
PC: Twitter
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన చివరి టెస్టు సిరీస్‌ను అద్భుతమైన సెంచరీతో ఆరంభించాడు. పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో వార్నర్ సెంచరీతో మెరిశాడు. 125 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో వార్నర్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
కాగా వార్నర్‌కు ఇది 26వ టెస్టు సెంచరీ. ఓవరాల్‌గా ఇది డేవిడ్ భాయ్‌కు 49వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 42 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్‌తో పాటు స్మిత్(17) ఉన్నాడు. కాగా ఈ సిరీస్ అనంతరం టెస్టు క్రికెట్ నుంచి వార్నర్ తప్పుకోనున్న సంగతి తెలిసిందే.
This is David Warner. 💪
— Johns. (@CricCrazyJohns) December 14, 2023
- Davey is roaring like a Lion in Test cricket. pic.twitter.com/dTpMfiwT0z
Comments
Please login to add a commentAdd a comment