ఐసీసీ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టీమిండియా ఐదో స్థానానికి చేరుకుంది. రాంఛీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా.. న్యూజిలాండ్‌ను అధిగమించి ఐదో స్థానాన్ని సొంతం చేసుకుంది. 2020-23 ఏడాది సూపర్ లీగ్‌లో భాగంగా ఇప్పటి వరకు 17 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా .. 12 మ్యాచ్‌ల్లో విజయం, 5 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.
ఓవరాల్‌గా ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 119 పాయింట్లు ఉన్నాయి. కాగా వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి.. పాయింట్ల పట్టికతో సంబంధం లేకుండా నేరుగా టీమిండియా అర్హత సాధిస్తుంది.
ఇక ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా.. వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇక ఐసీసీ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో 125 పాయింట్లతో ఇంగ్లండ్ ఆగ్ర స్థానంలో కొనసాగుతుండగా.. 120 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. ఇక ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు 2023 వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి.
చదవండి: IND vs SA: ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు.. రెండో భారత ఆటగాడిగా..!
Comments
Please login to add a commentAdd a comment