T20 World Cup 2021: Robin Uthappa Comments On His Favourite Team In Semi Final Clash - Sakshi
Sakshi News home page

AUS vs PAK: రెండు జట్లు ఓకే.. అయితే పాకిస్తానే నా ఫేవరెట్‌: టీమిండియా క్రికెటర్‌

Published Thu, Nov 11 2021 1:53 PM | Last Updated on Thu, Nov 11 2021 2:59 PM

T20 World Cup 2021: Robin Uthappa Picks Pakistan As  Favourites In Semi Final Clash Against Australia - Sakshi

Robin Uthappa Picks Pakistan As  Favourites In Semi Final Clash Against Australia: టీ20 ప్రపంచకప్‌-2021 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే తొలి సెమిఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించి న్యూజిలాండ్‌ ఫైనల్లో అడుగు పెట్టింది. ఇక గురువారం(నవంబర్‌11)న రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో భారత వెటరన్‌ ఆటగాడు రాబిన్‌ ఊతప్ప ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ కీలక పోరులో పాకిస్తాన్‌ విజయం సాధించి ఫైనల్‌కు చేరుతుందని ఊతప్ప జోస్యం చెప్పాడు. ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్లు అద్బుతంగా ఆడుతున్నాయని.. అయితే పాక్‌ మాత్రం ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదని, అందుకే ఫేవరెట్‌గా ఎంచుకున్నానని అతడు తెలిపాడు. 

"టీ20 ప్రపంచకప్‌లో తదుపరి సమరం పాకిస్తాన్‌- ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ  మెగా టోర్నమెంట్‌లో  ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా  ఓడిపోని ఏకైక జట్టుగా పాకిస్తాన్‌ కొనసాగుతుంది. అది వారికి కలిసిసొస్తుందని నేను ఆశిస్తున్నాను. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఈ టోర్నమెంట్‌లో ఆద్బుతంగా ఆడుతోంది. ఆసీస్‌ను కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఐసీసీ టోర్నమెంట్‌లో వాళ్లకు మంచి రికార్డు ఉంది.  కానీ టీ20 ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా టైటిల్‌ను అందకోలేకపోయారు. ఈ టోర్నీలో ఆసీస్‌  ఓపెనర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. కంగారూలు తమదైన రోజున ఏ జట్టునైనా ఓడించగలరు" అని ఊతప్ప పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement