ravi sasthri
-
IND Vs AUS: 'కింగ్ తన రాజ్యానికి తిరిగొచ్చాడు'.. ఆసీస్‌ను హెచ్చరించిన రవిశాస్త్రి
టెస్టు క్రికెట్లో గత ఏడాదిగా పేలవ ఫామ్‌ను కనబరుస్తున్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఇప్పుడు మరో కఠిన సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్దమయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు కోహ్లి తీవ్రంగా నెట్స్‌లో శ్రమిస్తున్నాడు.స్వదేశంలో బంగ్లాదేశ్,న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నిరాశపరిచిన విరాట్ తనకు ఇష్టమైన ఆసీస్‌పై సత్తాచాటాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లి తన ఫామ్‌ను తిరిగి పొందుతాడని రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు."రాజు(కింగ్) తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఇదొక్కటే ఆస్ట్రేలియాకు నేను చెప్పేది. ఆస్ట్రేలియాలో అద్బుత ప్రదర్శనల తర్వాతే అతడు కింగ్‌గా మారాడు. అది మీకు కూడా తెలుసు. విరాట్ క్రీజులో ఉంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. కోహ్లికి కూడా నేను ఓ సలహా ఇవ్వాలనకుంటున్నాను.క్రీజులో వచ్చినవెంటనే తొందరపడవద్దు. హడావిడిగా ఆడి వికెట్‌ను కోల్పోవద్దు. బ్యాటింగ్‌కు దిగిన మొదటి అరగంటలో ప్రశాంతంగా ఆడి సింగిల్స్‌పై దృష్టి సారించాలి. ఎటువంటి రిస్క్ షాట్లు ఆడకుండా, కూల్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తే విరాట్ కచ్చితంగా తన రిథమ్‌ను తిరిగి పొందుతాడు" అని ఐసీసీ రివ్యూ మీటింగ్‌లో శాస్త్రి పేర్కొన్నాడు.ఆసీస్ గడ్డపై అదుర్స్...కాగా కోహ్లికి ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతమైన రికార్డు ఉంది. విరాట్ 2011-12లో తన తొలి ఆసీస్ టెస్టు పర్యటనలో సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత 2014-15 ఆస్ట్రేలియా టూర్లో కూడా విరాట్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఏకంగా నాలుగు సెంచరీలతో 692 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఆసీస్ గడ్డపై 13 టెస్టులు ఆడిన విరాట్ 50పైగా సగటుతో 1352 పరుగులు చేశాడు. ఆసీస్‌లో అతడికి 6 టెస్టు సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా అతడి కెప్టెన్సీలోనే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది. -
టీ20 వరల్డ్‌కప్-2024కు కామెంటేటర్లు వీరే.. డీకేకు చోటు
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024కు మరో వారం రోజుల్లో తెరలేవనుంది. జాన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కామెంటేటర్ల (వ్యాఖ్యాతలు) జాబితాను శుక్రవారం ప్రకటించింది. 41 మంది సభ్యులున్న ఈ కామెంట్రీ ప్యానెల్లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ దేశాలకు చెందిన దిగ్గజాలు ఉన్నారు. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి , లెజెండరీ సునీల్ గవాస్కర్, దినేష్ కార్తీక్, ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్, వసీం అక్రమ్ వంటి వారు ఈ ప్యానల్లో ఉన్నారు.కాగా దినేష్ కార్తీక్ ఇటీవలే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కామెంటేటర్‌గా వ్యవహరించడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో వన్డే వరల్డ్‌కప్-2023, యాషెస్ సిరీస్‌లో వ్యాఖ్యతగా వ్యవహరించాడు. మరోవైపు టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఆశించి భంగపడ్డ ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్‌కు ఈ వ్యాఖ్యాతల జాబితాలో చోటుదక్కింది.టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కామెంటరీ ప్యానెల్: రికీ పాంటింగ్, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్, రమీజ్ రాజా, ఇయాన్ మోర్గాన్, టామ్ మూడీ, జాంబోయ్, రవిశాస్త్రి, ఇయాన్ బిషప్, నాజర్ హుస్సేన్, హర్ష భోగ్లే, డేల్ స్టెయిన్, గ్రేమ్ స్మిత్, మైఖేల్ అథర్టన్, వకార్ యూనిస్, సైమన్ డౌల్, షాన్ పొలాక్, కేటీ మార్టిన్, దినేష్ కార్తీక్, మెల్ జోన్స్,ఎబోనీ రెయిన్‌ఫోర్డ్-బ్రెంట్, లిసా స్థలేకర్, శామ్యూల్ బద్రీ, మ్పుమెలెలో మ్బాంగ్వా, ఇయాన్ స్మిత్, నటాలీ జర్మనోస్, కార్లోస్ బ్రాత్‌వైట్, డానీ మోరిన్సెల్, అలీసన్ విల్కిన్‌సెల్, అలీసన్ విల్కిన్‌సెల్, ఫించ్, బ్రియాన్ ముర్గాట్రాయిడ్, మైక్ హేస్మాన్, ఇయాన్ వార్డ్, స్టీవ్ స్మిత్, అథర్ అలీ ఖాన్, రస్సెల్ ఆర్నాల్డ్, నియాల్ ఓబ్రియన్, కాస్ నైడూ, డారెన్ గంగా , వసీం అక్రమ్ -
