Shoaib Akhtar Unhappy with Pakistan T20 World Cup squad: రానున్న టీ20 వరల్డ్ కప్‌నకు ఎంపిక చేసిన పాకిస్తాన్ జట్టు పట్ల ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మహ్మద్ వసీం చీఫ్ సెలక్టర్ కాదని, అతడొక తోలుబొమ్మ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టోర్నీ ఆరంభానికి ముందు కచ్చితంగా జట్టులో మార్పులు, చేర్పులు ఉంటాయని అభిప్రాయపడ్డాడు. అలా అయితేనే సత్ఫలితాలు ఉంటాయని పేర్కొన్నాడు. కాగా ఒమన్, యూఏఈ వేదికగా అక్టోబరు 17 నుంచి మెగా క్రికెట్ ఈవెంట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇప్పటికే పలు దేశాలు టీ20 ప్రపంచకప్ ఆడబోయే జట్లను ప్రకటించాయి. పాకిస్తాన్ సైతం ఈ వారం ఆరంభంలో 15 మందితో కూడిన జట్టును అనౌన్స్ చేసింది. బాబర్ అజమ్ కెప్టెన్ సారథ్యంలోని ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్, ఇద్దరు వికెట్ కీపర్స్, నలుగురు ఆల్‌రౌండర్స్, నలుగురు ఫాస్ట్ బౌలర్స్‌తో బరిలో దిగననున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం పట్ల పాక్ మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.
ముఖ్యంగా దేశవాళీ, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మెరుగ్గా రాణిస్తున్న ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాదీర్, షాహనవాజ్ దహానిలను రిజర్వ్ ఆటగాళ్లుగా ప్రకటించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అక్టోబరు 10 వరకు జట్లలో మార్పులు చేసుకునే అవకాశం ఉండటంతో.. జట్టు కూర్పుపై రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ పలు సూచనలు చేశాడు. అనుభవం ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సూచించాడు.
ఇందులో భాగంగా... ‘‘పాకిస్తాన్ టీ20 వరల్డ్‌కప్ జట్టులో బాబర్ ఆజం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్, ఇమాద్‌వసీం, షాబాద్ ఖాన్, షాహీన్ ఆఫ్రిది, హసన్ అలీ, షహనావాజ్ దహాని, ఫహీం అష్రఫ్, మహ్మద్ అమీర్, ఫఖర్ జమాన్, హుసేన్ తలత్ ఉండాలి’’ అని పేర్కొన్నాడు. అప్పుడే అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
బాబర్ సంతృప్తిగానే ఉన్నాడు: వసీం ఖాన్
ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన టీ20 జట్టు పట్ల కెప్టెన్ బాబర్ ఆజం అసంతృప్తిగా ఉన్నాడని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన పీసీబీ సీఈవో వసీం ఖాన్.. ఈ వార్తలను కొట్టిపడేశాడు. పీసీబీ నిర్ణయం పట్ల బాబర్‌కు ఎలాంటి ఆక్షేపణ లేదని, అతడు ఎంతో సంతోషంగా ఉన్నట్లు వెల్లడించాడు. జట్టు ఎంపిక సమయంలో అతడి సూచనలు, సలహాలు తీసుకున్నామని, ఈ విషయం పట్ల తను ఎంతో సంతోషంగా, సంతృప్తికరంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు.
చదవండి: T20 World Cup 2021: తొలిసారి మెగా ఈవెంట్‌కు నమీబియా.. జట్టు ఇదే!
Asif and Khushdil return for ICC Men's T20 World Cup 2021
— PCB Media (@TheRealPCBMedia) September 6, 2021
More details ➡️ https://t.co/vStLml8yKw#PAKvNZ | #PAKvENG | #T20WorldCup pic.twitter.com/9samGbJgDJ
Comments
Please login to add a commentAdd a comment