అంతర్జాతీయ వన్డేల్లో ఆస్ట్రేలియా మళ్లీ నెంబర్ వన్‌గా జట్టుగా అవతరించింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్ధానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికాతో 5 టీ20 సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో విజయం సాధించిన ఆసీస్.. పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది.
వన్డే ర్యాంకింగ్స్‌లో 121 రేటింగ్‌తో ఆసీస్ ఆగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. పాకిస్తాన్ 120 రేటింగ్‌తో రెండో స్ధానంలో ఉంది. ఇక భారత జట్టు 114 రేటింగ్‌తో మూడో ర్యాంక్‌లో ఉంది. కాగా ఆసియాకప్ సూపర్-4లో భాగంగా భారత్-పాక్ మధ్య మ్యాచ్ ఆదివారం జరగనుండడంతో మళ్లీ ర్యాంక్‌లు తారుమారు అయ్యే ఛాన్స్ ఉంది.
వార్నర్, లబుషేన్ సెంచరీలు
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై 123 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 392 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. డేవిడ్ వార్నర్(106), లబుషేన్(124) సెంచరీలతో చెలరేగగా.. హెడ్(64), జోష్ ఇంగ్లీష్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ షమ్సీ నాలుగు వికెట్లు సాధించగా.. రబాడ రెండు, మార్కో జానెసన్ వికెట్ పడగొట్టారు. 393 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 41.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లతో చెలరేగాడు.
చదవండి: కోహ్లితో ఎక్కువ మాట్లాడకండి.. అతడిని ఎలా అయినా ఔట్ చేయాలి: అక్తర్
Comments
Please login to add a commentAdd a comment