న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. వీళ్లతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో కివీస్‌తో సిరీస్‌కు ద్రవిడ్‌కు విశ్రాంతిని కల్పించడాన్ని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తప్పుబట్టాడు.
కాగా భారత్ కోచ్‌గా రవిశాస్త్రి ఉన్న సమయంలో అతడు ఎప్పడూ జట్టుకు దూరం కాలేదు. కానీ ద్రవిడ్ విషయంలో మాత్రం అది కనిపించడం లేదు. అతడి స్థానంలో ఎదోక ఒక సిరీస్‌కు వివియస్ లక్ష్మణ్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టడం అనవాయితీగా మారిపోయింది.
గురువారం జరిగిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రవిశాస్త్రి మాట్లాడుతూ.. "బ్రేక్స్‌పై పెద్దగా నాకు నమ్మకం ఉండదు. ఎందకుంటే జట్టును విజయ పథంలో నడిపించాలంటే ఆటాగాళ్లతో ఎక్కువసమయం గడపాలి. అప్పడే జట్టుపై మనకు పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది. నిజం చెప్పాలంటే కోచ్‌లకు ఇన్ని బ్రేక్స్ అవసరమా? ఐపీఎల్ సమయంలో 2-3 నెలలు దొరుకుతుంది.
అది చాలు. మిగతా సమయాల్లో కోచ్ ఎప్పుడూ అందుబాటులోనే ఉండాలి" అని అతడు పేర్కొన్నాడు. ఇక నవంబర్ 18న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు.
చదవండి: Suryakumar Yadav: పచ్చబొట్టేసినా పిల్లదానా!.. నువ్వు లేకుంటే ఏమైపోయేవాడినో!
Comments
Please login to add a commentAdd a comment