'ఆ రూలే ఐపీఎల్‌ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఈ రూల్‌ను సమర్ధిస్తుంటే.. మరి కొంతమంది తప్పుబడుతున్నారు. తాజాగా ఈ రూల్‌పై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాలను పంచుకున్నాడు.ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు రవిశాస్త్రి మద్దతుగా నిలిచాడు. ఈ రూల్ కారణంగానే మ్యాచ్‌లు ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయని రవిశాస్త్రి తెలిపాడు. "నా వరకు అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ చాలా బాగుంది. కాలంతో పాటు ఆటలో కూడా మార్పులు ఉండాలి. ఇతర క్రీడలలో క్రమంగా మార్పులు జరుగుతున్నాయి. ఈ రూల్ వల్ల మ్యాచ్‌లు చాలా క్లోజ్‌గా జరుగుతున్నాయి. గత సీజన్లో కూడా చాలా మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఇంపాక్ట్ రూల్ ఐపీఎల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకు వచ్చింది.ఎప్పుడైనా కొత్త రూల్స్ వస్తే, ఆ రూల్స్‌ను వ్యతిరేకించే వ్యక్తులు కూడా ఉంటారు. కానీ 200, 190 స్కోర్లను కూడా ఛేజ్ చేస్తున్న వైనం చూసి.. వ్యతిరేకించిన వారే ఇంపాక్ట్ రూల్‌పై పునరాలోచిన పునరాలోచిస్తున్నారని" అశ్విన్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు. -
'టైమ్ వేస్ట్'.. భారత్-సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌పై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా విజయంతో ముగించింది. కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత జట్టు విజయ భేరి ముగించింది. దీంతో సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌ను కేవలం ఐదు సెషన్లలోనే టీమిండియా ముగించింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా ముగిసిన టెస్టుగా ఈ మ్యాచ్ నిలిచింది. అయితే సిరీస్ డ్రాగా ముగియడంపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను నిర్వహించడం సమయం వృధా అని రవిశాస్త్రి తెలిపాడు. అదనంగా మరో టెస్టును ఆడించి వుంటే సిరీస్ ఫలితం తేలి ఉండేదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాగా రవిశాస్త్రి వ్యాఖ్యలతో చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం ఏకీభవిస్తున్నారు. కాగా అంతకుముందు దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశాడు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ కేవలం రెండు మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కావడం సిగ్గు చేటు అని ఏబీడీ విమర్శించాడు. గొప్ప చరిత్ర ఉన్న దక్షిణాఫ్రికా- భారత్ సిరీస్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే పెట్టడం నిజంగా అవమానకరం అంటూ డివిలియర్స్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిన భారత్ జట్టు టీ20, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకోగా.. టెస్టు సిరీస్‌ను డ్రాగా ముగించింది. -
అంతటి సచిన్‌కే తప్పలేదు.. టీ20 వరల్డ్‌కప్ టీమిండియాదే: రవిశాస్త్రి
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో భారత్ ఓటమిని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడుతుందని ఎవరూ ఊహించివుండరు. అయితే మెగా టోర్నీలో ఓటమి తర్వాత అదే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. అభిమానుల్లో కాస్త జోష్‌ను నింపింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యువ భారత జట్టును తొలి రెండు టీ20ల్లోనూ ఆసీస్‌ను చిత్తు చేసింది. వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ సన్నహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికాతో కూడా భారత్ టీ20ల్లో పాల్గోనుంది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20లో ప్రపంచకప్‌లో టీమిండియా టైటిల్ ఫేవరేట్ అని రవిశాస్త్రి తెలిపాడు. టీ20 వరల్డ్‌కప్-2024 అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జూన్‌లో జరగనుంది. "ఏదీ కూడా సులభంగా రాదు. సచిన్ టెండూల్కర్ వంటి లెజెండ్ ఒక ప్రపంచకప్‌ను గెలవడానికి ఆరు వరల్డ్‌కప్‌ల వరకు వేచి చూశాడు. వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఫైనల్ రోజు మనం ఎలా ప్రదర్శన చేశామన్నదే పరిగణలోకి వస్తుంది. ఇటువంటి మెగా టోర్నీల్లో సెమీఫైనల్-ఫైనల్లో మంచి ప్రదర్శన చేస్తేనే వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలుస్తారు. లీగ్ స్టేజిలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఆసీస్.. సెమీస్, ఫైనల్లో అద్భుతంగా రాణించింది కాబట్టి విజేతగా నిలిచింది. భారత్ ఓటమి నన్ను ఇప్పటికి బాధిస్తోంది. కానీ మా బాయ్స్ ఈ ఓటమి నుంచి మా బాయ్స్ చాలా విషయాలు నేర్చుకున్నారు. వారు సానుకూల దృక్పథంతో తమ ఆటను కొనసాగిస్తున్నారు. భారత్ త్వరలోనే ప్రపంచకప్ గెలుస్తుందని నేను ఆశిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్-2024ను టీమిండియా సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టీమిండియా ప్రస్తుతం కసితో ఉంది. ప్రధాన పోటీ దారుగా భారత్ బరిలోకి దిగనుంది. ప్రస్తుతం భారత జట్టు టీ20 ఫార్మాట్‌పైనే దృష్టిపెట్టాలి’’ అని ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లాంఛ్ ఈవెంట్లో రవిశాస్త్రి పేర్కొన్నాడు. చదవండి: Virat Kohli: తమ్ముడంటే ప్రేమ! మనుషులు దూరంగా ఉన్నా.. కోహ్లి తోబుట్టువు భావనా గురించి తెలుసా? -
