![Ravi Shastri Says THIS Team Will Be Dangerous In Champions Trophy](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/pak2.jpg.webp?itok=6f75Sc65)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కరాచీ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మినీ వరల్డ్‌కప్ కోసం ఆయా జట్లు అన్ని విధాల సన్నదమవుతున్నాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు.
భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు గ్రూపు-ఎలో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్, సౌతాఫ్రికా గ్రూపు-బిలో ఉన్నాయి. భారత జట్టు విషయానికి వస్తే తమ తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్ మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఆ తర్వాత క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్-పాక్ చిరకాల ప్రత్యర్ధుల పోరు ఫిబ్రవరి 23న జరగనుంది.
ఆ జట్టుతో జాగ్రత్త..
ఇక ఈ మెగా టోర్నీకి ముందు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖలు చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్‌ను తక్కువగా అంచనా వేయెద్దని ఈ టోర్నీలో పాల్గోనే జట్లకు రవిశాస్త్రి హెచ్చరించాడు. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే , ఆస్ట్రేలియాపై వరుసగా మూడు వన్డే సిరీస్‌లను గెలుచుకున్న పాకిస్తాన్.. ఛాంపియన్స్ ట్రొఫీలో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ముఖ్యంగా సొంతగడ్డపై పాకిస్తాన్‌కు అద్బుతమైన రికార్డు ఉంది. షాహీన్ షా అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీం షా వంటి పేస్ త్రయం పాక్ జట్టులో ఉంది.
గత కొన్ని నెలల నుంచి వైట్ బాల్ క్రికెట్‌లో పాకిస్తాన్ దుమ్ములేపుతోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాక్ ప్లేయర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. సౌతాఫ్రికా వంటి పరిస్థితుల్లో రాణించడం అంత సులువు కాదు. అయితే దురదృష్టవశాత్తు యువ ఓపెనర్ సైమ్ అయూబ్ సేవలను పాక్ కోల్పోయింది.
అతడు అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో అతడు కీలకంగా మారుతాడని పాక్ ఆశలు పెట్టుకుంది. కానీ అయూబ్ గాయం కారణంగా ఈ ఈవెంట్ నుంచి తప్పుకున్నాడు. అయితే అయూబ్ లేనంతమాత్రన పాక్‌ను తేలికగా తీసుకోవద్దు. లోతైన బ్యాటింగ్ లైనప్ వారికి ఉంది. సాధరణంగా ఏ జట్టు అయినా వారి సొంతగడ్డపై డేంజరస్‌గా ఉంటుంది. పాకిస్తాన్ కనుక సెమీస్ చేరుకుంటే, ఆ జట్టు డబుల్ డేంజరస్‌గా మారుతుంది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రర్ షాహమ్, హరీస్ నహ్మద్, హరీస్ నహ్మద్, హరీస్ షాహమ్ రౌఫ్ అఫ్రిది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్
చదవండి: SA vs NZ: సౌతాఫ్రికాతో మ్యాచ్.. కేన్ మామ సూపర్ సెంచరీ! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment