Shoaib Akhtar Comments On Man Of The tournament Award T20 World Cup 2021: అందని ద్రాక్షగా ఊరిస్తున్న టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఎట్టకేలకు కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచకప్-2021లో (నవంబర్ 14)న న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో చారిత్రాత్మక విజయం సాధించిన.. ఆస్ట్రేలియా తొలి సారి టైటిల్‌ను ముద్దాడింది. అయితే ఈ విజయంలో ఆజట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడు. ఒక్క ఫైనల్లోనే కాకుండా.. వార్నర్ టోర్నీ అంతటా అద్బుతంగా రాణించాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా డేవిడ్ వార్నర్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. అయితే డేవిడ్ వార్నర్‌ను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపిక చేయడంపై పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు.
ట్విట్టర్ వేదికగా స్పందించిన అక్తర్.. "ఇది అసలు సరైన నిర్ణయం కాదు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ బాబర్ ఆజమ్ కు ఇస్తారాని ఎదురు చూశాను. ఇదైతే కచ్చితంగా అన్యాయమే "అంటూ ట్వీట్ చేశాడు. ఎందుకంటే.. ఈ టోర్నీలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం కూడా అద్బుతంగా రాణించాడు. ఈ ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లలో 303 పరుగులు చేసిన బాబర్ ఆజాం.. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. మరోవైపు వార్నర్.. ఏడు ఇన్నింగ్స్‌లలో 289 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అత్యధిక పరుగులు చేసిన బాబర్‌కు అవార్డు ఇవ్వకుండా వార్నర్‌కు ఎలా ఇచ్చారాని ఐసీసీపై అక్తర్ మండి పడ్డాడు.
చదవండి: T20 World Cup 2021: టీమిండియా ఆటగాళ్లకు ఐసీసీ షాక్! ఒక్కరంటే ఒక్కరికీ కూడా నో ఛాన్స్
Was really looking forward to see @babarazam258 becoming Man of the Tournament. Unfair decision for sure.
— Shoaib Akhtar (@shoaib100mph) November 14, 2021
Comments
Please login to add a commentAdd a comment