పాక్‌తో జాగ్రత్త.. ఒకప్పటిలా లేదు! కొంచెం తేడా జరిగినా చాలు: రవిశాస్త్రి
ఆసియాకప్-2023లో దాయాదుల సమరానికి రంగం సిద్దమైంది. మరి కొన్ని గంటల్లో భారత్-పాకిస్తాన్ మధ్య బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్‌కు తెరలేవనుంది. ఈ చిరకాల ప్రత్యర్ధుల పోరుకు శ్రీలంకలోని పల్లెకెలె మైదానం వేదికైంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధిస్తుందని రవిశాస్త్రి థీమా వ్యక్తం చేశాడు. టీమిండియానే ఫేవరేట్ ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో నావరకు అయితే టీమిండియానే ఫేవరేట్. ప్రస్తుత భారత జట్టు 2011 ప్రపంచకప్‌ను గెలిచిన టీమ్ కంటే బలంగా ఉంది. జట్టులో చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అదేవిధంగా రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞుడైన కెప్టెన్ ఉన్నాడు. రోహిత్ శర్మకు భారత ఉపఖండ పిచ్‌లపై అద్భుతమైన రికార్డు ఉంది. అయితే పాకిస్తాన్‌ను మాత్రం తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే వారు తమ గతంలో కంటే అద్భుతంగా ఆడుతున్నారు. ప్రస్తుత జట్టు కూడా చాలా బాగుంది. ఏడు-ఎనిమిదేళ్ల క్రితం భారత్-పాక్ జట్ల మధ్య చాలా గ్యాప్ ఉండేది. కానీ దాన్ని వారు నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తున్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం నెం1 జట్టుగా ఉంది. కాబట్టి బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ భారత్ అద్భుతంగా రాణించాలి. పాకిస్తాన్- భారత్ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్ల ఫామ్‌ను ఎప్పుడూ లెక్కించకూడదు. ఎవరు ఒత్తిడిని తట్టుకుని రాణిస్తారో వారే విజయం సాధిస్తారు. వరుసగా సెంచరీలు సాధించి పాకిస్తాన్‌పై ఆటగాళ్లు విఫలమైన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఆడగల్గితే పాక్‌ను కచ్చితంగా ఓడించవచ్చు అని ఈస్పీఎన్తో రవిశాస్త్రి పేర్కొన్నాడు. భారత్‌దే పై చేయి కాగా భారత్, పాక్‌లు తలపడిన గత ఐదు వన్డేల్లో టీమిండియాదే 4–1తో పైచేయిగా ఉంది. 2017 చాంపియన్స్‌ట్రోఫీలో లీగ్ దశలో గెలిచి తుదిపోరులో భారత్ ఓడింది. 2018 ఆసియాకప్‌లో రెండుసార్లు టీమిండియా గెలిచింది. చివరిసారిగా గత వన్డే ప్రపంచకప్(2019)లోనూ భారత్‌దే గెలుపు. చదవండి: నేడే ‘ఆసియా’ అసలు సమరం -
రోహిత్ వద్దు.. ప్రపంచకప్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హజరీలో పాండ్యానే టీమిండియాకు సారధ్యం వహిస్తున్నాడు. టీ20ల్లో అయితే గత కొన్ని సిరీస్‌ల నుంచి నాయకత్వం వహిస్తున్న హార్దిక్.. జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. ఐపీఎల్లో కూడా కెప్టెన్‌గా హార్దిక్ విజయవంతమయ్యాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత వైట్‌బాల్ క్రికెట్లో రోహిత్ శర్మను తప్పించి టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా హార్దిక్‌ను నియమించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. రోహిత్‌ను కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు భారత క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా రోహిత్ భారత జట్టు పగ్గాలు చేపట్టాక...వరుసగా ఆసియాకప్, టీ20 ప్రపంచకప్-2022, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఘోర ఓటములను చవిచూసింది. ఈ క్రమంలో రోహిత్‌ను తప్పించి మరోక ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని చాలా మంది మాజీలు బీసీసీఐకి సూచిస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై భారత దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రి తన అభిప్రాయాలను వెల్లడించాడు. "వన్డే ప్రపంచకప్ తర్వాత వైట్-బాల్ క్రికెట్లో టీమిండియా కెప్టెన్సీని హార్దిక్ పాండ్యా చేపట్టాలని నేను భావిస్తున్నాను. ప్రపంచకప్‌లో మాత్రం భారత్ జట్టుకు రోహిత్ శర్మనే నాయకత్వం వహించాలి. రోహిత్ కూడా అద్భుతమైన లీడర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించడం అంత సులభం కాదు. ఒత్తడి ఎక్కువగా ఉంటుంది. అది అతడి వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపిస్తోంది" అని ది వీక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: భారత జట్టులో నో ఛాన్స్.. సెలక్టర్లకు కౌంటర్ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ -
ఇండియాకి ఒక్క సెషన్ చాలు రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు
-
వాళ్లకు ఎందుకు విశ్రాంతి ఇచ్చారు.. జట్టుతో ఉండాలి కదా?
