు రెండు వికెట్లు దక్కగా, హజెల్ ఒక్క వికెట్ పడగొట్టారు. మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్ జయభేరి వరల్డ్ కప్‌లో భాగంగానే జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్రిస్టల్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 188 పరుగులు సాధించింది. 7.4 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయిన కివీస్ 189 పరుగులు చేసి విజయం సాధించింది. -
నేడు భారత్ VS పాకిస్తాన్
కొలంబో: మరో విజయంతో ఫైనల్‌కు చేరాలని భారత్... చిరకాల ప్రత్యర్థిపై ఈసారైనా గెలిచి ప్రపంచకప్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలనే లక్ష్యంతో పాకిస్తాన్...ఐసీసీ మహిళల ప్రపంచకప్ వన్డే క్రికెట్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆదివారం ముఖాముఖి పోరులో తలపడనున్నాయి. జూన్ లో ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి టీమిండియా ఇప్పటికే అర్హత సాధించింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లో్లనూ భారత్‌నే విజయం వరించింది. చివరిసారి ఈ రెండు జట్లు భారత్‌లో జరిగిన 2013 వన్డే ప్రపంచకప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో తలపడ్డాయి. -
ఎదురులేని భారత్
కొలంబో: ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జింబాబ్వేతో సోమవారం జరిగిన చివరిదైన నాలుగో మ్యాచ్‌లో మిథాలీ రాజ్ బృందం తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ (5/19) ధాటికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 28.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత జట్టు 9 ఓవర్లలో వికెట్ నష్టపోయి 61 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. వేద కృష్ణమూర్తి (16 బంతుల్లో 29; 6 ఫోర్లు) అవుటవ్వగా... మోనా (21 నాటౌట్; 4 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (11 నాటౌట్) అజేయంగా నిలిచారు. ‘సూపర్ సిక్స్’ దశ మ్యాచ్‌ల్లో భారత జట్టు ఈనెల 15న దక్షిణాఫ్రికాతో; 17న బంగ్లాదేశ్‌తో; 19న పాకిస్తాన్‌తో తలపడుతుంది. -
జులన్, సుకన్య ఔట్
న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌కు ముందు భారత జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే అగ్రశ్రేణి బ్యాట్స్‌విమన్ స్మృతి మందన దూరం కాగా, తాజాగా సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి గాయం కారణంగా జట్టునుంచి తప్పుకుంది. జులన్‌తో పాటు సుకన్య పరీదాలను కూడా టీమ్‌నుంచి తొలగించారు. 14 మంది సభ్యుల జట్టులోకి ఎంపికైన తర్వాత వీరిద్దరు పూర్తి ఫిట్‌గా లేరని డాక్టర్లు నిర్ధారించడంతో మార్పు అనివార్యమైంది. గోస్వామి స్థానం లో సోని యాదవ్, పరీదా స్థానంలో మాన్సి జోషిలను జట్టులోకి తీసుకున్నారు.