
టీ20 ప్రపంచకప్-2022 నుంచి ఇంటిముఖం పట్టిన టీమిండియా.. ఇప్పుడు మరో పర్యటనకు సిద్దమవుతోంది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మహ్మద్ షమీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా.. వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నారు.
నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత పర్యటన షూరూ కానుంది. కాగా ఈ పర్యటనకు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు విశ్రాంతి ఇవ్వాలి అని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మరో సారి భారత తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
న్యూజిలాండ్ పర్యటనకు భారత టీ20 జట్టు..
హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
న్యూజిలాండ్ పర్యటనకు భారత వన్డే జట్టు..
శిఖర్ ధవన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్
చదవండి: T20 WC 2022: "అతడొక అద్భుతం.. ఒంటి చెత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉంది'
Comments
Please login to add a commentAdd a comment