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. వీళ్లతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో కివీస్‌తో సిరీస్‌కు ద్రవిడ్‌కు విశ్రాంతిని కల్పించడాన్ని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తప్పుబట్టాడు. కాగా భారత్ కోచ్‌గా రవిశాస్త్రి ఉన్న సమయంలో అతడు ఎప్పడూ జట్టుకు దూరం కాలేదు. కానీ ద్రవిడ్ విషయంలో మాత్రం అది కనిపించడం లేదు. అతడి స్థానంలో ఎదోక ఒక సిరీస్‌కు వివియస్ లక్ష్మణ్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టడం అనవాయితీగా మారిపోయింది. గురువారం జరిగిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రవిశాస్త్రి మాట్లాడుతూ.. "బ్రేక్స్‌పై పెద్దగా నాకు నమ్మకం ఉండదు. ఎందకుంటే జట్టును విజయ పథంలో నడిపించాలంటే ఆటాగాళ్లతో ఎక్కువసమయం గడపాలి. అప్పడే జట్టుపై మనకు పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది. నిజం చెప్పాలంటే కోచ్‌లకు ఇన్ని బ్రేక్స్ అవసరమా? ఐపీఎల్ సమయంలో 2-3 నెలలు దొరుకుతుంది. అది చాలు. మిగతా సమయాల్లో కోచ్ ఎప్పుడూ అందుబాటులోనే ఉండాలి" అని అతడు పేర్కొన్నాడు. ఇక నవంబర్ 18న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. చదవండి: Suryakumar Yadav: పచ్చబొట్టేసినా పిల్లదానా!.. నువ్వు లేకుంటే ఏమైపోయేవాడినో! -
లార్డ్స్‌లో కలిసి మ్యాచ్ చూసిన రవిశాస్త్రి, సుందర్ పిచాయ్, ముఖేష్ అంబానీ ..!
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ టోర్నీ ది హండ్రెడ్ లీగ్‌లో కామెంటేటర్ వ్యవహారిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం లార్డ్స్ వేదికగా లండన్ స్పిరిట్, మాంచెస్టర్ ఒరిజినల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో కలిసి రవిశాస్త్రి వీక్షించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను రవిశాస్త్రి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. "క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడే ముఖేష్ అంబానీ, సుందర్ పిచాయ్‌తో క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్‌లో మ్యాచ్ చూడడం చాలా సంతోషంగా ఉంది" అంటూ ఈ పోస్ట్‌కు రవిశాస్త్రి క్యాప్షన్‌గా పెట్టాడు. కాగా వ్యక్తిగత కారణాలతో ముఖేష్ అంబానీ, సుందర్ పిచాయ్ ఇంగ్లండ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే లండన్ స్పిరిట్ ది హండ్రెడ్ 2022లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మాంచెస్టర్‌పై 52 పరగుల తేడాతో లండన్ స్పిరిట్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ నిర్ణీత 100బంతుల్లో 6వికెట్లు కోల్పోయి 160పరుగులు చేసింది. లండన్ బ్యాటర్లలో జాక్ క్రాలే(41), మోర్గాన్(37) కిరాన్ పొలార్ట్( 34) పరుగులతో రాణించారు. అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ ఒరిజినల్స్ 108 పరుగులకే కుప్పకూలింది. మాంచెస్టర్ బ్యాటర్లలో సాల్ట్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లండన్ బౌలర్లలో జోర్డాన్ థాంప్సన్ నాలుగు వికెట్లతో చేలరేగగా.. మాసన్ క్రేన్,లియామ్ డాసన్ తలా రెండు వికెట్లు సాధించారు. In the august company of two people who love their cricket @HomeOfCricket - Mr Mukesh Ambani and Mr @sundarpichai at @thehundred @SkyCricket pic.twitter.com/JYnkGlMd8W — Ravi Shastri (@RaviShastriOfc) August 9, 2022 చదవండి: CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో ఓటమి.. ఇంగ్లండ్ హెడ్ కోచ్ సంచలన నిర్ణయం! -
'హార్ధిక్ పాండ్యా ఇద్దరి ఆటగాళ్లతో సమానం.. అయితే వన్డేల్లో మాత్రం ఆడకూడదు'
అరంగేట్రంలోనే జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తకిర వాఖ్యలు చేశాడు. ఈ ఏడాది సీజన్లో హార్ధిక్ కెప్టెన్‌గానే కాకుండా ఆల్‌రౌండర్‌గా అద్భుతంగా రాణించాడు. 15 మ్యాచ్‌లు ఆడిన అతడు 487 పరుగులతో పాటు 8 వికెట్లు కూడా పడగొట్టాడు. అయితే గత కొద్ది కాలంగా పేలవ ఫామ్‌తో భారత జట్టుకు దూరంగా ఉన్న హార్ధిక్.. ఐపీఎల్లో అదరగొట్టి తిరిగి జట్టులోకి వచ్చాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి హార్ధిక్ పాండ్యా ఎంపికయ్యాడు. "హార్ధిక్‌కు జట్టులో బ్యాటర్‌గా లేదా ఆల్‌రౌండర్‌గా చోటు దక్కింది. అయితే అతడు గాయం నుంచి కోలుకున్నప్పటికీ కేవలం 2 ఓవర్లు బౌలింగ్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. అయితే గాయం కారణంగా జట్టుకు దూరమైన తర్వాత హార్ధిక్‌కు మంచి విశ్రాంతి లభించింది. ఇకపై కూడా అతడికి చాలా విశ్రాంతి అవసరం. హార్ధిక్‌ను టీ20 ప్రపంచకప్ వరకు వన్డేల్లో ఆడించే ప్రయత్నం చేయకూడదు. అతడు టీ20 ప్రపంచకప్‌కు ఫిట్‌గా ఉండడం భారత్‌కు చాలా ముఖ్యం. ఫిట్‌గా ఉంటే హార్ధిక్ పాండ్యా ఒక్కడూ ఇద్దరి ఆటగాళ్లతో సమానం. పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్లో ఏ పొజిషన్లో అయినా అద్భుతంగా ఆడగలడు" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. చదవండి: Hardik Pandya - Kiran More: 'ఆ ఆటగాడు ఇకపై ఫోర్-డి ప్లేయర్'.. టీమిండియా మాజీ క్రికెటర్ -
