I told Babar Azam how to get Rohit Sharma out: టీ20 ప్రపంచ కప్ 2021లో పాకిస్తాన్ అద్భుతమైన పోరాట పటిమ కనబర్చింది. ఈ మెగా టోర్నీలో వరుస విజయాలతో సెమిస్‌కు దూసుకొచ్చిన పాకిస్తాన్.. సెమిఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో అనుహ్యంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓటమి చెంది ఘోర పరభవాన్ని మూట కట్టుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది అద్బుతమైన స్పెల్‌తో భారత్‌ను దెబ్బతీశాడు.
కాగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను అద్భుతమైన డెలివరీతో ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. అయితే రోహిత్ శర్మ ఔట్ పై బీబీసీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ రమీజ్ రాజా ప్రస్తుతం స్పందించాడు. రోహిత్ శర్మ వికెట్ పొందడానికి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌కి విలువైన సూచనలు చేసినట్లు అతడు తెలిపాడు.
“ప్రపంచ కప్ కోసం యూఏఈ బయలుదేరే ముందు బాబర్ ఆజం, చీఫ్ సెలెక్టర్‌తో వచ్చి నన్ను కలిశారు. టీమిండియాకు వ్యతిరేకంగా మీ ప్రణాళికలు ఏమిటి అని అడిగాను. దానికి బదులుగా మేము వాళ్ల ఆట తీరుపై విశ్లేషణ చేసుకున్నాము, పక్క ప్రణాళికలో మేము వెళ్లుతున్నాము అని బాబర్ సమాధానం చెప్పాడు. కానీ భారత్ కూడా మనల్ని ఓడించడానికి పక్క ప్రణాళికలు రచిస్తోందని నేను హెచ్చరించాను" అని రమీజ్ రాజా తెలిపాడు.
“రోహిత్ శర్మను ఎలా ఔట్ చేయాలో అప్పుడే బాబర్‌కు నేను చెప్పాను. షాహీన్ అఫ్రిదిని షార్ట్ లెగ్‌లో ఒక ఫీల్డర్‌ను పెట్టి బౌలింగ్ చేయమని అని నేను చెప్పాను. కేవలం స్లో మీడియంలో ఇన్‌స్వింగింగ్ యార్కర్‌ని బౌల్ చేయమన్నాను. ఆ ఓవర్‌లో అతడికి ఒక్క సింగిల్ కూడా ఇవ్వవద్దు. అతడిని ఓవర్ మొత్తం స్ట్రైక్‌లోనే ఉంచితే, మీరు రోహిత్‌ను సులభంగా ఔట్ చేయవచ్చు" అని చెప్పినట్లు అతడు పేర్కొన్నాడు.
చదవండి: IND Vs NZ: ఔటైన కోపంలో కోహ్లి ఏం చేశాడంటే.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment