ఈజీ క్యాచ్ మిస్ చేశాడు.. అసహనం వ్యక్తం చేసిన బాబర్ (PC: PC: cricket.com.au X)
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ ఫీల్డింగ్ తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్‌లలో సులువైన క్యాచ్‌లు వదిలేసి పాక్ భారీ మూల్యం చెల్లించిన విషయం తెలిసిందే. పెర్త్ టెస్టులో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ జారవిడిచాడు.
అదే విధంగా.. మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ డేవిడ్ వార్నర్ క్యాచ్‌ను వదిలేశాడు. ఇలా కీలక సమయాల్లో ఇద్దరు స్టార్ ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపే ఛాన్స్ మిస్ చేసుకున్న పాకిస్తాన్.. ఆయా మ్యాచ్‌లలో 360, 79 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
తద్వారా సిరీస్ కోల్పోవడమే గాకుండా కంగారూ గడ్డపై వరుసగా 16 టెస్టుల్లో ఓడి తమ చెత్త రికార్డును మరింత పదిలం చేసుకుంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది.
ఇందులో భాగంగా బుధవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన షాన్ మసూద్ బృందం తొలుత బ్యాటింగ్ చేసి.. 313 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో మొదటిరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది.
ఈ నేపథ్యంలో 6/0తో రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ను ఆరంభంలోనే దెబ్బకొట్టే ఛాన్స్ పాకిస్తాన్‌కు వచ్చింది. గురువారం నాటి ఆటలో పద్నాలుగో ఓవర్ రెండో బంతికి ఆమిర్ జమాల్ బౌలింగ్‌లో వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను సయీమ్ ఆయుబ్ మిస్ చేశాడు.
వార్నర్ బంతిని గాల్లోకి లేపగా ఫస్ట్‌స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆయుబ్.. బాల్‌ను రెండు చేతులతో ఒడిసిపట్టినట్టే పట్టి జారవిడిచేశాడు. దీంతో పక్కనే ఉన్న బాబర్ ఆజం తీవ్ర అసహనానికి గురయ్యాడు. సులువైన క్యాచ్ వదిలేయడంతో లైఫ్ పొందిన వార్నర్ మరోసారి ప్రమాదకారిగా మారుతాడేమోనన్న భయంతో తలపట్టుకుని కూర్చున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో వార్నర్ క్యాచ్ మిస్ చేసిన పాక్ అరంగేట్ర బ్యాటర్ సయీమ్ ఆయుబ్‌పై సొంత జట్టు అభిమానులే ఫైర్ అవుతున్నారు. బ్యాటర్‌గా విఫలమయ్యావు.. ఫీల్డింగ్ చేయడం కూడా రాదా అంటూ ట్రోల్ చేస్తున్నారు.
కాగా సిడ్నీ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆయుబ్.. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. ఆయుబ్ క్యాచ్ చేసే సమయానికి వార్నర్ 20 పరుగులతో ఆడుతున్నాడు. అయితే, 24.3వ ఓవర్ వద్ద ఆగా సల్మాన్ బౌలింగ్‌లో బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి వార్నర్(34) వెనుదిరిగాడు.
చదవండి: Ind Vs SA 2nd Test: రెండో టెస్టులో విజయం భారత్‌దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం
It's happened again! 😲
— cricket.com.au (@cricketcomau) January 4, 2024
David Warner gets a life courtesy of the debutant Saim Ayub #AUSvPAK pic.twitter.com/VAr7bBis6L
Comments
Please login to add a commentAdd a comment