"అతడు యార్కర్ల కింగ్.. ప్రపంచకప్‌లో అతడి సేవలను కోల్పోయాం"
టీమిండియా ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్‌పై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నటరాజన్ అద్భుతంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్-2021లో నటరాజన్ సేవలను భారత్ కచ్చితంగా కోల్పోయింది అని రవిశాస్త్రి తెలిపాడు. గత ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నటరాజన్ మోకాలికి గాయమైంది. దీంతో టీ20 ప్రపంచకప్‌కు నటరాజన్ దూరమయ్యాడు. అయితే అతడు ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించి ఐపీఎల్లో అడుగుపెట్టాడు. "టీ20 ప్రపంచకప్‌లో నటరాజన్ సేవలను కోల్పోయాం. అతడు ఫిట్‌గా ఉంటే ఖచ్చితంగా జట్టులో ఉండేవాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో నటరాజన్ గాయపడ్డాడు. అతడు స్పెషలిస్ట్ డెత్ బౌలర్, యార్కర్లను అద్భుతంగా వేయగలడు. అతడు తన పేస్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్ప తిప్పలు పెడతాడు. నేను అతడిని ఎంపిక చేసిన ప్రతి మ్యాచ్‌లోను భారత్ విజయం సాధించింది. అతడి అరంగేట్ర టీ20 మ్యాచ్‌లోను భారత్ విజయం సాధించింది. అదే విధంగా అతడి టెస్టు అరంగేట్రంలోను టీమిండియా గెలిపొందింది. నటరాజన్ నెట్ బౌలర్ నుంచి ఈ స్థాయికి ఎదగడం నిజంగా గర్వించ దగ్గ విషయం" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: దేవుడి దయ వల్ల అమ్మ ఇప్పుడు బాగుంది.. ఈ అవార్డు తనకే! -
'హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయాలి.. లేదంటే ఇక కష్టమే'
టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలతో గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత ఏ విధమైన క్రికెట్ ఆడలేదు. అయితే అతడు బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయడానికి ఫిట్‌గా ఉన్నప్పటికీ.. బౌలింగ్ ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఇక ఐపీఎల్ కొత్త జట్టుగా అవతరించిన గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా హార్ధిక్ ఎంపికయ్యాడు.కాగా ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ భారత జట్టులో హార్ధిక్ పాండ్యాకు చోటు దక్కుతుందని కొంత మంది మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్రి కీలక వాఖ్యలు చేశాడు. భారత జట్టులో ఆరో స్ధానానికి ఫుల్ టైమ్ ఆల్-రౌండర్ అవసరమని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ జట్టులో కేవలం బ్యాటర్‌గా హార్ధిక్‌కు చోటు దక్కే అవకాశం లేదు అని అతడు తెలిపాడు. "టీమిండియాలో 6వ స్థానంలో కచ్చితంగా ఒక ఆల్ రౌండర్ ఉండాలి. టాప్ ఫైవ్‌లో ఎవరైనా రెండు లేదా మూడు ఓవర్లు వేసేలా ఉండాలి. దీంతో కెప్టెన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. ఆ స్ధానంలో సరైన ఆల్‌రౌండర్ భారత్‌కు లేడు. కాబట్టి భారత జట్టులో ఫాస్ట్ బౌలింగ్, అద్భుతమైన ఫీల్డింగ్ చేసే ఆల్‌రౌండర్ కావాలి. ఇక బ్యాటింగ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత జట్టు అద్భుతమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉంది. ఇక టీమిండియాలో మొదటి ఐదు స్థానాల్లో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి హార్ధిక్ పాండ్యా బ్యాటర్‌గా అవకాశం దొరకడం చాలా కష్టం. అయితే అతడు కనీసం రెండు లేదా మూడు ఓవర్లు బౌలింగ్ చేయగలిగతే తిరిగి జట్టులో చోటు దక్కించకుకోవచ్చు" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం! -
ఐపీఎల్లో అహ్మదాబాద్ హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి!
Ravi Shastri as head coach for Ahmedabad team: టీ20 ప్రపంచకప్-2021 తర్వాత భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి తన బాధ్యతల నుంచి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. తనతో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కూడా తప్పుకోనున్నారు. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను బీసీసీఐ నియమించింది. అయితే వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్లో కొత్త జట్టుగా అవతరించిన అహ్మదాబాద్.. తమ జట్టు హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని నియమించుకోవాలి అని భావిస్తోంది. ఇప్పటికే రవిశాస్త్రిని ఈ విషయంపై సంప్రదించునట్లు సమాచారం. అతడు నిర్ణయం తీసుకోవడానికి కాస్త సమయం కోరినట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ ఐపీఎల్లో కొత్త జట్టులకు నిర్వహించిన వేలంలో అహ్మదాబాద్ ఫ్రాంచైజీను సీవిసీ క్యాపిటల్ 5600 కోట్లకు కైవసం చేసుకుంది. ఆదేవిధంగా లక్నో ఫ్రాంచైజీని సంజీవ్ గోయెంకా గ్రూప్ 7090 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు ఆటగాళ్ల మెగా వేలం డిసెంబర్ లో బీసీసీఐ నిర్వహించనుంది. చదవండి: T20 WC 2021 AUS Vs WI: చెలరేగిన వార్నర్, మార్ష్.. విండీస్‌పై ఆసీస్ ఘన విజయం -
టీమిండియాకు బిగ్ షాక్.. కీలక సభ్యుడికి కరోనా పాజిటివ్
-
ఓపెనింగ్‌పై తర్జనభర్జన.. ఎవరో? ఏమిటో?
