
కేప్‌టౌన్: టి20 ప్రపంచకప్‌ను సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగనున్న భారత మహిళల జట్టు నేడు గ్రూప్ ‘బి’ తొలిపోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుంది. కీలకమైన పోరుకు ముందు డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫిట్‌నెస్ సమస్యలు జట్టును సతమతం చేస్తున్నాయి.
తొలి మ్యాచ్‌కు స్మృతి గాయంతో జట్టుకు దూరమవడం బ్యాటింగ్‌పై ప్రభావం చూపగలదు. అయితే ఇటీవల షఫాలీ వర్మ, రిచా అండర్–19 ఈవెంట్‌లో రాణించారు. ఇప్పుడు కూడా బాధ్యతను పంచుకుంటే ఆ సమస్యను అధిగమించవచ్చు. జెమీమా, హర్లీన్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మిడిలార్డర్‌లో రాణిస్తే జట్టుకు ఢోకా ఉండదు. బౌలింగ్ లో రేణుక, శిఖా పాండే, దీప్తి శర్మ రాణిస్తే పాకిస్తాన్‌పై భారత్‌కు విజయం సులువవుతుంది.