వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా పాకిస్తాన్- ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. పాకిస్తన్ మాత్రం తమ తుది జట్టులో ఒకే ఒక మార్పు చేసింది. ఏకంగా తమ వైస్ కెప్టెన్‌పై వేటు వేసిన పాక్ జట్టు మేనెజ్‌మెంట్.. యువ స్పిన్నర్ ఉస్మా మీర్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటిచ్చింది.
పాకిస్తాన్ చెత్త రివ్యూ..
కాగా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తీసుకున్న ఓ రివ్యూ తీవ్ర చర్చనీయాంశమైంది. షాహీన్ అఫ్రిది అత్యుత్సహం వల్ల పాకిస్తాన్ మొదటిలోనే ఒక రివ్యూను కోల్పోయింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ఆరంభించేందుకు ఓపెనర్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ క్రీజులోకి వచ్చారు. పాకిస్తాన్ బౌలింగ్ ఎటాక్‌ను మొదలు పెట్టేందుకు బాబర్ ఆజం షాహీన్ అఫ్రిది చేతికి బంతి ఇచ్చాడు. తొలి ఓవర్‌లో అఫ్రిది వేసిన మొదటి బంతిని డేవిడ్ వార్నర్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే బంతి బ్యాట్‌కు తాకి ప్యాడ్‌కు తగిలింది. కానీ షాహీన్ అఫ్రిది మాత్రం ఎల్బీకి గట్టిగా అప్పీల్ చేశాడు. అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. అయితే పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం షాహీన్ మీద నమ్మకంతో ఆఖరి సెకెండ్‌లో రివ్యూకు వెళ్లాడు. అయితే రిప్లేలో మాత్రం బంతి క్లియర్‌గా బ్యాట్‌కు తాకినట్లు కన్పించింది.
దీంతో థర్డ్ అంపైర్ కూడా నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో పాకిస్తాన్ ఆటగాళ్ల ముఖాలు వాడిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో కొంచెం కూడా తెలివి లేకుండా చెత్త రివ్యూ తీసుకున్న బాబర్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.
చదవండి: BCCI-Hardik Pandya Ruled Out: టీమిండియాకు షాక్! బీసీసీఐ కీలక ప్రకటన.. పాండ్యా అవుట్.. ఇక
— Sitaraman (@Sitaraman112971) October 20, 2023
Comments
Please login to add a commentAdd a comment