పట్టుమని పది ఓవర్లయినా నిలవలేని ఓపెనర్లు... పూర్తి ఫిట్నెస్ కొరవడిన ప్రధాన స్పిన్నర్లు... ఆడించాలా? వద్దా? అనే స్థితిలో ఆల్‌రౌండర్! వెరసి... ‘బాక్సింగ్ డే’ టెస్టుకు ముందు టీమిండియాలో పెద్ద డైలమా? ఎలాంటి సమస్యలు లేకుండా ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన కోహ్లి సేనను... ఇప్పుడు ప్రత్యర్థి కంటే గాయాలు, ఫామ్ లేమి ఎక్కువగా భయపెడుతున్నాయి. మరి... సిరీస్ కీలక దశలో మెల్బోర్న్లో టీమిండియా ఏం చేస్తుంది? చిక్కుముడులను ఎలా విప్పుతుంది? సాక్షి క్రీడా విభాగం: తుది జట్టు ఖరారులో బహుశా గతంలో ఎన్నడూ ఎదుర్కొననంత సందిగ్ధంలో ఉందిప్పుడు టీమిండియా. స్వదేశంలో అయినా, విదేశంలో అయినా సహజంగా ఒకటీ, రెండు స్థానాలపైనే ఊగిసలాట ఉంటుంది. కానీ, కోహ్లి సేన మూడో టెస్టుకు నాలుగు స్థానాలపై ఆందోళన చెందుతోంది. 11 మందికిగాను ఫామ్, ఫిట్నెస్ ప్రకారం నికరంగా ఏడుగురు ఆటగాళ్లే అందుబాటులో ఉన్నట్లయింది పరిస్థితి. ఎటొచ్చి... మెల్బోర్న్లో ‘మార్పు’ తప్పనిసరి! కానీ, అదెలాగన్నదే తేలాల్సి ఉంది. ఓపెనర్లు ఎవరో? 49, 48... విజయ్, రాహుల్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి చేసిన స్కోర్లివి. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోని 44 పరు గులు మినహాయిస్తే రాహుల్ చేసినవి నాలుగే పరుగులు. యువ సంచలనం పృథ్వీ షా గాయంతో పూర్తిగా దూరం కాగా, వీరిలో ఎవరినీ నమ్మలేని స్థితిలో ఉన్నపళంగా కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌ను రప్పించారు. విజయ్ కొంత ఎక్కువసేపు క్రీజులో ఉంటున్నా ప్రతి పరుగుకు శ్రమిస్తున్నాడు. ఆడినప్పుడే ఆడినట్లుంటోంది రాహుల్ కథ. పోతే పోనీ ఈ ఒక్కసారికి కొనసాగిద్దామనుకుంటారా? లేక మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలతో ఇన్నింగ్స్ ప్రారంభించి భారీ ప్రయోగం చేస్తారా? అనేది చూడాలి? జడ్డూ సంగతేంటో? ఎడమ భుజం గాయంతో ఇబ్బందిపడుతున్న స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉన్నాడని ప్రకటనలైతే వస్తున్నాయి. అయితే, అది కోచ్ రవిశాస్త్రి లెక్కల్లోలాగ 70–80 శాతమా? బీసీసీఐ చెప్పినట్లు 100 శాతమా? అనేది స్పష్టం కావాల్సి ఉంది. కోచ్ మాట ప్రకారం 80 శాతం ఫిట్నెస్తో ఉన్నా ఆడిస్తారా? అశ్విన్ దూరమై, గత్యంతరం లేకపోతే జడేజాను దించినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. అశ్విన్ ‘ఫిట్టు’ కానట్టే? ఇంగ్లండ్‌లో గాయంతోనే సౌతాం ప్టన్ టెస్టులో ఆడి, వైఫల్యం మూటగట్టుకుని ఆపై చివరి టెస్టుకు దూరమైన అశ్విన్... పాత కథనే పునరావృతం చేసేలా ఉన్నాడు. అశ్విన్ పరిస్థితిని రెండ్రోజుల్లో చెబుతామని కోచ్ రవిశాస్త్రి ఆదివారం వ్యాఖ్యానించడం దీనినే సూచిస్తోంది. సోమవారం నెట్స్‌లోనూ అతడు రనప్ లేకుండానే బౌలింగ్ చేశాడు. బుధవారం నాటికైనా ఫిట్నెస్ సంతరించుకుంటే జట్టుకది శుభవార్త లాంటిదే. హార్దిక్‌ను పిలిపించారు...కానీ! ఆసియా కప్‌లో గాయపడి.. మూడు నెలల తర్వాత ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడీ ఆల్‌రౌండర్. 7 వికెట్లు తీసి, అర్ధశతకమూ సాధించి ఫిట్‌గానే ఉన్నానని చాటుకున్నాడు. కానీ, 70–80 శాతం ఫిట్నెస్తో జడేజాను మైదానంలో దించిన కోచ్ రవిశాస్త్రి... హార్దిక్‌ను మాత్రం ఇప్పుడే ఆడించి రిస్క్ తీసుకోలేం అంటున్నాడు. అంటే, ఇతడి విషయమూ చెప్పలేం అనే తెలుస్తోంది. మయాంక్ వైపు మొగ్గితే...? అసలే ఆస్ట్రేలియా... ఆపై కూకాబుర్రా బంతులు! వీటికితోడు పదునైన ప్రత్యర్థి పేస్. ఇలాంటిచోట కనీసం ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడకుండా మయాంక్ అగర్వాల్‌ను నేరుగా దించడం అంత మంచిది కాదన్నది మాజీల మాట. మరోవైపు 2017–18 సీజన్లో శతకాల మీద శతకాలు బాదిన మయాంక్ ప్రస్తుతం అంత గొప్ప ఫామ్‌లో లేడు. గత పది ఇన్నింగ్స్‌ల్లో రెండే అర్ధ శతకాలు సాధించాడు. అక్టోబరులో స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆడించి ఉంటే తనపై ఒత్తిడి లేకుండేది. ఇప్పుడు జట్టుకు అత్యంత అవసరమైన సందర్భంలో, రాణించాలన్న తీవ్ర ఒత్తిడి మధ్య ఆసీస్‌పై అరంగేట్రం అంటే అతడిని నిప్పుల్లోకి తోసినట్లే. రోహిత్... వచ్చేస్తానన్నాడు తొలి టెస్టులో మంచి అవకాశాలను చేజార్చుకుని విమర్శలపాలై... రెండో టెస్టుకు వెన్నునొప్పితో దూరమైన రోహిత్ శర్మది చిత్రమైన పరిస్థితి. భార్య ప్రసవ సమయం దగ్గరపడుతుండటంతో భారత్ వచ్చేద్దామని అతడు ప్రణాళికలు వేసుకున్నాడు. దీంతో మూడో టెస్టుకు అందుబాటులో ఉండడనే భావించారు. కానీ, ఇంకా జట్టుతోనే ఉన్నాడు. వెన్నునొప్పి తగ్గింది కానీ, మెల్బోర్న్ టెస్టుకు అనుమానమే అంటున్నాడు రవిశాస్త్రి. -
ధోనికి అండగా రోహిత్, రవిశాస్త్రి.. ఘాటుగా ఆన్సర్
సాక్షి, న్యూఢిల్లీ : కెరీర్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రి అండగా నిలిచారు. ధోనిని విమర్శిస్తున్న మాజీ క్రికెటర్లకు కనువిప్పు కలిగేలా సమాధానం చెప్పారు. తొలుత రోహిత్ శర్మ స్పందిస్తూ.. ‘ధోనిపై వస్తున్న విమర్శలు మేం పట్టించుకోం. ఆయన 2019 ప్రపంచ కప్ ధోని ఆడతాడా? అంటూ కొంతమందికి వస్తున్న సందేహాలు మమ్మల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. ధోని మంచి ఫామ్‌లోనే ఉన్నారు. ఆ విషయంలో ఎవరికీ సంకోచం అక్కర్లేదు. 4, 6 స్థానాల్లో ధోనికి అసలు వచ్చే బంతులే తక్కువ. దాంతో ఆయనకు పెద్దగా ఆడే అవకాశమే ఉండదు’ అని అన్నారు. మరోపక్క, రవిశాస్త్రి కూడా ధోనిని సమర్థిస్తూ .. ‘ధోనిపై విమర్శలు చేస్తున్నవారు.. తామూ ఆటగాళ్ళమే అని మరిచిపోవద్దు. 36 ఏళ్ల వయసులో వారైతే ఏం చేసేవారో ఆలోచించుకోవాలి’ అని ఆయన ఘాటుగా స్పందించాడు. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన టి-20లో 49 బంతుల్లో 37 పరుగులే చేసి టీమిండియా ఓటమికి కారణమయ్యాడంటూ ధోని పై తీవ్ర విమర్శలు రాగా ఆ సమయంలో విరాట్ కోహ్లి మాజీ కెప్టెన్‌కు పూర్తి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. -
శ్రీలంక ముమ్మర ప్రాక్టీస్..విశ్రాంతిలోభారత్..
విశాఖ స్పోర్ట్స్ : సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా శ్రీలంక జట్టు శుక్రవారం బ్యాటింగ్, బౌలింగ్‌లతో పాటు ఫీల్డింగ్‌ను ప్రాక్టీస్ చేసింది. భారత్ జట్టు విశ్రాంతి తీసుకోగా శ్రీలంక ప్రాక్టీస్‌లో పాల్గొంది. శ్రీలంక జట్టు కోచ్ పోతాస్ ఆటగాళ్లకు నెట్స్‌లోనే మెళకువల్ని నేర్పించారు. చమిరా ఫాస్ట్ బౌలింగ్‌కు మెరుగులు దిద్దుకోగా కెప్టెన్ పెరీరా నెట్ ప్రాక్టీస్‌లో ఉల్లాసంగానే గడిపాడు. బ్యాటింగ్‌కు ప్రాక్టీస్ చేశాడు. ఏంజిలియో తన ఫాస్ట్ బౌలింగ్‌కు మరింత పదును పెట్టేందుకు తోటి ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేశాడు. స్పిన్నర్లు సచిత్, డిసిల్వ సయితం ప్రాక్టీస్ చేశారు. వన్డే నిర్వాహక కమిటీ సమావేశం విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న వన్డే మ్యాచ్ నిర్వహణకై నిర్వాహక కమిటీ శుక్రవారం సమావేశమైంది. వైఎస్ఆర్ స్టేడియంలో నిర్వాహక కమిటీ చైర్మన్ ఎంటి కృష్ణబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అటగాళ్ల భద్రత ఏర్పాట్లు, టికెట్ల విక్రయాలు, అత్యవసర పరిస్థితిలో ఏర్పాట్లు, పిచ్‌తో పాటు ఔట్‌ఫీల్డ్ నిర్వహాణ తదితర అంశాలపై చర్చించారు. డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో ఫ్లడ్లైట్లను పరిశీలించారు. ఏసీఏ కార్యదర్శి అరుణ్‌కుమార్ , కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సృజన, డీసీపీలు ఫకీరప్ప, షిమోషిన్, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం సుదేశ్‌కుమార్, ఏసీఏ కార్యదర్శి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత్ జట్టు నెట్ ప్రాక్టీస్... గురువారమే విశాఖ చేరిన భారత్ జట్టు శుక్రవారం పూర్తిగా విశ్రాంతి తీసుకుంది. వాస్తవానికి సాయంత్రం నాలుగు గంటల నుంచి వైఎస్ఆర్ స్టేడియంలోని నెట్స్‌లో ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. శనివారం ఒంటిగంటన్నర నుంచి భారత్ జట్టు ప్రాక్టీస్ సెషన్ జరగనుంది. శ్రీలంక శనివారం సయితం పదిగంటలనుంచి ప్రాక్టీస్ చేసుకోనుంది. అప్పన్న సన్నిధిలో రవిశాస్త్రి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం టీం ఇండియా క్రికెట్ కోచ్ రవిశాస్త్రి , బ్యాటింగ్ కోచ్ సంజయ్బంగర్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ ధ్వజస్తంభం వద్ద దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం రవిశాస్త్రి, సంజయ్బంగర్ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా ప్రదక్షిణ చేశారు. –సింహాచలం (పెందుర్తి) -
బ్యాటింగ్ తీరు మెరుగుపడాలి: రవిశాస్త్రి
సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 3-0తో ప్రపంచ నంబర్‌వన్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించినప్పటికీ... స్పిన్ పిచ్‌లపై భారత బ్యాట్స్‌మెన్ ఆటతీరు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఏడాది కాలంలోనే విరాట్ కోహ్లి మంచి నాయకుడిగా ఎదిగాడని ఆయన ప్రశంసించారు. క్రమం తప్పకుండా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉంటున్నందున భారత జాతీయ జట్టు సభ్యులు దేశవాళీ టోర్నమెంట్లలో ఆడలేకపోతున్నారని ఆయన అన్నారు. -
రావిశాస్త్రి జయంతి సభ
ఈవెంట్ రావిశాస్త్రి 93వ జయంతి సభ జూలై 30న సాయంత్రం 6 గంటలకు విశాఖ పౌరగ్రంథాలయంలో జరగనుంది. సూత్రధారి: రావిశాస్త్రి తమ్ముడు రాచకొండ నరసింహశర్మ. అధ్యక్షత: ఎల్.ఆర్.స్వామి. ‘రావిశాస్త్రి సాహిత్యం-సామాజిక న్యాయం’ అంశంపై దుప్పల రవికుమార్, గరిమెళ్ళ నాగేశ్వరరావు, పేరి రవికుమార్, కె.జి.వేణు ప్రసంగిస్తారు. అద్దేపల్లి రామమోహనరావు, వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి, మంగు శివరామప్రసాద్, ఎస్.గోవిందరాజులు ప్రభృతులు పాల్గొంటారు. వివరాలకు రామతీర్థ ఫోన్: 9849200385 కవిత్వ కార్యశాల సాహితీస్రవంతి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని పౌరగ్రంథాలయంలో ఆగస్టు 2న(ఆదివారం) పూర్తిరోజు కవిత్వ కార్యశాల జరగనుంది. ఈ కవిత్వ శిక్షణా శిబిరాన్ని తెలకపల్లి రవి ప్రారంభిస్తారు. సీతారం, మేడిపల్లి రవికుమార్ నిర్వహిస్తారు. గంటేడ గౌరునాయుడు, అరుణ పప్పు, చందు సుబ్బారావు, వొరప్రసాద్, సత్యాజీ తదితరులు పాల్గొంటారు. పేర్లు నమోదు చేసుకునేవారు సాహితీ స్రవంతి అధ్యక్షులు ఎ.వి.రమణారావును 9848710507 నంబర్లో సంప్రదించవచ్చు. ‘గడియారం’ స్మారక పురస్కారం 35 ఏళ్లుగా రచన సాహిత్య వేదిక వారు అందిస్తున్న మహాకవి గడియారం వేంకట శేషశాస్త్రి స్మారక సాహిత్య పురస్కారం- 2015 కొరకు పద్యకావ్యాలను ఆహ్వానిస్తున్నాం. విజేతకు 5,000 రూపాయల నగదు, సత్కారం ఉంటాయి. పోటీకి పంపే పద్యకావ్య ముద్రణ జనవరి 1, 2011- డిసెంబర్ 31, 2014 మధ్యకాలంలో జరిగివుండాలి. 4 ప్రతుల్ని ఆగస్టు 31లోగా ఈ చిరునామాకు పంపండి: ఎన్.సి.రామసుబ్బారెడ్డి, 7/201-3ఇ, జయనగర్ కాలనీ, కడప-516002; ఫోన్: 7893089007 - విహారి, అధ్యక్షుడు ఫోన్: 9848025600.